👇మెరుగుపరుచుకోవచ్చు👇
👉TET సైకాలజీ Practice రివిజన్ Test-10👈
ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం ఈ 👇వెబ్ పేజీ చూడండి 👇
👉 టెట్ TRT Maths గణితం రివిజన్ టెస్ట్ -5👈
👉జనరల్ సైన్స్ 6వ.త. సామాన్య శాస్త్రం టెస్ట్ -4👈
👉తెలుగు వ్యాకరణం సమాసాలు test-10👈
👉join టెట్ TRT గ్రూప్2,3,4 & పోలీస్ జాబ్స్ ప్రిపరేషన్ గ్రూప్👈
👉 SUBSCRIBE YOUTUBE JOBS ప్రిపరేషన్ ఛానల్👈
🙏🤝Thanks for sharing 🤝🙏
ప్రిపరేషన్ Gap లో కాసేపు రిలాక్స్ కావాలి అనుకునే వారి కోసం 👇ఈ చిన్న సరదా నీతి కథ👇
సూది వైద్యుడు (బాలల సరదా నీతి కథ)* -
********
..👉ఒకూర్లో ఒక సూదుండేది. పాపం దానికో రోజు జ్వరమొచ్చింది. ఎన్ని రోజులైనా కొంచం గూడా తగ్గలేదు. దాంతో అది నీరసంగా కిందామీదా పడతా వైద్యుని దగ్గరికి పోయింది. వైద్యుడు సూది పడతావున్న బాధను ఏమాత్రం పట్టిచ్చుకోకుండా "నువ్వే సూదివి. మళ్ళా నీకు యాడ సూదెయ్యాల... ఫో... ఫో... ఈన్నించి" అని కసురుకున్నాడు. పాపం... ఆ సూది ఎంత బతిమలాడినా డాక్టరు దానికి మందియ్యలేదు.
దాంతో సూది ఏడుస్తా... ఏడుస్తా... తిరిగి ఇంటికి పోతావుంటే దారిలో ఒక అరటితొక్క ఎదురయి "సూది బావా... సూది బావా... ఎందుకే అట్లా ఏడుస్తా వున్నావ్. ఏంది నీ బాధ” అనడిగింది. సూది జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది. అది విని అరటి తొక్క బాధపడతా “అయ్యో పాపం... జ్వరమొచ్చి నువ్వింత బాధపడతా వున్నా సూదెయ్యనన్నాడా... దా పోదాం... పోయి వాని సంగతి చూసుకుందాం" అనింది కోపంగా.
...👉"సరే" అని సూది అరటి తొక్కతో కలిసి తిరిగి వైద్యునింటికి పోతావుంటే దారిలో పెండ అడ్డమొచ్చి “సూదిబావా... సూది బావా... యాడికి నువ్వూ, అరటితొక్కా పోతా వున్నారు... ఏంది సంగతి" అనడిగింది. అప్పుడా సూది దానికి జరిగిందంతా చెప్పింది. అది విని ఆ పెండ “వానికి బాగా కొవ్వెక్కినట్లుంది. డబ్బులున్నోళ్లనే తప్ప పేదోళ్లను అస్సలు పట్టిచ్చుకోడు. నేను గూడా మీ వెంబడొస్తా... పద... వాని అంతు చూద్దాం " అని అది గూడా వాటితో పాటే బైలుదేరింది.
అట్లా సూదీ, అరటి తొక్కా, పెండా పోతాపోతా వుంటే దారిలో ఒక చిన్న తేలుపిల్ల ఎదురొచ్చి "సూది బావా... సూదిబావా... యాడికి నువ్వూ, అరటి తొక్కా, పెండా పోతా వున్నారు. ఏంది సంగతి" అనడిగింది. అప్పుడా సూది దానికి జరిగిందంతా చెప్పింది. అది విని ఆ తేలు "నీకు ముందూ వెనుకా ఎవరూ లేరనే గదా వానికంత ధైర్యం. వాడేమన్నా పెద్ద పాలెగాడిని అనుకుంటున్నాడేమో... నేనూ వస్తా... చూసుకుందాంపా వాని సంగతి" అని అదిగూడా దాండ్లతో పాటే బైలుదేరింది. అట్లా ఆ నాలుగూ కలిసి ఆసుపత్రికి చేరుకొనేసరికి... అక్కడ వైద్యుడు లేడు. షావుకారు కుక్కకి కడుపు నొస్తుంటే సూది వేయడానికి వాళ్ళ ఇంటికి పోయినాడు. సరేనని నాలుగూ నెమ్మదిగా లోపలికెళ్చినాయి.
అరటి తొక్కేమో గుమ్మం ముందు కూచోనింది. తేలేమో గూట్లో మందుల పక్కకు చేరింది. సూదేమో కుర్చీ మీద చక్కగా నిటారుగా నిలబడింది. పెండేమో సరిగ్గా కుర్చీ పైన సీలింగుకు అతుక్కోనింది.
..👉కాసేపటికి వైద్యుడు కులుక్కుంటా... కులుక్కుంటా.... టకటకటక నడుచుకుంటా లోపలికొచ్చినాడు. గుమ్మం ముందు అరటి తొక్క సిద్ధంగా వుంది గదా... చూసుకోక కాలేసినాడు. అంతే... సర్రుమని జారీ దభీమని కిందపడ్డాడు. దెబ్బకు కాలిరిగింది.
వాడు కుయ్యో మొర్రో అని మొత్తుకుంటా లేచి కుంటుకుంటా... కుంటుకుంటా... నొప్పి తగ్గడానికి మందేసుకుందామని గూట్లో చేయి పెట్టినాడు. ఎప్పుడెప్పుడు గూట్లో చెయ్యి పెడతాడా... ఎప్పుడెప్పుడు వాని సంగతి చూసుకుందామా అని ఎదురు చూస్తావున్న తేలుపిల్ల వెంటనే వాని చేతి మీద లటుక్కున కొండితో ఒక్కటేసింది.
👉...అంతే... ఆ దెబ్బకు వాడు గిలగిలలాడతా కుర్చీ దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే సూది నిటారుగా దాని మీద నిలబడి ఎదురుచూస్తా వుంది గదా... వాడు దాన్ని చూసుకోక అట్లాగే కూచున్నాడు. అంతే... అది కస్సున లోపలికి దిగబడిపోయింది. అంతే.... వాడు బాధతో విలవిలలాడతా “అబ్బా" అని అరుస్తా నోరు తెరిచినాడు. అంతే పైనున్న పెండ దభీమని వాని నోట్లో పడింది.
********
డా.ఎం.హరికిషన్-సార్ కు ధన్యవాదములు🤝✍️📖🙏🙏
********
కథ నచ్చితే *SHARE* చేయండి.
రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.