Who issue currency notes in our country?

 

💥మన దేశంలో కరెన్సీ నోట్లను ఎవరు జారీ చేస్తుంటారు ?




ఆ రెండు రూపాయల నుంచి రూ. పది వేల వరకూ విలువైన నోట్లను జారీ చేసే బాధ్యత భారతీయ రిజర్వ్ బాంక్ (ఆర్ బీఐ) ది. కరెన్సీ నోట్లను కేంద్రప్రభుత్వం (రూపాయి నోటు), ఆర్‌బిఐ (ఇతర నోట్లు) జారీ చేసిన ప్రామిసరీ నోట్లుగా పేర్కొనవచ్చు. ఆర్ బీఐ గవర్నర్ సంతకం ఈ కారణంగానే ఉంటుంది. ఉదాహరణకు మనం వందరూపాయల నోటును ఇస్తే దానికి సమానమైన విలువను చెల్లించే విధంగా | ప్రామిసరీ నోటు ప్రకారం హక్కు,వుంటుంది. ఈ విధమైన హామీ గానే సంతకం వుంటుంది.

ఈ రోజున కరెన్సీ (డబ్బు నోట్లు) ని కాగితం నుంచి తయారు చేయడం లేదు. పత్తి, లినెన్ల మిశ్రమంతో చేస్తారు.


చిరిగిన, పాడైన నోట్లకు సంబంధించి ఏ నిబంధనలు ఏమున్నాయి ?


- ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం - పాడైన, చిరిగిన, పోగొట్టుకున్న నోట్లకు సమానమైన విలువను చెల్లించాలంటూ కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకులను డిమాండ్ చేసే అధికారం ఎవరికీ లేదు. కేంద్రప్రభుత్వ అనుమతిలో ఇలాంటి నోట్ల మార్పిడికి అనుసరించవలసిన నియమ నిబంధనలను ఆర్ బీఐ విధించవచ్చునని కూడా ఇదే చట్టం పేర్కొన్నది. సాధారణ పరిస్థితుల్లో ప్రామిసరీ నోటను పోగొట్టుకున్నవారు హక్కును పూర్తిగా చేజార్చుకున్నట్లే గదా! ఇదే విషయం కరెన్సీ నోట్లకు కూడా వర్తిస్తుంది. ఇక, చినిగిన, పాడైన నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం ఒక్క రూపాయ నుంచి వెయ్యి రూపాయ నోట్ల వరకు సాధారణ మారకానికి అనువుగా లేని ఏ నోటునైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.


💥 నకిలీ నోట్లు చలామణిలోని వచ్చినప్పుడు ఏఏ చర్యలు తీసుకుంటారు ? 


- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీ నోట్లు తయారై మార్కెట్ లో చలామణిలోకి వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటారు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. గతంలో ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఆర్ బీఐ మూడు తలలు సింహం గుర్తు రద్దు చేసింది ప్రతి నోటు మీద గాంధీ బొమ్మ ముద్రిస్తూ కొత్త కరెన్సీని విడుదల చేసింది. సింహాల గుర్తులు గల నోట్లను బ్యాంకులు ప్రజలనుంచి తీసుకొని రిజర్వ్ బ్యాంకుకు తిరిగి పంపమని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.


💥 కరెన్సీ నోట్ల రూప లావణ్యాలు ఏమిటి ?



- 167 మి.మీ. పొడవు, 73 మి.మీ. వెడల్పు గలిగి వుండే విధంగా 500 రూ. నోట్లను ఆర్.బి.ఐ. ముద్రించింది. తెల్లటి ఖాళీ ప్రదేశంలో గాంధీ వాటర్ మార్క్ బొమ్మ కనిపిస్తుంది. మాగ్నటిక్ సెక్యూరిటీ ట్రేడ్ 3 మి.మీ. సైజులో వుంటుంది. అల్ట్రావయొలెట్ కాంతి కిరణాల వెలుగులో ఇది ప్రస్ఫుటంగా కనిస్తుంది. ఓమ్రాన్ యాంటీ ఫోటో కాపీయింగ్ ఫీచర్ (Omron Anti Photo Copying feature) వివిధ రంగుల్లో కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ పేరు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో గ్యారంటీ - ప్రామిస్ క్లాజ్, అశోకా స్థూపం గుర్తు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటాయి. ఆప్టికల్ ఫైబర్స్ వివిధ రంగుల్లో కనిపిస్తాయి. ఇక, వెయ్యి రూపాయల నోటు గురించి చెప్పాలంటే - 1777 మి.మీ. పొడవులో, 73 మి.మీ. వెడల్పుతో ఉంటాయి. రిజర్వ్ బ్యాంకే ముద్రిస్తుంది. పింక్ రంగులో వుండి బూడిద రంగు ఆఫ్ సెట్ డిజైన్ వెనుక వైపు ఉంటుంది. 15 భాషల్లో 'వేయి రూపాయలు' అర్థం వచ్చే పదాలు ఎడమవైపు ముద్రించి వుంటాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని, ఎంతో టెక్నాలజీని ఉపయోగించినప్పటికీ నకిలీల ప్రస్థానం నకిలీలదే!


💥 నకిలీల నోట్లను ఎవరు అధికారికంగా పరీక్షిస్తారు ?


" నకిలీ నోట్లు బ్యాంకు సిబ్బంది ద్వారా పట్టుబడినప్పుడు Genaral Manager, Bank Note Press, DEWAS (Madhya Pradesh) to Genaral Manager, Currency Note Press, NASIK(Maharastra) కుగానీ పరీక్షల నిమిత్తం పంపుతారు. Criminal Procedure Code 292 ప్రకారం కోర్టుకు దాఖలు చేస్తారు. నకిలీ నోట్లను చలామణి చేయడం వల్ల IPC 489 A, 489 E సెక్షన్ ప్రకారం శిక్షార్హులవుతారు. ఇవన్నీ, మామూలుగా ఇతర చట్టాల మాదిరిగానే వుంటుంటాయి. నకిలీలు గుర్తించడానికి పెన్ మోడల్ లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఆవిష్కారమయ్యాయి. వీటి నుంచి వెలువడే కిరణాలలో నోట్ల మీద నక్షత్రాలు, మెరుస్తుండే గుర్తులు కనిపిస్తాయి.


💥 ఆ డబ్బు ప్రస్తావన లేని వ్యవస్థ ఉంటుందా ?


1930 దశకంలో ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టి ముట్టినప్పుడు ఒక ప్రత్యామ్నాయ ఆర్థికవ్యవస్థగా 'టెక్నోక్రసీ' ఆవిర్భవించింది. ఆర్థిక సంక్షోభాల పరిష్కారానికి ఇది ఒక నమూనాగా బెల్జియం దేశ రసాయన శాస్త్రవేత్త ఎర్నెస్ట్ (1838 1922) ప్రతిపాదించారు. దీనిని సూచించడమే కాక ఆచరణలో కూడా పెట్టారు. దాని ప్రకారం డబ్బును రద్దు చేస్తారు. దాని స్థానంలో ఒక సంక్లిష్టమైన రుణవ్యవస్థ ఏర్పాటవుతుంది. ఈయన మరణించిన తర్వాత ఆచరణలో ప్రయోగాత్మకంగా పెట్టిన 'టెక్నోక్రసీ' కొద్దికాలంపాటు ఆదరణ పొందగలిగింది. సమాజాన్ని మార్చడానికి ఈయన తనదైన రీతిలో ముందుకు వెళ్లారే కాని ఫలవంతం కాలేదు.


పూర్వకాలంలో - ఒక శతాబ్దం క్రితం - బార్టర్ సిస్టమ్ గ్రామీణ ప్రాంతాలలో బాగా అమలులో వుండేది. దీనిని వస్తుమార్పిడి విధానంగా చెప్పుకోవాలి. డబ్బుతో నిమిత్తం లేకుండా పండిన పంటలను పరస్పరం మార్పిడి చేసుకునేవారు. ఏది ఏమైనా డబ్బు రుచి తెలిసిన తరువాత, దాని ముందు ఏదీ నిలబడలేదు.


💥 మన దేశంలో ప్రత్యేక ఆర్థికమండళ్ళ విధానం వుందంటున్నారు. దాని అర్థం ఏమిటి ?


- చాలా క్లుప్తంగా చెప్పాలంటే - దేశంలో ప్రత్యేక ఆర్థికమండళ్ళ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2000, ఏప్రిల్ 1న ప్రవేశపట్టింది. ఎగుమతుల రంగంలో ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు లేని వాతావరణంలో అద్భుతంగా పనిచేసి, అంతర్జాతీయ పోటీకి తట్టుకొని నిలబడగల సంస్థలను ఏర్పాటు చేసి వాటిని ప్రోత్సహించాలనే ఆశయంతో ప్రభుత్వం ఆర్థికమండళ్ళను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. వస్తూత్పత్తి కేంద్రాలను, సేవాకేంద్రాలను వీటిలో ఏర్పాటు చేసుకోవచ్చు. 'సెల్ఫ్ సర్టిఫికేషన్' ప్రాతిపదికన సెజ్ సంస్థలు ఎగుమతులు, దిగుమతులు జరుపుకోవచ్చు. వీటిలో ఏర్పాటయ్యే సంస్థలు విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించేవిగా ఉండాలి. అయితే, ఇంతే సంపాదించాలి, అంతే సంపాదించాలి అనే ఆంక్షలు ఏవీ వుండవు. ఈ సంస్థలు దేశీయ మార్కెట్ లోకి తమ ఉత్పత్తులను విడుదల చేయదలచుకుంటే అవి కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాలి. 2006 నాటికి మన రాష్ట్రంలో విశాఖపట్టణం, కాకినాడలలో ఇవి ఉన్నాయి. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలను అందిస్తున్నాయి.