10th Class Telugu Kottabata lesson Grammar || తెలుగు వ్యాకరణం 10వ తరగతి కొత్త బాట పాఠం నుండి Practice test-216

 

ఈ తెలుగు వ్యాకరణం కు సంబంధించిన  ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో 10ప్రశ్నలకు సమాధానాలు రాసి submit చేసిన తరువాత View Result లో వెంటనే మార్కులను తెలుసుకోవచ్చు. మరోసారి ప్రయత్నించి మార్కులను మెరుగుపరుచుకోవచ్చు Practice Test ను ఈ కింది లింక్ ను క్లిక్ చేసి👇రాయవచ్చు👇








ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం ఈ వెబ్ పేజీ చూడవచ్చు 👇










ప్రిపరేషన్ Gap లో కాసేపు రిలాక్స్ కావాలి అనుకునే వారి కోసం ఒక చిన్న సరదా సరదా జానపద హాస్య కథ 👇👇

ఒకళ్ళని మించినోడు ఇంకొకడు (జానపద హాస్యకథ)  రచయిత డా.ఎం.హరికిషన్-కర్నూల్-
*******
             ఒక వూళ్ళో ఒక ధనవంతుడు వుండేటోడు. వాడు బాగా సంపాదించి ఒక పెద్ద మేడ కట్టుకొన్నాడు. కానీ ఆ ఇంటికి వాకిలి కొంచం చిన్నగా వుంది. ఆ ధనవంతునికి చానామంది పనివాళ్ళు వుండేటోళ్ళు. యాడికీ కాలు కదిపే పని లేకుండా అన్నీ వాళ్ళే చూసుకునేటోళ్ళు. దానికి తోడు వానికి ఒకటే తిండి పిచ్చి. ఏది తినాలనిపిస్తే అది తెప్పిచ్చుకోని ఎంత తినాలనిపిస్తే అంత లాగించేటోడు. దాంతో ఆ ధనవంతుడు రోజు రోజుకీ లావైతా గున్నఏనుగులెక్క బలిసిపోయినాడు. దాంతో ఎప్పుడూ మేడ మీదనే వుండేటోడు.

ఒకరోజు దారిలో ఒక పిల్లోడు పోతా పోతా ఆ ఇంటి ముందాగి ఆ మేడను, పైన కూచున్న ధనవంతున్ని మార్చి మార్చి చూస్తా నవ్వుకోసాగినాడు. అది చూసి వాడు ''ఈ పిల్లోడెవడోగానీ నన్నూ, నా సంపదని చూసి చానా సంబరపడుతున్నట్టున్నాడు'' అని ముచ్చటపడి ఆ పొట్టెగాన్ని పైకి రమ్మని పిలిచినాడు.

వాడు పైకి వచ్చినాక ''ఏమి బాబూ... ఇంటినీ, నన్నూ చూసి అట్లా నవ్వుతా వున్నావు'' అని అడిగినాడు.

దానికి వాడు ''ఆ.... ఏం లేదు. నువ్వేమో బాగా బలిసిన గున్న ఏనుగులెక్క ఇంత లావున్నావు ఇంటి వాకిలి చూస్తేనేమో చానా చిన్నగా వుంది. మరి నువ్వు చస్తే నీ శవాన్ని బైటికి ఎట్లా తీసుకోనొస్తారు. కొంపదీసి గోడగాని పగలగొడతారా అని ఆలోచన వచ్చి నవ్వుకుంటా వున్నా'' అన్నాడు.

ఆ మాటలకు వానికి చానా కోపం వచ్చింది. ''వీడెవడో గానీ చానా అతికమోని లెక్కున్నాడు. వీళ్ళ పెద్దవాళ్ళను పిలిపిస్తే... ఎవరితో ఎట్లా మాట్లాడాల్నో కొంచం బుద్ధి చెబుతారు'' అనుకోని పనోళ్ళని పిలిపించి వాళ్ళింటి కాడ ఎవరైనా వుంటే పిలుచుకోని రమ్మన్నాడు. వాళ్ళు పోయి వాళ్ళ అన్నను పిలుచుకోని వచ్చినారు.

ఆ ధనవంతుడు జరిగిందంతా చెప్పి ''వీడు చిన్నా పెద్దా లేకుండా ఏది బడితే అది వాగుతా వున్నాడు. కొంచం బుద్ధి చెప్పండి'' అన్నాడు. వాళ్ళ అన్న కోపంగా తమ్ముని వంక తిరిగి ''ఏంరా.... కొంచమన్నా బుద్ధుందా నీకు. శవం తలుపులోంచి బైటకు రాకపోతే బంగారంలాంటి గోడను బద్ధలు కొడతారా ఎవరైనా. అంతగా అయితే ముక్కలు ముక్కలుగా నరికి తీసుకోనొస్తారు గానీ.... ఆ మాత్రం గూడా తెలీదా.... ఇంత ఎత్తు ఎదిగినావు. థూ.... థూ.... నిన్ను నా తమ్ముడని చెప్పుకోడానికే సిగ్గుగా వుంది'' అని తిట్టసాగినాడు.

ఆ మాటలు వినేసరికి ధనవంతుడు అదిరిపోయినాడు. ''తమ్ముడే అనుకుంటే అన్న కూడా తక్కువోడేం కాదు. ఒకరిని మించిన ఘనులు ఇంకొకరు వున్నట్టున్నారు. వీళ్ళిద్దరికీ బాగా బుద్ధి చెప్పాలి'' అనుకోని వాళ్ళ నాయనను పిలిపించినాడు. ''నీ ఇద్దరు కొడుకులూ చిన్నా పెద్దా లేకుండా నోటికి ఏదొస్తే అది అడ్డంగా వాగుతా వున్నారు. నువ్వయినా కాస్త గడ్డిపెట్టు వీళ్ళకి'' అంటా జరిగిందంతా చెప్పినాడు.

దాంతో వాళ్ళ నాయన సలసలసల మండిపోతా కొడుకుల వంక తిరిగి ''ఏంరా... వాళ్ళు డబ్బున్నోళ్ళు. చస్తే గోడ బద్దలు కొట్టాల్సిన అవసరమూ లేదు. అట్లాగని శవాన్ని ముక్కలు ముక్కలు చేసి బైటకు తీయాల్సిన అవసరమూ లేదు. ఇంట్లోనే గుంత తీసి బూంచి పెడతారు. లేకుంటే ఇంటి మధ్యలో శవం పెట్టి మొత్తం ఇంటినే తగలబెడతారు. అయినా మధ్యలో మనకెందుకు. వాళ్ళ శవం వాళ్ళిష్టం. మనం వూరికే చూడాల గానీ అనవసరంగా నోరు పారేసుకోగూడదు'' అన్నాడు.

ఆ మాటలింటా వుంటే ధనవంతునికి నోట మాట రాలేదు. ''ఓరి దేవుడోయ్‌.... అన్నాదమ్ములే అనుకుంటే వాళ్ళ నాయన గూడా తక్కువోడు గాదు. వీళ్ళ మాటలింటా వుంటే ఇప్పుడే ఈన్నే చచ్చిపోయేటట్లు వున్నాను. వీళ్ళకు చెప్పాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ'' అనుకుంటా అందరినీ ఆన్నుంచి తన్ని తరిమేసినాడు.
********
రచయిత  డా.ఎం.హరికిషన్-కర్నూల్-గారికి ధన్యవాదములు
*******
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.