Today Current Affairs in Telugu GK BITS MCQ || Sports important GK questions in Telugu Cricket score live

 

 Gk Current Affairs లో క్రీడలు ప్రత్యేకతలు అంశం గురించి ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో 10ప్రశ్నలకు సమాధానాలు రాసి submit చేసిన తరువాత View Result లో వెంటనే మార్కులను తెలుసుకోవచ్చు. మరోసారి ప్రయత్నించి మార్కులను మెరుగుపరుచుకోవచ్చు Practice Test ఈ కింది లింక్ ను క్లిక్ చేసి 👇రాయవచ్చు👇

ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం ఈ వెబ్ పేజీ చూడండి👇👇






,👉join ప్రిపరేషన్ Telegram గ్రూప్ 👈


👉Pr.టెస్ట్ తెలంగాణ జాగ్రఫీ కొత్త జిల్లాలు👈


👉 Pr. టెస్ట్ తెలుగు వ్యాకరణం 👈


👉 Practice Test జనరల్ సైన్స్📝👈



🤝🙏Thank you Visit Again 🤝🙏


ప్రిపరేషన్ Gap లో కాసేపు రిలాక్స్ కావాలి అనుకునే వారి కోసం ఒక చిన్న సరదా సరదా జానపద హాస్య కథ👇👇

బిచ్చగాళ్ళు బిర్యానీ (నవ్వుల్లో ముంచెత్తే జానపద కథ)

 👇👇

*******

         ఒకూర్లో ముగ్గురుᕙ(  • ‿ •  )ᕗ బిచ్చగాళ్ళు వుండేటోళ్ళు. వాళ్ళలో ఒకడేమో కుంటోడు. ఇంకొకడేమో గూనోడు. మరొకడేమో గుడ్డోడు. ముగ్గురూ బాగా కలసి మెలసి వుండేటోళ్ళు. ప్రతిరోజూ పొద్దున్నే ఒకొక్కరు ఒక్కొక్క వైపుకు పోయి వూరంతా తిరిగి అడుక్కునేటోళ్ళు. సాయంకాలం కాగానే తిరిగి అందరూ కలసి,ᕦ⊙෴⊙ᕤ తాము తెచ్చుకున్నదల్లా హాయిగా తిని పడుకొనేటోళ్ళు. వాళ్ళ ముగ్గురికీ చానా రోజుల నుండీ జీవితంలో కనీసం ఒక్కరోజైనా బాగా వేడి వేడి బిరియానీ చేసుకోని కడుపు నిండా తినాలని చానా కోరికగా వుండేది. కానీ బిరియానీ చేసుకోవాలంటే చానా డబ్బులు కావాల గదా... ఏ రోజు అడుక్కొచ్చినవి ఆ రోజు తినడానికే సరిపోయేవి కావు. మరెలా... దాంతో వాళ్ళు ముగ్గురూ బాగా ఆలోచించి ప్రతిరోజూ రూపాయో, అర్ధరూపాయో దాచిపెట్టడం మొదలు పెట్టినారు. అట్లా కొన్ని రోజులు గడచిపోయినాయి. ఒకరోజు ముగ్గురికీ బిరియానీ ᕙ(͡°‿ ͡°)ᕗతినాలనే కోరిక బాగా పెరిగిపోయింది. దాంతో సంతకు పోయి వున్న కొంచెం డబ్బులతో సరుకులు వచ్చినన్ని కొనుక్కొచ్చుకున్నారు. ముగ్గురూ సంబరంగా ఆడతా, పాడతా బిరియానీ వండడం మొదలుపెట్టినారు. బియ్యం, నూనె, మసాలా, కారం, ఉప్పు అన్నీ సమపాళ్ళలో వేసినారు. ᕙ(͡°‿ ͡°)ᕗకాసేపటికి ఘుమఘుమలాడుతా బిరియానీ తయారైంది. ఆ కమ్మని వాసనకి ముగ్గురి నోళ్ళలోనూ నీళ్ళు వూరసాగినాయి. లొట్టలేసుకుంటా తిందామని ఆత్రంగా మూత తెరచి చూస్తే ఇంగేముంది బియ్యం తక్కువ కావడంతో బిరియానీ కొంచమే తయారైంది. ముగ్గురూ తింటే ఎవరికీ కడుపు నిండదు. ఎవరికో ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. ''తింటే ఎవడో ఒకడు కడుపు నిండా తినాలగానీ... ముగ్గురమూ కొంచెం కొంచెం తిని ఏం లాభం'' అనుకున్నారు. మరి ముగ్గురిలో ఎవరు తినాల...ᕙ༼◕ ᴥ ◕༽ᕗ ముగ్గురికీ దాన్ని తినాలనే వుంది. అందుకని బాగా ఆలోచించి ''మనం ముగ్గురమూ పండుకొని నిద్రపోదాం. పొద్దున్నే లేచి రాత్రి ఎవరెవరికి ఏమేం కలలొచ్చినాయో చెప్పుకుందాం. ఎవరికి మంచి కల వస్తే వాళ్ళకే బిరియానీ'' అనుకున్నారు. సరేనని ముగ్గురూ నిద్రపోయినారు. గుడ్డోడు, గూనోడు నిద్రపోయిన కాసేపటికి నెమ్మదిగా కుంటోడు నిద్ర లేచి చప్పుడు కాకుండా మట్టసంగా బిరియానీ అంతా నున్నగా తినేసి, ఏమీ ఎరుగని అమాయకునిలెక్క హాయిగా నిద్రపోయినాడు.ᕙ( ~ . ~ )ᕗ పొద్దున్నే ముగ్గురూ నిద్రలేచినారు. గుడ్డోనికి, గూనోనికి కుంటోడు బిరియానీ తినేసింది తెలీదు గదా. అందుకని గూనోడు ఎలాగైనా బిరియానీ తినాలనుకోని రాత్రి వానికి ఏ కలా రాకపోయినా ''రేయ్‌.నాకు నిన్న రాత్రి ఎంత అద్భుతమైన కలొచ్చిందో తెలుసా.నేను కలలో హైదరాబాద్‌కు పోయినా, అక్కడ చార్మినార్‌, గోల్కొండ, బిర్లామందిర్‌, అసెంబ్లీ అన్నీ చూసినా. (・o・)అంతలో మన ముఖ్యమంత్రి కలసి ఏరా గూనోడా... బాగున్నావా అంటూ పలకరించి వాళ్ళింటికి తీస్కోనిపోయి వద్దు వద్దన్నా వినకుండా మంచి బిరియానీ పెట్టించినాడు. అబ్బ భలే రుచిగా వుందిలే'' అన్నాడు. ఆ మాటలిన్న గుడ్డోడు వెంటనే ''ఓర్నీ నీవు హైదరాబాద్‌కు పోయినావా. నిన్న రాత్రి నేను ఏకంగా మన దేశ రాజధాని \(°o°)/ఢిల్లీకి పోయినా, నన్ను చూస్తానే మన ప్రధానమంత్రి వురుక్కుంటా వచ్చి కౌగిలించుకోని వాళ్ళింటికి తీస్కోనిపోయి వద్దువద్దన్నా వినకుండా మాంచి బిరియానీ తినిపించినాడు. అబ్బ ఏం రుచిలే'' అన్నాడు. ఇద్దరి మాటలూ (((;ꏿ_ꏿ;)))విన్న కుంటోడు మాత్రం ఏమీ మాట్లాడకుండా గమ్మున కూర్చున్నాడు. అది చూసి ''ఏంరా. అట్లా గమ్మున కూచున్నావు. నీకేమీ కల రాలేదా'' అన్నాడు కుంటోడు. ఆ మాటలకు కుంటోడు ''ఏం చెప్పమంటారన్నా. నిన్న రాత్రి అట్లా నిద్రపోయినానో లేదో.. వెంటనే ఒక పెద్ద రాక్షసుడొచ్చినాడు. వాడు నన్ను లేపి రేయ్‌... మర్యాదగా నువ్‌ బిరియానీ తింటావా లేక నన్ను నిన్ను తినమంటావా అని భయపడిచ్చినాడు. నాకేం చేయాల్నో తోచలేదు. నిన్ను పిలుద్దామా అంటే నువ్వేమో హైదరాబాదులో ముఖ్యమంత్రితో కలసి బిరియానీ తింటా వుంటివి. గుడ్డోన్ని పిలుద్దామా అంటే వాడేమో ఏకంగా ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర కూచోని బిరియానీ తింటా వున్నాడు. దాంతో ఏం చేయాల్నో ヾ(*’O’*)/అర్థంగాక నా ప్రాణాలు కాపాడుకోడానికి... ఎట్లాగూ మీరిద్దరూ ఆడ బిరియానీ తింటున్నారు గదా అని నేను ఈడ బిరియానీ అంతా తినేసినా?'' అన్నాడు. అంతే ఆ మాటలకు తిరిగి ఏం మాట్లాడాలో అర్థంగాక గుడ్డోడు, గూనోడు నోళ్ళుw(°o°)w తెరిచినారు.

********

డా.ఎం.హరికిషన్ - (రచయిత) గారికి ధన్యవాదములు

********

కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.