What are the intakes, such as precious oil, gas, etc., from garbage?

💥సహజవాయువు అంటే ఏమిటి? దీనిని ఎలా వెలికి తీస్తారు ? ఇందులో ఏమేమి ఉంటాయి? 
మిథేన్. ఈతేన్,  ప్రొపేన్ వంటి అనేక వాయువులు కలినిన మిశ్రమాన్ని నమాజవాయువు అంటారు. దీనికి రంగు, రూపు, వాసన ఉండదు. 


మండించినప్పుడు వివ రీత మైన శక్తి విడుదల అవుతుంది. సహజవాయువు వల్ల ప్రధాన ప్రయోజనమేమిటంటే.... దీన్ని మండించినప్పుడు వాతావరణంలోకి విడుదలయ్యే హానికరమైన వాయువుల మోతాదు చాలా తక్కువ. అందువల్ల శిలాజ ఇంధనాల కన్నా దీని వల్ల పర్యావరణపరమైన ప్రయోజనం ఎక్కువ.


చమురు నిల్వలు ఉన్న ప్రాంతంలో సాధారణంగా సహజవాయువు కూడా ఉంటుంది. అందువల్ల చమురు నిల్వలు ఉన్న ప్రాంతాల్లోనే సహజవాయువు కోసం డ్రిల్లింగ్ జరుపుతారు. 


సహజవాయువుతో పాటు భూగర్భం నుంచి నీరు.. ఇసుక.. ఇతర వాయువులు.. కొన్ని పదార్థాలు కూడా బయటకు వస్తాయి. హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులను శుద్ధి చేసి వేరే విధంగా ఉపయోగించుకుంటారు. ఎటువంటి మలినాలు లేని సహజవాయువును పైపుల ద్వారా అవసరమైన ప్రాంతాలకు రవాణా చేస్తారు.


శిలాజ ఇంధనాలు ఎలా ఏర్పడతాయో.. సహజవాయువు కూడా ఆ విధంగానే తయారవుతుంది. 

కోట్ల ఏళ్ళ క్రితం చనిపోయిన జంతువుల మృతదేహాలు.. చెట్లు భూమి లోపల కప్పబడి పోయాయి... విపరీతమైన ఒత్తిడి ఉండటం వల్ల శిలాజ ఇంధనాలు ఏర్పడతాయి. 


కొన్ని సార్లు ఈ మృతదేహాలు... చెట్ల బురదలో కప్పబడిపోతాయి. కాలంతో పాటుగా వీటిమీద మరిన్ని పొరలు ఏర్పడతాయి. విపరీతమైన ఒత్తిడి . అత్యధిక ఒత్తిడి.. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ఇవన్నీ కార్బన్ బాండ్స్ గా విడిపోతాయి. 


అప్పుడు సహజవాయువు ఏర్పడుతుంది. అందువల్లే సహజవాయువును వెలికి తీయటానికి చమురు కన్నా లోతుగా తవ్వాల్సి ఉంటుంది.

  భూ భౌతిక శాస్త్రవేత్తలు భూపొరలను పరిశీలించి.. ఎక్కడ చమురు, సహజవాయువు నిల్వలు ఉండవచ్చో పసిగడతారు. అత్యాధునిక పరికరాల పొరలు ఏ విధంగా ఏర్పడ్డాయో - అక్కడ ఆ మేరకు నిల్వలు ఉండవచ్చో కనుక్కుంటారు. ప్రాంతంలో డ్రిల్లింగ్ జరిపి నమూనాలు సేకరిస్తారు. ఈ నమూనాల ఆధారంగా ఎన్ని నిల్వలు తర్వాత ఆ ఉన్నాయో తెలుస్తుంది.


నమూనాలు సేకరించటానికి వేసిన కన్నాన్ని 'వెల్' అంటారు. ఒక ప్రాంతంలో వాణిజ్య ప్రయోజనాలకు పనికొచ్చే విధంగా నిల్వలు ఉన్నాయని నిర్ధారించిన తరువాత అక్కడున్న ఒత్తిడి, ఉష్ణోగ్రత మొదలైన వివరాలను నమోదు చేస్తారు. 'వెల్'ను పటిష్టం చేస్తారు. సహజవాయువు బయటకు రావటానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారు.


సాధారణంగా సహజవాయువు తీవ్రమైన ఒత్తిడితో పైకి వస్తుంది. అందువల్ల దానిని వెలికితీయకముందే అత్యంత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. ఒకసారి బయటకు వచ్చిన సహజవాయువును పైపుల ద్వారా శుద్ధి చేయటానికి పంపుతారు. శుద్ధి చేసిన తర్వాత సహజవాయువు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.


సహజవాయువులో మిథేన్ 70-90శాతం, ఈథేన్ 0-20 శాతం; ప్రొపేన్ ఉండవచ్చు, లేదా ఉండకపోవచ్చు, బ్యూటేన్ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు., కార్బన్ డై ఆక్సైడ్ 0-8శాతం, ఆక్సిజన్ 0-0.2 శాతం, నైట్రోజన్ 0-5 శాతం, హెడ్రోజన్ సల్ఫైడ్ 0-5 శాతం మొదలైనవి ఉంటాయి.


💥చెత్త నుండి విలువైన చమురు, గ్యాస్ మొదలైన వాటిని ఏ విధంగా రాబడుతున్నారు ?


• ఈ టెక్నాలజీని 1999లోనే 'థర్మల్ డీ పాలిమరైజేషన్' పేరుతో శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ముడిచమురు, గ్యాస్ లాంటి ఇంధనాలన్నీ హైడ్రోకార్బన్ సమ్మేళనాలన్నది తెలిసిందే. జీవ పదార్థాలన్నింటిలో కర్బన పదార్థం ఉంటుంది. 


ఈ మూలసూత్రం ఆధారంగానే థర్మల్ డీ పాలిమరైజేషన్ అన్న సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి జరిగింది. ముడిచమురు సహజసిద్ధంగా లభించే హైడ్రోకార్బన్ సమ్మేళనం. 

మరణించిన చెట్లూ, చేమలు, జంతువులు భూగర్భంలోకి చేరి అక్కడి విపరీతమైన ఉష్ణం, ఒత్తిడుల కారణంగా విచ్ఛిన్నమవుతాయి.


 ఈ క్రమంలో అందులో ఉన్న హైడ్రోజన్, కార్బన్లు సమ్మిళితమై ముడిచమురు, సహజవాయువు లాంటివి ఏర్పడతాయి. థర్మల్ డీ పాలిమరైజేషన్ సాంకేతిక పరిజ్ఞానంలో కూడా జరిగే తంతు ఇదే! కాకపోతే ముడిచమురు, సహజవాయువులు ఏర్పడేందుకు లక్షల సంవత్సరాలు పడుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో మాత్రం ఈ ప్రక్రియ కొన్ని గంటల్లోనే పూర్తి అవుతుంది!


1999లో ఛేంజింగ్ వరల్డ్ టెక్నాలజీస్ సంస్థ (ఫిలడెల్ఫియా) తన తొలి నమూనా ఫ్యాక్టరీని ప్రారంభించింది. అందులో పనికిరాదనుకునే చెత్త విలువైన పదార్ధాలుగా మారే క్రమాన్ని ఒక ఉదాహరణతో పరిశీలిద్దాం.


కబేళాల ద్వారా వెలువడే ఎముకలు, రక్తం, లాంటి వ్యర్థాలను ఉపయోగిస్తున్నారనుకుందాం... దాదాపు 700 కిలోల వ్యర్థాన్ని నీటితోపాటు ఒక భారీ స్టోరేజ్ ట్యాంకర్ లోకి వేస్తారు. 350 అశ్వికశక్తిగల గ్రైండర్ ఒకటి మిశ్రమాన్ని గుజ్జులా మారుస్తుంది.


• వ్యర్ధాన్ని దాదాపు 500 డిగ్రీ ఫారెన్ హీట్ వరకూ వేడిచేస్తారు. పీడనాన్ని 600 పౌండ్లవరకూ ఉంచుతారు.


8 దాదాపు 15 నిమిషాలపాటు వ్యర్థం కుతకుత ఉడుకుతుంది. ఈ దశలో ఇందులోని పదార్థాలు పాక్షికంగా డీ పాలిమరైజ్ అవుతాయి.


• ఆ తరువాత బురదలాంటి వ్యర్ధం మీద పీడనాన్ని అకస్మాత్తుగా గణనీయంగా తగ్గిస్తారు. దీనివల్ల అందులోని 90 శాతం నీరు తొలగిపోతుంది.


వ్యర్ధంలోని ఖనిజాలు (ముఖ్యంగా ఎముకల్లోనివి) అక్కడే నిలిచిపోతాయి. మెగ్నీషియం, కాల్షియంలు సమృద్ధిగా ఉండే పదార్ధాన్ని పైపుల ద్వారా స్టోరేజీ టాంకుల్లోకి మరలిస్తారు. 


• మిగిలిన వ్యర్ధాన్ని మరోసారి దాదాపు 900 డిగ్రీల ఫారెన్ హీట్ వరకూ వేడి చేస్తారు. 6 ఈ దశలో వ్యర్ధంలోని పదార్థాల్లోని అణువులు పొడవాటి కర్బన గొలుసులుగా విడిపోతాయి. ఆ తరువాత  వాయువులు, చమురు, ఖనిజాలు, కర్బనపు పొడులను వేర్వేరుగా వేరు చేస్తారు.