Telangana History Important Questions || Kutubshaahilu MCQ BITS General Studies Test -1

ఈ తెలంగాణ చరిత్ర- కుతుబ్షాహీల పాలన కు సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ ను కింద ఇవ్వబడిన వెబ్ పేజీలో రాసిన తర్వాత SUBMIT చేసి VIEW RESULTS లో వెంటనే మార్కులు తెలుసుకోవచ్చు, మార్కులు పెంచుకోవడం కోసం అవసరమైతే మరొకసారి కూడా రాయవచ్చు👇👇

👉ప్రాక్టీస్ టెస్ట్-1Telangana History కుతుబ్ షాహీలు 👈


 ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం ఈ కింది వెబ్ పేజీ 👇చూడండి 👇










ప్రిపరేషన్ Gap లో కాసేపు రిలాక్స్ కావాలి అనుకునే వారి కోసం ఒక చిన్న సరదా నీతి కథ 👇👇
👇ఏదిముఖ్యం👇
********
       ఒక అడవిలో ఒక సాధువు (((;ꏿ_ꏿ;)))వుండేవాడు. ఆయన చిన్నప్పటి నుంచి అనేక దేశాలు తిరిగి, అనేక మంది పండితులను కలసి వారి నుండి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాడు. వయసు పైబడడంతో తిరిగే శక్తి లేక అంతవరకు తాను సంపాదించిన జ్ఞానాన్నంతా తెలియజేయడానికి ఒక అడవిలో చిన్న కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అడవికి చుట్టు పక్కల వుండే గ్రామాల్లో తిరుగుతూ నైతికవిలువల గురించి, సత్ప్రవర్తన గురించి అందరికీ అర్థమయ్యేలా చిన్న చిన్న కథలతో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. దాంతో అతి కొద్దికాలంలోనే ఆ సాధువుకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అనేక మంది శిష్యులు ఏర్పడ్డారు. రోజూ చాలా మంది అతని కుటీరానికి వచ్చి అతన్ని దర్శించి అతను చెప్పే w(°o°)wఉపన్యాసాలను శ్రద్ధగా వినేవారు.

ఒకసారి అతని శిష్యులు "స్వామీ... మీ కుటీరం చాలా పాతగయింది. చిన్నగయింది, యిరుకయింది. వచ్చేవారికి సరియైన వసతులు లేవు. కాబట్టి ఒకేసారి వేయి మంది కూర్చుని వినడానికి వీలుగా వంద మంది అతిథులైనా సరే రాత్రి హాయిగా బస చేసే విధంగా గదులు,(‘◉⌓◉’) వంటశాల ఏర్పాటు చేద్దాం ఏమంటారు" అన్నారు.

దానికా సాధువు చిరునవ్వు నవ్వి “అలాగే, మీ ఉత్సాహాన్ని ఆపడం ఎందుకు, చుట్టూ వున్న గ్రామాల్లో మన శిష్యులు అనేకమంది వున్నారు గదా... (´⊙ω⊙`)!అందరినీ కలసి, విషయం వివరించి, చందాలు స్వీకరించండి. మొత్తం నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో లెక్కవేసి, ఆ మొత్తం సమకూరగానే చందాలు స్వీకరించడం ఆపు చేసి పని మొదలు పెట్టండి" అన్నాడు. దానితో శిష్యులు చందా కోసం తిరగడం మొదలు పెట్టారు. ఎవరినీ నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా ఎంత ఇస్తే అంత తీసుకోసాగారు. వాళ్ళు అనుకున్నట్టు పదిలక్షల బంగారు వరహాలు సమకూరడానికి మూడు సంవత్సరాలు పట్టింది. నిర్మాణం మొదలు పెట్టడానికి సంతోషంగా ƪ(˘⌣˘)ʃసిద్ధం కాసాగారు.

అంతలో అనుకోకుండా ఆ ప్రాంతమంతా పెద్ద కరువు వచ్చింది. ఆకాశం నుండి ఒక్క నీటి బొట్టు గూడా భూమిని చేరలేదు. పొలాలు(^∇^)ノ♪ బీడువారి నోళ్ళు తెరిచాయి. మనుషులకే గాక పశువులకు కూడా తిండి దొరకడం కష్టమయిపోయింది. దాంతో అనేకమంది ప్రజలు ఇళ్ళకు తాళాలేసి కట్టుబట్టలతో వలస పోవడం మొదలుపెట్టారు. 

ఇదంతా చూసిన సాధువు 乁༼☯‿☯✿༽ㄏతన శిష్యులను పిలిచి “మన దగ్గర పది లక్షల బంగారు వరహాలున్నాయి గదా. ఆ ధనంతో ఈ గ్రామాలను ఆదుకోండి" అన్నాడు.

దానికా శిష్యులు "స్వామీ మూడు సంవత్సరాల పాటు ఇల్లిల్లూ తిరిగి సేకరించిన ధనమిది. ఇలా ఒక్కసారిగా ఖర్చు పెడితే మరలా ఆశ్రమాన్ని ఇప్పట్లో విస్తరించలేం" 乁( •_• )ㄏఅన్నారు.

సాధువు చిరునవ్వు నవ్వి, “ఆశ్రమం నిర్మించకపోవడం వలన ఇప్పుడు మనకుగానీ, సమాజానికి గానీ వచ్చిన నష్టం కానీ, ప్రమాదం గానీ ఏమీ లేదు. కానీ పేద ప్రజలు ఆకలితో మరణిస్తే ఆ పాపం మనమే మోయవలసి వుంటుంది. అదీగాక ఈ సొమ్ము ప్రజలదే కానీ మన కష్టార్జితం కాదు. అందువల్ల దీని మీద మనకు అధికారం లేదు" అన్నాడు.

దానితో శిష్యులు乁( •_• )ㄏ "అలాగే స్వామీ.. రేపే చుట్టుపక్కల వున్న అన్ని గ్రామాల్లో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయిస్తాం. ఆకలిచావులు లేకుండా కాపాడతాం" అన్నారు.

సాధువు చిరునవ్వు నవ్వి “శిష్యుల్లారా.. అలా అన్నదానం చేస్తే ధనాన్ని వ్యర్థంగా మురికి కాలువలో పారవేసినట్లే. వాళ్ళు పోతున్నది ఉచితంగా పెట్టే తిండి కోసం కాదు, పనుల కోసం. కాబట్టి వారికి వాళ్ళ ఉరిలోనే పని కల్పించండి. తమ సంపాదనతో తలెత్తుకొని గౌరవంగా బతుకుతారు. అదే సమయంలో వాళ్ళతో చేపించే పని ముందు ముందు ఆ గ్రామం బాగు పడడానికి కూడా ఉపయోగపడాలి" ( ・ั﹏・ั)అన్నాడు.

శిష్యులు దానికి తలూపి “చెప్పండి స్వామీ... గ్రామాల్లో చెరువులు తవ్వించాలా, పూడికలు తీయించాలా, రహదారులు వేయించాలా,(~_~;) పాఠశాలలు నిర్మించాలా, బీడుభూములు సాగులోకి తీసుకురావాలా, కాలువలు నిర్మించాలా... ఏం చేయమంటారో చెప్పండి" అన్నారు.

సాధువు నవ్వి "ఏ గ్రామానికి ఏమి అవసరమో ఇక్కడ కూర్చుని మనం నిర్ణయించకూడదు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకమైన సమస్య వుంటుంది. అది ఆ గ్రామస్తులే చెప్పగలరు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి వారి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగండి. మన ఆశ్రమం కొత్తది నిర్మించలేకుంటున్నాం అని నిరాశ పడకండి. కరువు పోయి వానలు పడి ప్రజల చేతుల్లో పైసలు గలగలలాడడం మొదలు పెడితే వాళ్ళే మరలా సంబరంగా ముందుకు వచ్చి నిర్మిస్తారు " (・_・;)అన్నాడు.

శిష్యులు తరువాత రోజే చిన్న చిన్న బృందాలుగా విడిపోయి చుట్టూ వున్న గ్రామాలకు తరలిపోయారు.
*******
డా.ఎం.హరికిషన్ - కర్నూలు - రచయిత గారికి కృతజ్ఞతలు 
*******
కథ నచ్చితే *SHARE* చేయండి(。◕‿◕。)➜. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

🤝🙏Thank you & Visit Again 🤝🙏