Indian Economy important previous Questions MCQ BITS in Telugu || GS GK BITS MCQ


ఈ INDIAN ECONOMY ప్రాక్టీస్ టెస్ట్ ను కింద ఇవ్వబడిన వెబ్ పేజీలో రాసిన తర్వాత SUBMIT చేసి VIEW RESULTS లో వెంటనే మార్కులు తెలుసుకోవచ్చు, మార్కులు పెంచుకోవడం కోసం అవసరమైతే మరొకసారి కూడా రాయవచ్చు👇👇

ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం ఈ కింది వెబ్ పేజీ చూడండి 👇👇














ప్రిపరేషన్ Gap లో కాసేపు రిలాక్స్ కావాలి అనుకునే వారి కోసం ఒక చిన్న సరదా సరదా జానపద హాస్య కథ
బతకాలంటే పారిపో - హాస్య నీతి కథ* 
******
     ఒక కలుగులో ԅ( ͒ ۝ ͒ )ఒక ఎలుక వుండేది. ఆ ఎలుకకు ఒక చిన్నపిల్ల వుండేది. ఆ పిల్లకు కలుగులోంచి బైటకు పోయి అడవంతా తిరిగి రావాలని ఒకటే కోరిక. కానీ వాళ్ళ అమ్మ బైటికి పంపేది కాదు.
       *నీవు ఇంకా చిన్న పిల్లవు. ఎవరు మనవాళ్ళో ఎవరు పగవాళ్ళో తెలియదు. ఆపదలు ఎదురైనప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాక పోదువులే అని చెప్పేది.* 
ఒక రోజు ఎలుకపిల్ల వాళ్ళ అమ్మ ఆహారం తేవడానికి బైటకు పోగానే ఎవరికీ చెప్పకుండా తాను కూడా (´⊙ω⊙`)!బైటకు పోయింది.
అడవిలో వుండే రంగు రంగుల పూలు, పచ్చని మొక్కలూ చూసి సంబరంగా ఎగరి గంతులు వేయసాగింది. అంతలో ఆకాశంలో తిరుగుతున్న ఒక గద్ద ఈ ఎలుక పిల్లను చూసింది. దానికి నోటిలో సర్రున నీళ్లు ఊరినాయి.w(°o°)w ఆహా దొరికిందిరా కమ్మని విందు భోజనం అనుకుంటా ... ఆ ఎలుకను పట్టుకోవడానికని పైనుంచి దూసుకొచ్చింది.
గద్దను చూసిన ఎలుకపిల్ల అదిరిపడింది. ఓరినాయనోయ్... \(◎o◎)/దీనికి గనుక దొరికినానంటే ఈ రోజుతో భూమి మీద నూకలు చెల్లిపోతాయి అనుకుంది. ఆ గద్ద నుంచి  తప్పించు కోవడానికి చించుకోని ఉరకసాగింది. అలా ఉరుకుతావుంటే దానికి ఒక చెట్టుకింద ఒక చిన్న కన్నం కనబడింది. వెంటనే అది సర్రున దానిలోకి దూరి దాచి పెట్టుకొంది. గద్ద ఆ కన్నంలోకి దూరలేక అక్కడే ఆకాశంలో కాసేపు తిరిగి వెళ్ళిపోయింది.
ఎలుకపిల్ల హమ్మయ్య... ▼・ᴥ・▼ఆపద నుంచి తప్పించుకున్నాను అనుకొంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా బైటికి రాసాగింది. అంతలో దానికి వెనుకనుంచి బుస్సుమనే చప్పుడు వినబడింది. అదిరిపడి వెనక్కు తిరిగి చూసింది. ఇంకేముంది నోరు తెరుచుకున్న పెద్ద నాగుబాము కనబడింది.
“అరెరే... నేను దూరింది /ᐠ。ꞈ。ᐟ\పాము కన్నంలోనా" అని అదిరిపడి వెనక్కి తిరిగి మరలా ఉరకసాగింది. దానిని పట్టుకోడానికి పాము వెంటబడింది.
ఎలుకపిల్ల ఉరుక్కుంటా పోతావుంటే దానికి ఒక జొన్న చేను కనబడింది. వెంటనే లోపలికి పోయి ఒక జొన్నచెట్టు◖⚆ᴥ⚆◗ వెనుక దాచిపెట్టుకొంది.
పాము ఆ ఎలుకపిల్ల కోసం వెతికి వెతికీ అది కనబడక అక్కడినుంచి వెళ్ళిపోయింది.
పాము నుంచి తప్పించుకున్న ఎలుకపిల్ల 'హమ్మయ్య' అనుకుంటూ చుట్టూ చూసింది. దానికి ఒక జొన్నచెట్టుకు మంచి కంకి కనబడింది. దానిని తెంచుకోని హాయిగా తినసాగింది.
అంతలో ఆ పొలం రైతు ఆ ఎలుకపిల్లను చూశాడు.
“దొంగసచ్చిందానా... నా పంటను నాశనం చేయడానికి వచ్చినట్టున్నావే" అంటూ కర్ర తీసుకోని దానిని కొట్టడానికి వచ్చాడు.
అంతే ఆ ఎలుకపిల్ల అదిరిపడి జొన్న కంకి అక్కడే పారేసి మరలా ఉరకడం మొదలు పెట్టింది.
అలా ఉరుకుతా...(^._.^)ノ ఉరుకుతా... పోతావుంటే దానికి ఒక ఇల్లు కనబడింది. సర్రున పోయి ఆ ఇంటిలో దూరింది. రైతు ఎలుకపిల్ల ఎక్కడా కనబడకపోవడంతో తిరిగి వెళ్ళిపోయాడు...
ఇంటిలో డబ్బాల చాటున దాచిపెట్టుకున్న ఎలుకపిల్ల కాసేపటికి నెమ్మదిగా బైటి కొచ్చింది. ఇంటిముందు పెద్ద తోట ఉంది. ఆ తోటలో సంబరంగా తిరుగుతా వుంటే మియావు అన్న అరుపు వినబడింది. తలెత్తి చూసింది. ఇంకేముంది ఎదురుగా ఒక పెద్ద పిల్లి.
అంతే... ఆదిరిపడి మళ్ళీ ఇంటిలోకి ఉరికింది. ఇదేందిరా ఈ లోకంలో ఎక్కడికి పోయినా ఆపదలు వెంటబడి టారుముతా ఉన్నాయి అనుకుంది.
అలా ఉరుకుతావుంటే దానికి ఒకచోట ఒక ఇనుప బుట్ట కనబడింది. (ᵔᴥᵔ)సర్రున దానిలోకి దూరింది. అంతే దాని మూత దభీమని పడిపోయింది. పిల్లి ఆ ఇనుప బుట్టలోపల ఉన్న ఎలుకపిల్లను ఏమీ చేయలేక కాసేపు దాని చుట్టే తిరిగి వెళ్ళిపోయింది.
పిల్లి వెళ్ళిపోగానే ఎలుకపిల్ల ఆ ఇనుప బుట్ట నుండి బైటకు రావాలనుకొంది. కానీ దాని తలుపు తెరుచుకోలేదు. అప్పుడు ఆ ఎలుకపిల్లకు తాను ఇరుక్కున్నది ఎలుకల బోనులో అని తెలిసిపోయింది. పెన్నం మీదనుంచి పొయ్యిలో పడటం అంటే ఇదేనేమో అనుకుంది. (◕ᴥ◕)అంతలో ఆ ఇంటిలో ఉన్న చిన్న పాప అక్కడికి వచ్చింది.
బోనులో వున్న ఎలుకను చూసి “నాన్నా..నాన్నా..ఎలుకపిల్ల బోనులో పడింది" అని గట్టిగా అరుచుకుంటా పోయి వాళ్ళ నాన్నకు చెప్పింది.
ఎలుకపిల్లకు ఏం చేయాలో తెలియలేదు. ఆ పాప నాన్న గనుక వచ్చాడంటే చంపడం ఖాయం. ఏం చేయాలా అని ఆలోచించ సాగింది. అంతలో దానికి ఒక ఉపాయం ◖⚆ᴥ⚆◗తోచింది.
వెంటనే ఊపిరి బిగపట్టి వెల్లకిల్లా అచ్చం చచ్చిపోయినదాని మాదిరి పడిపోయింది. అతను వచ్చి చూశాడు. “అరెరే... చచ్చిపోయిందే" అనుకోని తోక పట్టుకొని బోనులోంచి  తీసి విసిరి దిబ్బలో పడేశాడు.
అంతే... అలా పారేసిన వెంటనే ఆ ఎలుక ఒక్క నిమిషంగూడా ఆగకుండా రాకెట్టు లెక్క సర్రున దూసుకొని పోయి వాళ్ళింటికి చేరుకొంది. 
“చిన్న పిల్లలు ఒంటరిగా బైటకి పోతే ఎన్ని ఆపదలు ఎదురవుతాయి. ఇంకెప్పుడూ అమ్మ తోడు లేకుండా అస్సలు బైటికి పోగూడదు"ʕ º ᴥ ºʔ అనుకొంది.
*****
రచయిత గారికి ధన్యవాదములు 👉👇  డా.ఎం.హరికిషన్ - కర్నూలు - 
*****
కథ నచ్చితే SHARE చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
🙏🤝 Thank you Visit Again 🤝🙏