What is a computer program?

💥కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే       ఏమిటి? 




👉కంప్యూటర్ అనేది మనిషికి అద్భుతంగా ఉపయోగపడే పరికరమన్న సంగతి తెలిసిందే. ఓ చిన్న యంత్రాన్ని నియంత్రించడమే కాదు. 


👉ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశ పెట్టేందుకు సైతం కంప్యూటర్ ఎంతో ఉపకరిస్తుంది. అంతేగాక, ఓ బ్యాంకు లెడ్జర్ తయారీ మొదలుకొని, తుపాను  జాడల్ని పసిగట్టడం వరకూ ఇది ఎన్నో విధుల్ని నిర్వహిస్తుంది. 


👉అయితే, కంప్యూటర్ లో ఏ పని  చేయాలన్నా ముందుగా ఆ పనికి సంబంధించిన ప్రోగ్రామ్ ను కంప్యూటర్లో రూపొందించాల్సి ఉంటుంది.


👉కంప్యూటర్‌కు అందించే ఆదేశాల సమూహమే ప్రోగ్రామ్. దీనికిచ్చే ఆదేశాలన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం రూపొందించాల్సి ఉంటుంది. 


👉నిజానికి దానికి మాట్లాడటం రాదు. ఏ చేయాలి? ఎలా చేయాలి? ఏ సమాచారాన్ని వాడాలి? ఏ పద్ధతిలో ఉపయోగించాలి..... లాంటి అన్ని విషయాలనూ మనం దానికి ప్రోగ్రామ్స్ రూపంలో ఇస్తేనే వాటి ఆధారంగా కంప్యూటర్ పనిచేస్తుంది.

 

👉అయినప్పటికీ కచ్చితత్వం, అత్యధిక సమాచారాన్ని దాచి ఉండగల శక్తి, వేగం మొదలైన ప్రత్యేక లక్షణాల కారణంగానే కంప్యూటర్, సమర్ధ యంత్రంగా వాడుకలోకి వచ్చింది. ఉదాహరణకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేసే కంపెనీలు, కరెంటు బిల్లులు రూపొందించేందుకు కంప్యూటర్ కిచ్చే ప్రోగ్రామ్ లోని 'కమాండ్స్' సుమారుగా ఇలా ఉంటాయి.


1. వినియోగదారుడి పేరును గుర్తించు....


2. వినియోగదారుడు ఏ విభాగానికి చెందుతాడో తెలుసుకో... గృహోపయోగమా, పారిశ్రామికోపయోగమా అన్నది గమనించు...


3, మొత్తం వాడిన యూనిట్లెన్నో తెలుసుకో....


4. గృహ వినియోగానికైతే యూనిట్‌కు నాలుగు రూపాయలు లెక్కించు...... 

5. పారిశ్రామిక అవసరాల కోసమయితే యూనిట్‌కు ఏడు రూపాయలు లెక్కించు..... 

6. బిల్లు రూపొందించు....

 7. ప్రింట్ చెయ్యి...."

 

💥క్రెడిట్, డెబిట్, ఎటిఎం మొదలైన స్మార్ట్ కార్లు ఎలా పని చేస్తాయి ? 


👉అరచేయంత సైజున్న ఆ పరికరంలో కార్డ్ బొప్పిస్తే 

చాలు! మీ ఫోన్ బిల్లు చెల్లించొచ్చు !

👉 రైళ్ళు, బస్సులు, విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు


👉రోజూ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టే అవసరమూ తప్పుతుంది! నిత్య వ్యవహారాలను స్మార్ట్ కార్డ్ పరిజ్ఞానం చాలా సులభతరం చేసింది. అయితే ఈ సమాచార విప్లవంలో కీలకపాత్ర పోషిస్తున్న మరో పరికరం గురించి చాలామందికి తెలియదు. క్రెడిట్, డెబిట్, ఏటియం, ఐడెంటిటీ... ఇలా ఏ స్మార్ట్ కార్డ్ అయినా సరే అందులోని సమాచారాన్ని చదివే రీడర్లు లేకుంటే నిష్ప్రయోజనం! ఇవి ఎలా పనిచేస్తాయో? తెలుసుకుందాం.




👉 స్మార్ట్ కాలన్నింటి వెనుకభాగంలో ఒక వెడల్పాటి పట్టి ఉండటం అందరూ గమనించే ఉంటారు. దీన్లో ఉండే మూడు ట్రాక్ లపైనే మన వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. అకౌంట్ సంఖ్య, వినియోగదారుడి పేరు, కార్డ్ ఏ తారీఖు వరకూ చెల్లుతుంది? రహస్య సంకేత సంఖ్యలాంటివన్నీ వీటిలో ఉంటాయి. మ్యూజిక్ క్యాసెట్లలో మాదిరిగా ఈ సమాచారం అనలాగ్ పద్ధతిలో నిక్షిప్తం చేస్తారు.


👉లావాదేవీల కోసం కార్డ్ ను రీడర్ గుండా మనం పైనుంచి కిందకు జార్చినప్పుడు అందులోని మాగ్నెటిక్ హెడ్ పట్టీలపై ఉన్న సమాచారాన్ని గుర్తిస్తుంది.


👉 (టేప్ రికార్డర్ లోని హెడ్ మాదిరిగా) ఈ సమాచారాన్ని సర్క్యూట్ బోర్డ్ లోని మూడు ప్రాసెసర్లు అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ రూపంలోకి మారుస్తాయి. మొత్తం సమాచారాన్ని క్రోడీకరించిన తరువాత అన్నీ సక్రమంగా ఉంటే దాన్ని బ్యాంకు లేదా సంబంధిత ఆర్థిక సంస్థ ప్రధాన కంప్యూటర్కు ప్రసారం చేస్తాయి.


👉బ్యాంకు | సంస్థ వివ ను ఆమోదిస్తే లావాదేవీలు జరిగిపోతాయి.

 👉ఏ బ్యాంకు, ఆర్థిక సంస్థ జారీ చేసిన కార్డ్ అయినా ఒకే విధమైన సైజు, ఆ ఉంటాయి. 


👉ఒక్కో కంపెనీ ఒక్కో సైజులో కార్డులు ప్రవేశపెడితే ఏమిటి? అనిపిస్తుంది అయితే ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలు పాటించే ఉద్దేశ్యంతో కార్డులను సైజులో తయారుచేస్తారు.


👉అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ ఆర్గనైశ్య ఫర్ స్టాండర్టైజేషన్ ఈ ప్రామాణీకరణను పర్యవేక్షిస్తూంటాయి. 


👉కాల సైజుతో పాటు దానిమీద నిక్షిప్తం చేసే సమాచారం కూడా కార్డ్ పై నిర్దిష్ట ప్రదేశంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకే సైజు ఒకే చోట సమాచారం ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు జరిపే అవకాశం చిక్కుతుంది. - 


👉కంప్యూటర్ వైరస్ అనేది ఒక ప్రోగ్రామ్. ఎటువంటి కమాండ్ నిమిత్తం లేకుండానే తనంతట తాను కంప్యూటర్‌ను తొలచివేయడం ఈ ప్రోగ్రామ్ (వైరస్) ప్రత్యేకత. 


👉హార్డ్ డిస్క్ ప్లాపీ డిస్క్గా  పిలిచే సిస్టమ్ ఏరియా (ఎగ్జిక్యూటివ్ ఫైల్స్)లోకి ప్రవేశించిన వైరస్ అందులోని ప్రోగ్రామింగ్ ఫైల్స్ అన్నింటినీ కాపీ చేస్తుంది. 


👉అలా కాపీ చేసిన ఫైళ్ళను ధ్వంసం చేసి మరిన్ని ఫైళ్ళను కాపీ చేస్తుంది. ఈ రకంగా కంప్యూటర్ లోని అన్ని విభాగాలకు విస్తరించి మొత్తం సిస్టమ్ ధ్వంసం చేయడమే వైరస్ల ప్రత్యేకత.


💥కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి? 


👉వార్మ్ / ట్రోజాన్స్ వంటి రకాల వైరస్ లో కొన్ని మెయిల్స్ రూపంలో కంప్యూటర్ లోకి ప్రవేశిస్తాయి. 


👉మెయిల్‌ను ఓపెన్ చేయగానే అవి కంప్యూటర్ లోని ప్రోగ్రామ్ ఫైళ్ళను ధ్వంసచేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాయి. 


👉కొన్ని వైరస్ లు హార్డ్ డ్రైవ్స్ మీద కూడా విశృంఖలంగా దాడిచేసి, పనితీరును అదుపులో ఉంచుకుంటాయి.


💥వైరస్ ఎలా వ్యాపిస్తుంది ?



👉వైరస్ అనేది ఫైళ్ళరూపంలో లేదా ప్రోగ్రామ్ రూపంలో కంప్యూటర్ లోని ప్రవేశింవ్యాపిస్తుంది. వైరస్ తో కూడుకున్న ఫైల్స్ / ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూటివ్ చేసినప్పుడు వైరస్కు

👉జవసత్వాలు ఏర్పడి ధ్వంస కార్యక్రమానికి ఆయత్తమవుతుంది. ఆ విధంగా ప్రారంభమైన వైరస్ ఫైల్ క్రమక్రమంగా కంప్యూటర్ లోని ఫైళ్ళను అన్నింటినీ నాశనం చేస్తుంది.


👉అక్కడితో కంప్యూటర్‌తో అనుసంధానమై నెట్ వర్క్ గా వున్న అన్ని కంప్యూటర్లలోని ఫైల్స్ అన్నింటినీ సర్వనాశనం చేస్తుంది. కంప్యూటర్ పనితీరును బట్టి బ్రష్టు పట్టిస్తుంది. 


💥ఈ -పేపర్ తయారీ, ప్రత్యేకతలు ఏమిటి ?


👉 కాగితంమీద ముద్రించే పుస్తకాలకు, వార్తాపత్రికలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న 'ఇ-పేపర్' పరిశోధనలు 2000 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. 


👉ఇ-పేపర్ వాస్తవానికి మడిచి జేబులో పెట్టుకునేంత పలుచనైన కంప్యూటర్ మానిటర్. 


👉ఇందుకు సంబంధించి ఫిలిప్స్ కంపెనీ, ల్యూ సెంట్, ఐబీఎం మొదలైన ప్రఖ్యాత కంపెనీలు పరిశోధనలు జరిపాయి.


 👉కాగితమంత పలుచనైన మానిటర్‌ను సృష్టించడం ద్వారా వార్తలు సహా ఏ సమాచారాన్ని అయినా ఇంటర్నెట్ ద్వారా చూసే సౌలభ్యాన్ని కల్పించడం ఈ ప్రయోగాల లక్ష్యం.


👉2001 చివరలో ఫిలిప్స్ కంపెనీ వారి నమూనా 'ఇ-పేపర్' లో పాలిమర్ డిస్పడ్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే ఉంది. పాలిమర్లతో తయారైన పలుచని ఫిల్మ్ ట్రాన్సిస్టర్ ఆధారంగా ఈ డిస్ప్లే పనిచేస్తుంది. ఇది 64x64 ఫిక్సెల్ల వైశాల్యం ఉంది. 


👉అంటే రెండంగుళాల పొడవు, రెండంగుళాల వెడల్పు ఉంటుంది. కంప్యూటర్ తెరమీద కనిపించే ఫోటోలోని అతిచిన్న ఎలక్ట్రాన్ బిందువును 'ఫిక్సెల్' అంటారు. ఈ ఇ-పేపర్ లో ఫోటోలు గ్రే కలర్ లోని 256 లు షేడ్ లో కనిపిస్తాయి. 


👉చేతితో పట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళే పూర్తిస్థాయి ఇ-పేపర్‌ను మిర రూపొందించడానికి ఎంతకాలం పటుతుందో తెలియరావడం లేదు. ఇ-పేపర్ తయారీలో ఎక్కు ప్రధాన అడ్డంకి సర్క్యూట్ బోర్డులే. 


ఇవి ఎటుపడితే అటు వంగేవి కావు. సమాచారాన్ని అక్షరాలుగా, ఫోటోలుగా మార్చే కీలకమైన బాధ్యత ఈ సర్క్యూట్ బోర్డులదే. సర్క్యూట్ బోర్డులలోని సిలికాన్ ట్రాన్సిస్టర్లు కంప్యూటర్ తెరమీద కనిపించే ఫోటోలోని పిక్సెల్స్ (బిందువుల) రంగును నిర్దేశిస్తాయి.