When was the evolution of human evolution started?

1. మానవుని పరిణామ క్రమం ఎప్పుడు ప్రారంభమైంది ?





👉భూమి మీద మానవుని పరిణామక్రమానికి చెందిన అధ్యయనాలు శతాబ్దం క్రితం నుంచే ప్రారంభమయ్యాయి. 


👉2006, సెప్టెంబర్ నాటి 'నేచర్' పత్రికలో ఆధునిక పరిశోధనలకు సంబంధించిన కొన్ని వివరాలు ప్రచురితమయ్యాయి. 


👉సుమారు 3 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించినట్టుగా 'భావిస్తున్న’ మూడు సంవత్సరాల వయసుగల ఒక ఆడజీవి యొక్క సంపూర్ణస్థాయి శిలజాన్ని 2006లో కనుగొన్నారు. 


👉దానికి 'లూసీ బేబీ' అని నామకరణం చేసారు. ఇంతకు పూర్వమే 1970 ప్రాంతంలో పురావస్తుశాస్త్ర, పరిశోధనల రంగంలో, ఆధునిక శాస్త్ర పరిశోధనా రంగంలో అతిగొప్ప అన్వేషణగా పేరొందిన ఒక యుక్త వయసుగల ఆడజీవి శిలాజ అవశేషాలను కనుగొని, దానికి 'లూసీ' అని పేరు పెట్టడంతో దానిని 'లూసీ బేబీ' అన్నారు. 


👉ఈ ఆడపిల్లకు చెందిన అత్యంత సంపూర్ణ అస్థిపంజరమే శిలాజంగా మారి దర్శనమిచ్చింది. ఈ శిలాజం ద్వారా సంబంధిత ఆదిమానవుల జాతులను గురించి సమగ్ర అవగాహనకు రావడం తేలికవుతుందని పరిశోధకులు ఆశాభావం వెలిబుచ్చారు. 


👉'లూసీ' 3.2 మిలియన్ సంవత్సరాల క్రిందటి శిలాజం అయితే, 'లూసీ బేబీ' లూసీ కంటే సుమారు 150,000 సంవత్సరాలకు పూర్వమే నివసించినట్లు భావిస్తున్నారు. 


👉ఆధునిక మానవుడికి, తోక లేని కోతి (ఏప్)కి నడుమ గల జాతులు, వాటి వైవిధ్యాన్ని తెలుసుకునే అవకాశం ఈ రెండు శిలజాల ఆధారంగా తెలుసుకునే అవకాశం వుంది. డార్విన్ సిద్ధాంతం కూడా క్రమ క్రమంగా మసకబారుతున్నది. 


👉ఈ పరిస్థితులలో మానవుని పుట్టుక, పరిణామక్రమం శాస్త్రజ్ఞులు నానాటికి చేస్తున్న పరిశోధనాభివృద్ధిలో తేలడం అన్నది మన జిజ్ఞాసను కొంతమేర తృప్తి పరచుకోవడమే కాగలుగుతుంది.


💥2. మానవులు రెండు కాళ్ళతో

 నడవడం ఎలా ప్రారంభమైంది ?


👉ప్రాచీన మానవులు చెట్లమీద నివసిస్తున్న కాలంలోనే రెండు కాళ్ళ నడకను అలవాటు చేసుకున్నారని బ్రిటన్ శాస్త్రవేత్తలు 2007, ఏప్రిల్ లో పేర్కొన్నారు. కొంతకాలం క్రితం వరకూ మానవులు ప్రారంభంలో రెండు కాళ్ళు, రెండు చేతులతో నడిచేవారని ఒక అంచనా ఉండేది. 


👉నాలుగు కాళ్ళతో సంచరించే గమనం కూడా చింపాంజీలు, గొరిల్లాలలో కొద్ది శతాబ్దాల క్రితమే వచ్చిందని, మానవులు ఎన్నడూ నాలుగు కాళ్ళతో సంచరించలేదని శాస్త్రజ్ఞులు వాదిస్తున్నారు. 


👉భూమి మీద చెట్లు దట్టంగా ఉన్న కాలంలో ప్రాచీన మానవులు వాటి మీదనే అత్యంత నైపుణ్యంతో నడిచి వుండి వుంటారని, చెట్లు తగ్గిపోయి, భూమి మీదకు రావలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆ అలవాటునే కొనసాగించారని బ్రిటన్ శాస్త్రవేత్తలు నొక్కి వక్కాణిస్తూ, అంతర్జాతీయ ప్రముఖ పత్రిక 'సైన్స్'లో వివరించారు.


💥3. అడవి మనుషులు ఈనాటికీ

 ఉన్నారా ?


👉మన దేశంలో కూడా అడవి మనుషులు ఉన్నారట. మానవ పరిణామక్రమాన్ని అధ్యయనం చేసే శాస్త్రజ్ఞులు కేరళ రాష్ట్రంలోని అడవులలో భారీ సైజులో ఉండే అడవి మనుషులకు చెందిన నాలుగు పాదాల గుర్తులను కనుగొన్నామని చెబుతుంటే, మేఘాలయలోని గారో కొండల్లో ఈ తరహా అడవి మనుషులే కనిపించారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. 


👉2007, జూన్ మొదటి వారంలో శాస్త్రజ్ఞుల బృందం ఒకటి కేరళలోని దట్టమైన అడవులలో అధ్యయనం చేసారు. 


👉అడవి మనుషులకు చెందిన నాలుగు పాదముద్రలను తాము కనుగొన్నామని, మగ వాడి పాదముద్ర సైజు 29 అంగుళాలు ఉండగా, స్త్రీ పాదముద్ర 26 అంగుళాలు ఉందని, చిన్న పిల్లవాడి కాలిముద్ర సైజు సైతం 8.5 అంగుళాలు ఉందని న్యూఢిల్లీ సమావేశంలో వెల్లడించారు.


👉ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఎల్.కె. బాలరత్నం (కోయంబత్తూరు) తన తండ్రితో కలిసి 'భారతదేశంలో మానవశాస్త్రం' మీద ఒక పుస్తకరచన కూడా చేసారు. 


👉బంగ్లాదేశ్, భూటాన్ సరిహద్దులకు ఆనుకొని వున్న మేఘాలయలోని గారో కొండల్లో దట్టమైన అడవుల్లో వళ్లంతా వెంట్రుకలతో, భయం పుట్టించే విధంగా ఉండే అడవి మనుషులు తిరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. 


💥4. మరుగుజ్జు మానవులు ప్రాచీనకాలంలో

 ఉండేవారా ? 


👉మానవపరిణామంలో ఈనాటి వరకూ అజ్ఞాతంగా ఉన్న ఒక కొత్త జాతి మరుగుజ్జు మానవులే. కాల్పనిక కథలలో, జానపద సాహిత్యంలో, పౌరాణిక గాథలలో మరుగుజ్జు మానవుల గురించి పలు విశేషాలు ఉన్నాయి. 


👉ఆ మానవులను పిగ్మీలని అనడం కూడా పొరపాటే. ఇండోనేషియాలోని ఒక మారు మూల దీవిలో దొరికిన మరుగుజ్జు మానవుని అవశేషాలు శాస్త్ర ప్రపంచంలో సంచలనం సృష్టించాయి.


👉ఫ్లోరిస్ ద్వీపంలో ఉన్న ఓ సున్నపురాయి గుహలో (పేరు లియాంగ్ బువా) 2003లో తవ్వకాలు జరుపుతున్న ఆస్ట్రేలియా, ఇండోనేషియా పరిశోధకుల బృందానికి దాదాపుగా పూర్తిస్థాయిలో ఉన్న అస్థిపంజరం లభించింది. 


👉దాని సమీపంలోనే మరిన్ని ఎముకలు కూడా ఉన్నాయి. అవి మరో 8 మందికి చెందినవని తర్వాత తేలింది. 


👉పూర్తిస్థాయి అస్థిపంజరాన్ని పరీక్షించి చూస్తే అది 18,000 ఏళ్ళ క్రితం జీవించిన ఒక యువతిదని తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె ఎత్తు కేవలం మూడు అడుగులే. 


👉మెదడు సైజు 400 ఘనపు సెంటీమీటర్లు (దాదాపు చింపాంజీ మెదడంత) ఉంది. చేతులు, దవడ ఇతర శరీరభాగాలు హోమో ఎరక్టస్, హోమో హెబిలిస్ వంటి ప్రాచీన మానవజాతి పోలికలను కలిగి ఉన్నాయి.


👉దీంతో ఇది ఇంతవరకూ తెలియని కొత్త మానవ జాతి అని, ఆధునిక కాలం వరకూ ఎవరికీ తెలియకుండా కొనసాగుతూ వచ్చిందని శాస్త్రవేత్తలు 2004లో ప్రకటించి సంచలనం సృష్టించారు. 


👉ఆ జాతికి హోమో ఫ్లోరిసియెన్సిస్ అన్న పేరు పెట్టారు.


👉మరుగుజ్జు మానవుల ఆచూకీ తెలిసిన నేపథ్యంలో మనిషంటే ఎవరు? అన్న విషయం నుంచి ప్రాచీన మానవులు ఎలా విస్తరించారు? అన్న అంశం వరకూ అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి.


💥5. డార్విన్ సిద్ధాంతం ప్రధానంగా

 ఏం చెబుతోంది ?


👉కోతి నుంచి మానవుడు పుట్టినట్టు డార్విన్ సిద్ధాంతం చెబుతోంది. ఛార్లెస్ డార్విన్ ఒక నూతన దృక్కోణాన్ని సమకాలికంగా ఆవిష్కరించారు. 


👉జీవరాశులు, వాటి పుట్టుక, మానవుని పరిణామ క్రమం - అన్నింటినీ ఒక కొత్త కోణంలో పరిశోధనలకు ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. 


👉ఇటీవలి కాలంలో ఈ ఆవిష్కరణలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని  తేలింది. డార్విన్ పరిశోధనా క్రమం ఎలా ఉన్నదో తెలుసుకుందాం.


👉22 ఏళ్ళ వయసులో 1831లో ఇంగ్లండ్ నుంచి పరిశోధనల నిమిత్తం నౌకాయానం మొదలు పెట్టారు. ఆ నౌక పేరు బీగిల్. 


👉ఈ క్రమంలో ఆయన దక్షిణ అమెరికా తీరం వెంబడి, వసిఫిక్ సహాసముద్రంలోని దీవులు, గాలపాగోస్ తదితర ప్రాంతాలను సందర్శించారు. వివిధ జాతుల జీవరాశులను పరిశీలించారు. 


👉శిలాజాలను కూడా పరిశీలించారు. వీటి మీద అప్పటి జీవాలు, మొక్కల అచ్చులు లభ్యమయ్యాయి. వీటి ద్వారా చాలా కాలం కిందటే వివిధ రకాల మొక్కలు, జీవరాశులు ఉన్నట్లు తెలుసుకున్నారు.


👉పాత జాతులు అంతరించిపోయి, కొత్త జాతులు పుట్టుకు రావడం మీద ఆయన ఆశ్చర్యం చెందారు. దీంతో తన పరిశోధనలకు మరింత పదును పెట్టారు. 


👉మనుగడ కోసం జరిగిన పోరాటంలో కొన్ని జీవాలు అంతరించిపోయినట్లు ఆయన చెప్పారు ఆ పోరాటాల్లో విజయం సాధించినవే ఇప్పుడు ఉన్నాయి. 


👉తన పుస్తకాల్లో వీటి మీద చాలా విషయాలే రాశారు. అన్ని జీవాలు, మానవులతో సహా పరిణామక్రమంలో ఆయా జాతుల నుంచి నెమ్మది నెమ్మదిగా మార్పు చెందుతూ వచ్చినట్లు పేర్కొన్నారు. 


👉ఈ సిద్ధాంతాన్ని కొందరు ఏకీభవించడం లేదు. వారి వాదనలలో కూడా సారం ఉంది.


💥6. భూమి మీద జీవం ఎలా

 పుట్టింది? 


👉 ఈనాటి వరకూ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని సమస్యలలో ఇది ఒకటి. దీనిని ఛేదించడానికి జపాన్ శాస్త్రవేత్తలు 2005లో దాదాపు 1500 కోట్ల రూపాయల వ్యయంతో వినూత్నమైన ప్రయోగాన్ని ప్రారంభించారు. ఇది కొనసాగుతూనే వుంది. 


👉ఈ ప్రయోగం విజయవంతమైతే శాస్త్రరంగ చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది.


👉జీవం రోదసి నుంచి వచ్చిందనేది ఒక వాదన. రోదసి నుంచి కాకుండా భూమి ఏర్పడినప్పుడు ఉండే అత్యధిక స్థాయి ఒత్తిడిలు, ఉష్ణోగ్రతల వల్ల ఉద్భవించిందని కొందరు శాస్త్రవేత్తలు దృఢంగా విశ్వసిస్తున్నారు. 


👉అయితే, ఈ ప్రతిపాదనలకు ఎటువంటి ఆధారాలు లేవు. జపాన్ శాస్త్రవేత్తలు ప్రారంభించిన ప్రయోగంలో సముద్రగర్భంలో ఏడు కిలోమీటర్ల లోతు వరకూ తవ్వి, అక్కడి నమూనాలను వెలికితీస్తారు. అక్కడ కొన్ని సెన్సర్లను ఉంచుతారు. 


👉నమూనాలలో ఉండే జీవపదార్ధాలను విశ్లేషించి జీవం ఎలా పుట్టిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జపాన్‌కు అమెరికా, దక్షిణ కొరియా, చైనా, బ్రిటన్ మొదలైన దేశాలు సహకరిస్తున్నాయి.


👉 గతంలో ఈ తరహా ప్రయోగాన్ని రష్యాలోని కోలా ప్రాంతంలో 12 కి.మీ. లోతు వరకు డ్రిల్లింగ్ చేసారుగాని, విఫలత చెందారు.



7. జీవం తొలి ఆనవాళ్ళు ఏవి ?


👉" ఈ విషయంలో శాస్త్రజ్ఞులు భిన్న భిన్న పరిశోధనలు చేసారు. అంతర్జాతీయ ప్రముఖ సైన్స్ పత్రిక 'న్యూ సైంటిస్ట్' 2002, ఆగస్ట్ సంచికలో ఈ అంశం మీదనే కొన్ని ఆసక్తికర వివరాలు ఉన్నాయి. సంక్షిప్తంగా, వాటిని తెలుసుకుందాం.


👉అగ్నిపర్వత బిల్లాలో, ప్రాణవాయువు సైతం చిక్కని సముద్రపు అట్టడుగు భాగాల్లో జీవం లుకలుకలాడుతూనే ఉంది. 


👉కోట్ల సంవత్సరాలుగా సాగుతున్న ఈ ప్రస్తానానికి 'నాంది' ఏమిటన్న విషయం మాత్రం ఇప్పటికీ రహస్యమే! కోటానుకోట్ల సంవత్సరాల క్రితం భూమిపై 1 సంభవించిన ఆసాధారణ చర్యల ఫలితంగా జీవం పుట్టిందని కొందరు అంటుంటే.. అంతరిక్షం నుంచి జీవం తొలిగురుతులు రాలిపడి..ఆ తరువాత భూమిపై ప్రాణం పోసుకున్నదని మరికొందరి వాదన. 2002లో జరిగిన పరిశోధనలు రెండో వాదనకు ఊతమిస్తున్నాయి. 


👉అంతేకాదు భూమితోపాటు ఇతర గ్రహాలపై కూడా జీవం ఉండే అవకాశం ఉందని ఈ కొత్త పరిశోధన ఫలితాలు తెలుపుతున్నాయి.


👉రాత్రివేళలో 'ఆకాశాన్ని చూస్తుంటే అప్పుడప్పుడూ సర్రున జారిపడే కాంతి రేఖలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఉల్కాశకలాలు అకస్మాత్తుగా భూవాతావరణలోకి చొచ్చుకువచ్చినప్పుడు మండిపోయి ఈ కాంతి రేఖలు ఏర్పడుతుంటాయి. 


👉ఈ ఉల్కా శకలాలే జీవం పుట్టుకకు అవసరమైన మూల పదార్థాలను భూమి పైకి చేర్చాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు భావిస్తున్నారు. 


👉ఉల్కా శకలాల్లోని పాలి సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ (పిఎహెచ్) పదార్ధాలను విశ్లేషించిన తరువాత వారీ అంచనాకు వచ్చారు. 


👉బెంజీన్, కార్బన్ సమ్మేళనం వల్ల ఏర్పడే పీఎహెచ్ మన నిత్యవాడకంలో ఉన్నవే. నాఫ్తలీన్ పీఎహెచ్ రకాలు


👉ఉల్కాశకలాల్లో చాలా రకాలు ఉన్నాయి. అతి సాధారణంగా లభ్యమయ్యే ' కార్బనాసియన్ కాండైట్' రకం ఉల్కాశకలాల్లో 50 శాతానికి పైగా పదార్ధం పిఎ హెచ్ వల్ల ఏర్పడుతూంటుంది. 


👉సౌర కుటుంబం ఏర్పడిన సమయం నాటి పదార్థాల ఆచూకీ వీటిలో కనిపిస్తుంది. అయితే అందులోని కర్బన పదార్ధం అప్పటి నుంచే ఉందా? తరువాతి కాలంలో సూర్యుడి రేడియో ధార్మికత ప్రభావం వల్ల ఏర్పడిందా? అన్న విషయం తెలియదు. ఈ విషయాలను తెలుసుకునేందుకు రిచర్డ్ వేర్ (కాలిఫోర్నియా యూనివర్శిటీ) ఒక ప్రయోగం నిర్వహించారు. 


👉రెండు వేర్వేరు ఉల్కాశకలాలపై లేజర్ కిరణాలను ప్రసరింపజేశారు. ఉల్కా శకలాల్లోని కార్బన్ అణువులు విడుదల చేసిన కర్బన సమ్మేళనాలను విశ్లేషించారు. భారయుత పీఎహెచ్ నిష్పత్తి ఉల్కాశకలం మొత్తంమీద ఒకే స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. 


👉ఉల్కాశకలం ఏర్పడిన నాటి నుంచి ఈ కర్బన సమ్మేళనాల్లో మార్పేమీ లేదన్నది దీని అర్థం. మార్పు ఏదైనా ఉంటే ఉపరితలం మీది పదార్థాల నిష్పత్తికి, శకలం లోపలి భాగంలోని నిష్పత్తికి తేడా ఉండాల్సిందని జేర్ తెలిపారు.


👉ఉల్కా శకలాల్లో పిఎహెచ్ పీఎ హెచు జీవకణాల్లో కనిపించవు. మరి ఈ సిద్ధాంతం తప్పా? కాకపోవచ్చు. ఎందుకంటే పిఎహెచ్ లు జీవం మనుగడకు అవసరమైన ఇతర మౌళిక కణాలుగా సులభంగా మారిపోగలవు.


 👉పిఎ హెచ్ లు అమినో యాసిడ్లుగా మారగలవని పదేళ్ల క్రితమే నిరూపితమైంది. అల్ట్రావయలెట్ కిరణాలను ప్రసరింపచేయడం ద్వారా పిఎ హెలను అల్కహాల్స్, క్వినాన్స్ గా మార్చవచ్చునని కాలిఫోర్నియా యూనివర్శిటీకే చెందిన మాక్స్ బెర్న్ స్టేటస్ నిరూపించగలిగారు. 


👉“ఉల్కా శకలాలల్లోని పీఏహెచ్ అణువులు తొలి సూక్ష్మజీవుల్లో భాగంగా మారి ఉండే అవకాశం ఉంది. ” అని అన్నారు.


👉ఉల్కా శకలాల్లోని పిఎహెచ్ అణువులు అతినీలలోహిత కిరణాలను, నీలం రంగు కాంతిని అవశోషణ చేసుకోగలవు. దీనివల్ల ఈ అణువులు ఉత్తేజితం చెంది ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. 


👉ఇలా విడుదలైన ఎలక్ట్రాన్స్ ఇతర పదార్థాల్లోకి చేరి వరుస మార్పులకు నాంది పలకగలవని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన మరో కెమిస్ట్ డేవిడ్ డీమర్ భావిస్తున్నారు.


👉 తొలినాటి జీవజాలం పిఎహెచ్ సాయంతో కిరణజన్య సంయోగం క్రియ లాంటిది జరిపి ఉంటాయని అనుమానిస్తున్నారు.


👉“విశ్వం మొత్తం మీద ధూళి మేఘాల్లోని ఉల్కా శకలాలు పిఎహెచ్ లను భూమితోపాటు ఇతర గ్రహాలపై కూడా చేర్చి ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా జీవం ఉండే అవకాశాలు పెరిగాయి.” అని బెర్న్ స్టేటస్ తెలిపారు.