Daytime sleep - night duties

💥 పగటి నిద్ర-రాత్రి డ్యూటీలు





జీవితం అందరికీ 10 నుండి 5 గంటల వరకూ ఉద్యోగం అన్నట్టు సాగిపోదు. అలాసాగాలంటే పెట్టి పుట్టాలి. అత్యాధునికంగా సాఫ్ట్ వేర్ రంగంలో అమెరికన్ కంపెనీలకు పనిచేసే ఇండియన్లు అర్ధరాత్రిపూట పనిచేయాల్సిన పరిస్థితి. 


బ్రతకాలంటే సంపాదించాలి. సంపాదించాలంటే రాత్రనక పగలనక పనిచేయాలి. షిప్టుల్లో రాత్రిపూట పనిచేయటం తరచూ జరిగితే దాని ప్రభావం ఆరోగ్యం మీద తప్పనిసరిగా ఉంటుంది.


శరీర పనితీరులో ఒక లయ ఉంటుంది. అది 24 గంటల కాలాన్ని వివిధపనులకు, అవసరాలకు తగ్గట్టుగా అలవాటుపడి ఉంటుంది. 


రాత్రి 10  నుండి తెల్లారేవరకూనిద్ర, ఉదయం మధ్యాహ్నంరాత్రి భోజన సమయాలకు ఆకలి, నం వేళకు కాలవిరేచనం ఇలా శరీరం లోపల ఉండే జీవగడియారం (biological clock) జీవన వ్యవస్థను నియంత్రిస్తుంది.


వృత్తి వ్యాపకాల కోసం షిఫ్ట్ డ్యూటీల్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు పోలీసులు, వైద్యులు ఇలాంటి వృత్తి వ్యాపకాల్లో ఉన్నవాళ్ళు రాత్రిళ్ళు సరిగా మేల్కొని పనిచేయాల్సి వస్తుంది. 


జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఐదారేళ్ళపాటు రాత్రిపూట మేల్కొని పనిచేసే వారిలో గుండెజబ్బుల శాతం ఎక్కువగా ఉంటుందని ఈ నివేదక సారాంశం. 


ప్రకృతికి విరుద్ధంగా ఇలా జీవించటాన్ని Circadian rhythm disruption అంటారు.


పాతికముప్పై యేళ్ళుగా రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవాళ్ళున్నారు. వాళ్లలో చాలామందికి పగటి డ్యూటీ వేసినా పని చేయలేనంతగా రాత్రి డ్యూటీలకు అలవాటు పడిపోతుంటారు. 


కొన్ని తరాలపాటు ఇలా జరిగితే అది జన్యుపరమైన మార్పులకు దారి తీయవచ్చు కూడా! రాత్రి డ్యూటీలు అలవాటుగా చేసే వాళ్ళు ఒక విధమైన, సామాజిక అవ్యవస్థకు 'social jet lag' గురి అవుతుంటారు. 


స్త్రీలలో ఈస్ట్రోజెన్ / లాంటి పునరుత్పాదక హార్మోన్ల ప్రభావం కూడా తోడవటం వలన రాత్రిపూట, డ్యూటీల ప్రభావం నడివయసు దాటిన స్త్రీల మీద మరింత ఎక్కువగా ఉంటుందని ఈ అద్యయనం తేల్చి చెప్తోంది.


బాహ్య ప్రకృతినీ, పర్యావరణాన్నే కాదు శరీర ప్రకృతుల్ని కూడా మనం మన అవసరాలు గడవటం కోసం విధ్వంసం చేస్తున్నాం అనిగుర్తించాలి. 


అతిగా నిద్ర మేలుకోవటం వలన బుర్ర పనిచేయటం తగ్గిపోతుంది. చేసే పనిలో నాణ్యత పడిపోతుంది. మనిషి పక్షవాతానికీ, గుండెజబ్బులకు, బీపీ, షుగరు, జీర్ణకోశ | సమస్యలకు, కీళ్లవాతానికీలోనౌతాడు. చీకట్లో మెలకువ, వెల్తురులో నిద్ర ప్రకృతి) విరుద్దాలే!


ఇలాంటి ఉద్యోగాలు తప్పనిసరి అయినప్పుడు శరీరంలో వాతము, వేడీవి పరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి ఆహారం ద్వారా వాతాన్ని తగ్గించి, చలవ చేసే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత నివ్వాలి. 


రాత్రి జాగరణాల వలన వాతం వికారం) చెందుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అది పక్షవాతానికి కారణం కావచ్చు కూడా నంటుంది ఈ తాజా పరిశోధన! కాబట్టి, ఆహార పదార్థాల్లో చలవ చేసే వాటికి ప్రాధాన్యత నివ్వాలి. 


పులుపు లేని కూరగాయలు, ఆకు కూరలు అన్నీమేలు చేస్తాయి. కానీ, వాటిని అతిగా చింతపండుతోనో, అల్లం వెల్లుల్లితోనో, శనగపిండితోనే నూనెతోనో వండినందు వలన వేడి, వాతం చేసేవిగా మారిపోతాయి.


ఉదయాన్నే ఒక క్యారెట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ (లేదా పులుపు లేశ్ ఏదైనా ఒక పండు)ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తీసుకుని రోజుత్రాగండి వాతం, వేడి తగ్గుతాయి. 


శరీర అనుకూలతను సాధించు కోవటానికి వాతహరంగానూ, వేడిని రూపు మాపేదిగానూ ఉండే ఆహార పదార్ధాలకోసం ప్రణాళిక వేసుకోండి. 


బూడిద గుమ్మడిని సొరకాయ పద్ధతిలో అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. అది శరీరంలో నిద్రలేమి వలన కలిగే అలసటను పోగొడుతుంది. మర్నాడు నిద్ర చాలక కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.


 బార్లీ జావ, సగ్గు బియ్యం జావ, సజ్జా గింజలు, సుగంధిపాల వేళ్ళ కషాయం, పల్లేరు కాయల కషాయం లాంటివి రాత్రి డ్యూటీలు చేసేవారికి మేలు చేస్తాయి. అలసటను నివారిస్తాయి.


పెరుగు, మజ్జిగ చలవనిస్తాయి. వివిధ కూరగాయల ముక్కలు వేసి తయారు చేసిన పెరుగుపచ్చడి జీర్ణకోశాన్ని బలసంపన్నం చేస్తుంది. ధనియాలు జీలకర్ర, కొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని దంచిన పొడిని మజ్జిగలో కలుపుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని రోజూ ఒకటి రెండుసార్లు తాగండి.


ఉదయాన్నే నిద్రలేచి, కాలకృత్యాలు, స్నాదికాలు ముగించుకుని ఏమీ తినకుండా పడుకుని నిద్రపోవటం మంచిది. 


రాత్రి 10 తరువాత ఎన్ని గంటలు మెలకువగా ఉన్నారో అందులో సగం సమయాన్ని ఉదయాన్నే ఇలా నిద్రపోతే నిద్రలేమి అనేది రాకుండా ఉంటుందని సుశ్రుతుడు చెప్పాడు. 


ఇలాంటి నియమాలు పాటించండి! పచ్చళ్లు కారాలు, మషాలాలు మానేయండి. రాత్రి డ్యూటీలు చేసేవారికి జీర్ణక ఆల్కాహాలు, సిగరెట్ల అలవాటువలన అనారోగ్యం వేగవంతం అవుతుందని హెచ్చరిక.


శరీరబలాన్ని కాపాడుకుంటే, ఎన్ని రాత్రుళ్ళు మేల్కొన్నా ఏమీ కాదు. వాత శరీర తత్వం, వేడి శరీర తత్వం ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువ కలుగుతాయి. వాళ్ళు ఆహార జాగ్రత్తలద్వారా పరిస్థితి చేజారకుండా కాపాడుకోవాలి.