SscTelugu Vyakaranam || 10th Class Telugu Vyakaranam || telugu grammar || తెలుగు వ్యాకరణం తెలుగు గ్రామర్

ఈ పదవ తరగతి తెలుగు వ్యాకరణం కు సంబంధించిన  ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో 10ప్రశ్నలకు సమాధానాలు రాసి submit చేసిన తరువాత View Result లో వెంటనే మార్కులను తెలుసుకోవచ్చు. మరోసారి ప్రయత్నించి మార్కులను మెరుగుపరుచుకోవచ్చు Practice Test ను ఈ కింది లింక్ ను క్లిక్ చేసి 👇రాయవచ్చు👇

👉తెలుగు వ్యాకరణం📝ప్రాక్టీస్ టెస్ట్ 210 here👈


ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం ఈ వెబ్ పేజీ చూడవచ్చు👇👇

👉www.thelearnersedu.com👈


👉Our ప్రిపరేషన్ YouTube Channel Subscribe👈


👉రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి గురించిన GK bits👈

👉 ప్రిపరేషన్ Telegram గ్రూప్ join here👈







         🙏🤝 Thank you Visit Again 🤝🙏


ప్రిపరేషన్ Gap లో కాసేపు రిలాక్స్ కావాలి అనుకునే వారి కోసం ఒక చిన్న సరదా సరదా జానపద హాస్య కథ👇👇
మక్కికి మక్కి- జాతీయం 🪰🪰వెనుక ఉన్న కథ -
*********
        ఉన్నది వున్నట్లుగా ఒక్క అక్షరం ముక్క గూడా తేడా లేకుండా పులుస్టాపులు, కామాలతో సహా రాస్తే దానిని మక్కికి మక్కి అంటారు. (・o・)అచ్చు గుద్దినట్లు, తూచా తప్పకుండా అని కూడా ఈ జాతీయాన్ని వాడతారు.

నిజానికి మక్కికి మక్కి అనేది వ్యంగ్యంగా వ్యతిరేకార్థంలో వాడే పదం. కొందరు ఎదుటివారు రాసింది రాసినట్లు అచ్చుదింపేటప్పుడు... వాళ్ళు చేసిన తప్పులు, పొరపాట్లు గూడా అలాగే రాసేస్తుంటారు. కొంచం గూడా స్వంత తెలివితేటలు ఉపయోగించరు. w(°o°)wఏమాత్రం తెలివితేటలు ఉపయోగించకుండా వున్నది వున్నట్లు రాస్తే దానిని మక్కికి మక్కి అనవచ్చు.

పరీక్షల్లో కొందరు కాపీలు కొడుతూ వుంటారు. కాపీలో జవాబు సగం ముందు, సగం వెనుక పేజీలో వున్నప్పుడు... మొదటి పేజీ చివర త్రిప్పి చూడుడు లేదా మిగతా జవాబు వెనుక పేజీలో అని వుంటుంది. ఈ బుర్రలేని కాపీ రాయుళ్ళు, దానిని ఏమాత్రం గ్రహించకుండా తమ జవాబు పత్రాల్లో గూడా 'త్రిప్పి చూడుము' అని రాసేస్తూ వుంటారు. ƪ(˘⌣˘)ʃదానినే మక్కికి మక్కి అంటారు.

మక్కి అంటే ఈగ. మక్కికి మక్కి అంటే ఈగకు ఈగ అని అర్థం. ఒక విద్యార్థి రాత్రి సైన్సు నోట్సు రాస్తూ వున్నాడు. అక్కడ కొన్ని ఈగలు తిరుగుతున్నాయి. ఆ పిల్లవాడు నోట్సు ¯\(◉‿◉)/¯పూర్తి చేసి పుస్తకం మూసేటప్పుడు అనుకోకుండా ఒక ఈగ పుస్తకం మధ్యలోకి పోయింది. అంతే పాపం అది అక్కడికక్కడే చచ్చిపోయి కాగితానికి అంటుకు పోయింది. తరువాత రోజు ఆ పుస్తకాన్ని వాని స్నేహితుడు తీసుకొని పోయాడు. వానికి కొంచం గూడా బుర్ర లేదు. నోట్సు ఎత్తి రాస్తున్నాడు. అట్లా రాస్తా వున్నప్పుడు ఒక పేజీలో చచ్చిన ఈగ పేజీ మధ్యలో అంటుకొని కనబడింది. వెంటనే వాడు గూడా కష్టపడి ఒక ఈగను పట్టుకొని చంపి దానికి గమ్ము వేసి పేజీ మధ్యలో అంటించినాడంట. సార్ పుస్తకాలు చూస్తున్నప్పుడు మధ్యలో ఈగ కనబడితే "ఏరా ఇక్కడ ఈగ పడితే చూసుకోలేదా" అన్నాడు. దానికి వాడు గర్వంగా(。•́︿•̀。) "సార్... మన రాము నోట్సులో ఈగ వుంటే నేను కూడా కష్టపడి ఈగను చంపి అతికించా సార్" అన్నాడట. విషయం తెలిసి తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలూ పడీ పడీ నవ్వుతూ "అయితే 'మక్కికి మక్కి' (ఈగకు ఈగ) దించేశావన్నమాట" అన్నారు. అలా ఈ జాతీయం ఉద్భవించింది.
*********
రచయిత Dr.M. హరికిషన్ సార్ కు ధన్యవాదములు
*********
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.