Eat meat for proteins?

💥ప్రోటీన్ల కోసం మాంసమే తినాలా?




ప్రొటీన్లు అంటే మాంసకృత్తులు. అవి ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ అవసరం అవుతాయనేది మొదట తెలుసుకోవాలి. 


పెరిగే పిల్లలకీ, గర్భవతులకీ, బాలింతలకీ తగినంతగా మాంసకృత్తులతో కూడిన ఆహారాన్ని అందించాలి. నలబయ్యో పడిలో పడ్డాక, స్త్రీ పురుషులు క్రమేణా ప్రొటీన్ల వాడకాన్ని తగ్గించుకుంటూ రావటం మంచిది. ఎందుకంటే వయసు పెరిగాక, శరీరంలో నిర్మాణ క్రియల వేగం తగ్గి ఉన్నధాతువులను కాపాడుకోవటానికి, శరీరం తనపని తాను చేసుకునేలా నడుపుకు పోవటానికి, అవసరమైన మరమ్మత్తులకు మాత్రమే ప్రొటీన్లతో పనుంటుంది.


కాబట్టి  వయసులో పెద్దవాళ్లకు ప్రొటీన్ల వాడకాన్ని తగ్గించుకోవాలని వైద్యులు చెప్తారు.


మొక్కల ద్వారా వచ్చే ప్రొటీన్లకన్నా జంతువులద్వారా వచ్చే ప్రొటీన్లు శరీరానికి ఎక్కువగా వంటబడతాయి. అందుకని మాంసాహారాన్ని తగ్గించాలని వృద్ధులకు సూచించటం జరుగుతుంది. 


పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, వేరుశనగ గుళ్ళూ, బాదాం, పిస్తా లాంటివి ప్రముఖ శాకాహార ప్రొటీన్లు. పాలు, వెన్న ప్రొటీన్లను బాగా ఇస్తాయి. 


పాలను మజ్జిగలా మారిస్తే వాటిలో ప్రొటీన్లు ఎక్కడికీ పోవు. అంతే ఉంటాయి. కాబట్టి వయో వృద్ధులకు మజ్జిగ ఉత్తమంగా పనిచేస్తాయి.


చాలా ప్రొటీన్లు కొవ్వుతో కలిసి ఉంటాయి. వాటివలన ప్రొటీన్లతో పాటు అనవసరమైన కొవ్వు కూడా చేస్తుంది. ఆ యా ఆహార పదార్థాల లోంచి కొవ్వును తొలగించి కేవలం ప్రొటీన్లు మాత్రమే ఉండేలా వండటం కుదరక పోవచ్చు. 


కోడిగుడ్డు తెల్లసొన కన్నా, పచ్చసొనలో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, దాన్లో కొవ్వు (కొలెస్ట్రాల్)

 ఎక్కువగా ఉండటం చేత, వయో వృద్ధులకు పచ్చ సొన లేకుండా కోడిగుడ్డు పెట్టా చెప్తారు వైద్యులు.


ద్వారా కందిపప్పులోకన్నా దాదాపుగా రెట్టింపు ప్రొటీన్లు సోయాబీను, ఇతర చిక్కు రకాల్లో ఉన్నాయి. అందుకని, కందిపప్పు పెద్దవాళ్ళకు మేలు చేస్తుంది. దిక్కుకు బీన్స్ వగైరా వాతం చేసి నొప్పుల్ని పెంచుతాయి. శనగపప్పులో ప్రొటీన్లు అని పప్పు ధాన్యాలలో కన్నా తక్కువ. 


వేరుశనగ పప్పుల్లో అన్నింటికన్నా ఎక్కువ. తరువా? స్థానాన్ని వరుసగా పెసర, మినప వస్తాయి. ప్రతిరోజూ టిఫిన్లు తినేవాళ్ళూ మినప్పుళ అమితంగా వాడుకుంటూ ఉంటారు కాబట్టి, వాళ్ళకు అప్పటికే అవసరాన్ని మిం! ప్రొటీన్ల వాడకం ఉంటుంది. కానీ, అదనంగా చట్నీల ద్వారా, మాంసాహారం బీన్సు వేసిన కూరల ద్వారా మరింతగా ప్రొటీన్లు కడుపులోకి చేర్తున్నాయి. అందుకని? 


టిఫిన్లు తినే అలవాటు తగ్గించుకోవటం గానీ, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను అన్నంలో తగ్గించి తినటం గానీ ఏదో ఒకటి మార్పు చేయటం నలబై, దాటిన వారికి మంచిది!


శరీర పరిశ్రమ తక్కువగా ఉండే ఒక అరవై కిలోల మనిషికి, అరవై గ్రాముల ప్రొటీన్ అవసగం అవుతుంది. 


వంద గ్రాముల మోతాదులో కందిపప్పు 223గ్రా, పెసరపప్పు 24.5 గ్రా., శనగపప్పు 17.1గ్రా., మినప్పప్పు 24గ్రా., సోయాబీన్లు 43.2గ్రా. , వేరుశనగ 26.7 గ్రాముల చొప్పున ప్రొటీన్లని అందిస్తున్నాయి.


కూరగాయల్లో వెలగపండు, మునగాకు, కేలీ ఫ్లవర్, చిక్కుడు, బఠాణీలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ విధమైన దామాషాలో ఎవరికి వాళ్ళు లెక్కించుకుని ఎవరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో ఉజాయింపు లెక్కలతో భోజన ప్రణాళికను లెక్కించుకోవాలి. పిల్లలకూ, యవ్వనంలో ఉన్నవారికీ, ఎక్కువ ప్రొటీన్లు, వయసు పైబడ్డవారికి తక్కువ ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని అందించటమే బ్లిత.


మన వంటకాల తీరులో ఏ ఆహారపదార్థం ఎన్ని కేలరీలు ఇస్తోందో, ఎన్నీ ప్రొటీన్లు, విటమిన్లు ఇతర పోషకాలు ఇస్తోందో తేల్చి చెప్పటం కష్టం. ఉదాహరణకు వంకాయ కూరనే తీసుకుంటే దాని వండిన తూను బట్టీ, కలగలుపుగా వండిన తీరును బట్టి పోషకాల విలువ ఆధారపడి ఉంటుంది.


ప్రొద్దున్నే ఏం తినాలి?


రెండు భోజనాల మధ్య మరో భోజనం ఉండకూడదని చాలా మతాలు ప్రబోధిస్తాయి. రాత్రి భోజనంచేశాక ప్రారంభం అయ్యే ఉపవాసం రేపు మధ్యాన్నం భోజనం వరకూ కొనసాగాలి. మతపరంగా చూస్తే హిందువులు మధ్యాన్నం మహానివేదన' అయ్యేవరకూ కటిక ఉపవాసమే చేస్తారు. 


ఈ ఉపవాసాన్ని ఉపసంహరిచుకుని ఏదో ఒకటి తేలికగా తినటాన్ని breakfast (బ్రేక్ ఫాస్ట్) అంటారు పాశ్చాత్యులు. 


ఈ అర్థం 15వ శతాబ్ది తర్వాతే వచ్చిందనీ, అంతకు మునుపు మార్నింగ్ మీల్ అనే అర్థంలోనే పిలిచే వారని భాషా చరిత్ర కారులు చెప్తారు. దీన్ని ఆధునిక కాలంలో అల్పాహారం అంటున్నారు. 


చద్దన్నం కన్నా తక్కువ కేలరీలు కలిగిన తేలికపాటి ఆహారం అనే అర్థంలో బహుశా, ఈ అల్పాహారం అనే మాట వ్యాప్తిలోకి వచ్చి ఉంటుంది.


అమెరికన్లు తమ మొదటి ఆహారం ఘనం గానూ, నాణ్యంగానూ ఉండాలనుకుంటారు. ఇంగ్లీషువాళ్ళు సాంప్రదాయకమైన గ్రుడ్లు, ఓట్ మీల్, సాసుల్లాంటి తేలిక పదార్థాలను ఉదయం పూట తీసుకోవటం మంచిదని భావిస్తారు. 


ఫ్రెంచివాళ్ళు రకరకాల ధాన్యాలను మొలకలెత్తించుకుని సాతాళించు కుని తింటారు. రాగి, సజ్జా, గోధుమల్లాంటి ఈ ధాన్యాలను బ్రేక్'ఫష్ట ధాన్యాలని పిలుస్తారు.


ఉదయాన్నఅల్పాహారం (కార్బోహైడ్రేట్'లు కలిగిన ఆహారం) స్వల్పాహారం (గ్రుడ్లు, సలాదులు, సూపులూ) లేకఘనాహారం (nutrient-packed breakfastచేపలు, మాంసంవగైరా) ఏదో ఒకటి తీసుకోవటం తప్పనిసరి. ఏమీ తినకుండా మధ్యాన్నం దాకా కడుపును ఖాళీగా ఉంచటం మంచిది కాదని, ఆధునిక వైద్యశాస్త్రం కూడా చెప్తోంది. రాత్రి ఎనిమిది గంటలు, ఉదయాన్న ఆరుగంటలు మొత్తం 14 నుండి 16 గంటలసు దీర్ఘ ఉపవాసాన్ని పాటించినా మధ్యాన్నం (లంచి) ఆహారంరోజూ కన్నా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అక్కడ కూడా నాలుగు ముద్దలు తక్కువ తినాలని ప్రయత్నిస్తే, ఆకలి తీర్చుకోవటానికి కాఫీ టీలు త్రాగటం, పునుగులు, బజ్జీల్లాంటి జంకు తిళ్ళకు (junk foods) దారితీస్తుంది. ఆఖరుకి అది అతి భోజనం అలవాటుగా మారిపోయి, డైటింగ్ చేస్తుంటే బరువు పెరిగే పరిస్థితి వస్తుంది. అలాగని, నాస్టా చేయకుండా మధ్యాన్నం దాకా ఖాళీ కడుపున ఉండిపోవటం తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. షుగరు వ్యాధి, గుండెజబ్బులు కూడా దీనివలన కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


భారతీయులకు భారతీయమైన రీతిలో ఆహారం తీసుకోవటమే ఆరోగ్యదాయకం. ఉదయాన్న ఇడ్లీ, పూరీ, ఉప్మా, బజ్జీ పునుగులాంటి జంకు తిళ్ల కన్నా పెరుగన్నం తినటమే యోగదాయకం. చద్దన్నం అంటే పెరుగు అన్నమే గానీ, పాచిపోయిన అన్నం కాదు.

💥మందు కామందులు


 నా చిన్నప్పుడు మా తాతగారింటికి దావులూరు వెళ్ళాను. ఓ మోతుబరి తన కొడుకు తాగివచ్చాడని నానా యాగీ చేశాడు. ఊరంతా ఆ ఇంటి దగ్గర మూగి, ఒక సినిమాలా వింతగా చూసేసరికి ఆ తాగుబోతు సిగ్గు పడ్డాడు. మళ్ళీ తాగ లేదు. ఇప్పుడు అలాంటి సీను కనిపించదు. ప్రభుత్వాల్ని పోషిస్తోంది తాగుబోతులే! తాగని వాళ్ళు ఈ దేశంలో వేళ్ల మీద లెక్క పెట్ట దగినంత అల్ప సంఖ్యాకులు. I తాగని వాళ్ళ వలన ఏ ఉపయోగం లేదనే భావన సర్వత్రా వ్యాపించి ఉంది. తాగని వాడికి మర్యాద, మన్నన తగ్గి పోతున్నాయి.


మనుషులు తాగేవారు, తాగని వారు అని రెండు రకాలుగా ఉంటారు. తాగేవారిది మెజారిటీ! వాళ్ళకు మద్యం నిత్యావసర వస్తువు. 


పూర్వం బియ్యం, కందిపప్పు సంవత్సరానికి సరిపడా కొని నిలవబెట్టే వారు. ఇప్పుడు జనం అలా నిలవ బెడుతోంది ఫుల్ బాటిల్సునే! నూనె ప్యాకెట్టు వద్దు, సారాప్యాకెట్టు ముద్దు... అనేవారి సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యం. మద్యం మత్తులో ఓటేసే వాడే కదా రాజకీయపార్టీలను అందలం ఎక్కిస్తోంది...?


ఫుల్ బాటిలు తెచ్చి ఉచితంగా మన ఫ్రిజ్జులో పెట్టినా తాగని వాడు తాగడు. రెట్టింపు రేటుతో అమ్మినా తాగేవాడు ఆగడు. 


ఎవరి ఇంగితం వాళ్లది. “కందిపప్పు, వంటనూనెలలో పాటు మద్యం బాటిల్సు అమ్మితే పచారీకొట్లు బాగుపడతాయి. షాపింగ్ మాల్స్ వచ్చి చిల్లర వ్యాపారాన్ని దెబ్బతీస్తోన్నాయనే సమస్య ఆ విధంగా పరిష్కారం అవుతుంది” అని ఓ అధికారి నాతో అన్నాడు. 


“ప్రభుత్వం ఏ ఒక్కరి కోసమో పని చెయ్యదు. పైనుంచి చూస్తే అందరూ మాకు సమానమే...” అని ఆయన చిరాకు పడ్డాడు. తాగుబోతుల్ని చీదరించ గలిగేంత మెజారిటీ లేని వాళ్ళు ఎంత ఆక్రోశించినా ఫలితం ఉండదు.