Cows do not get sick

 💥ఆవులుంటే రోగాలు రావు


1. ఆవు చల్ల : ఆవు పాలను తోడు పెట్టి బాగా చిలికిన మజ్జిగ వగరు రుచిని కలిగి ఉంటాయి. అందువలన షుగరు వ్యాధిలోనూ, స్థూలకాయంలోనూ ఆవు చల్ల ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. కడుపులో ఎసిడిటీని పేగుపూతనీ తగ్గిస్తుంది. 


గేదె మజ్జిగ కన్నా తేలికగా అరుగుతాయి. అమీబియాసిస్ వ్యాధిలో ఆవు పెరుగు ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. లివర్ వ్యాధుల్లో ఇవ్వదగినవి. 


వేసవికాలం త్రాగటానికి అనుకూలంగా ఉంటాయి. చలవచేస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళున్న వారికి ఆవు చల్ల మంచివి.


 💥ఆవునెయ్యి : 


గేదె నెయ్యి ఎన్ని మోసాలకు గురతున్నదో ఆవునెయ్యి కూడా అన్ని రకాల కలీలతోనూ దొరుకుతోంది. వాటిలోంచి ఉత్తమమైనదాన్ని నమ్మకమైనదాన్ని ఎంచుకోగలిగితే, ఆవునెయ్యి సౌమ్యంగా పనిచేస్తుంది. 


శరీరానికి బలసంపన్నత నిస్తుంది ఎసిడిటీని తగ్గిస్తుంది. చర్మవ్యాధులు, ఎలర్జీ వ్యాధుల్లో ఇది మేలుచేస్తుంది. తాజా వెన్నని కాచిన నెయ్యి ఉత్తమ గుణాలను కలిగి ఉంటుంది. విషదోషాలను హరించే గుణం దీనికుంది.


💥ఆవుపాలు


అన్నిరకాల శరీరతత్వాలవారికీ అనుకూలంగా ఉంటాయి. అతిగా వేడీ చెయ్యవు, అతిగా చలవా చెయ్యవు. స్ధమశితలంగా ఉంటాయి. విషదోషాల హరంగా ఉంటాయి. తల్లిపాలతో సమాన గుణాలను కలిగి ఉంటాయి.

 కాబట్టి చంటి బిడ్డలకు అనుకూలంగా ఉంటాయి. కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, వాత వ్యాధులున్నవారికీ, ఆపరేషన్లు అయిన వారికి ఆవుపాలు మేలు చేస్తాయి. గర్భాశయానికి ఆవుపాలు టానిక్ లాగా ఉపయోగపడతాయి.


తెల్లావుపాలు వాత వ్యాధుల్లోనూ, కర్రావుపాలు పైత్య వ్యాధులు-ఎసిడిటీ వ్యాధుల్లోనూ, అనుకూలంగా ఉంటాయి.


💥ఆవు పెరుగు


 ప్రాణ పదమైనది . తాపాన్ని తగ్గిస్తుంది. బలకరం. శరీర కాంతిని పెంచుతుంది. వేసవి కాలంలో రాత్రిపూట వేడి అన్నంలో ఆవుపాలు కలిపి నాలుగు మగచుక్కలు వేసి తోడుపెట్టిన అన్నాన్ని ఉదయాన్నే తింటే అమిత చలవ చేస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకునే శక్తినిస్తుంది.


5. ఆవు మూత్రం : నొప్పుల్నీ, వాపుల్నీ తగ్గిస్తాయని వస్తాదులు అప్పటికప్పుడు పట్టిన ఆవు మూత్రంలో ఉప్పు కలిపి త్రాగేవాళ్ళట. ఆవుమూత్రంలో సోడియం, పొటాషియం లాంటి 24 రకాల లవణాలున్నాయి. ఈ లవణాల్లో బంగారానికి సంబంధించిన లవణాలు (గోల్డ్ సా)కూడా ఉన్నాయని చెప్తారు. 


మూత్రంలో వైద్య ప్రయోజనాలకు ఉపయోగించే ద్రవ్యాల్ని యూరో కైనేజ్ అంటారు. ఇది కేన్సర్ మీద కూడా పనిచేస్తుందని చెప్తారు. వారానికి ఒకసారి నిర్దేశిత మోతాదులో గోమూత్రాన్ని తీసుకుంటే కేన్సర్ కణాలను అదుపుచేస్తుందని, సూక్ష్మజీవులు లేని స్వచ్చపాత్రలో పట్టుకుంటే విష దోషాలు కలిగించదనీ, అందులోని యూరియా వెంటనే రక్తంలోకి చేరకుండానే విసర్జించబడ్తుందనీ గోమూత్ర నిపుణులు చెప్తున్నారు.


ఆవుల మలమూత్రాలు, పాలు పెరుగు, వెన్న వగైరా ద్రవ్యాలకు చెప్పిన గుణాలు కేవలం భారతీయ సంతతికి చెందిన ఆవులలాలో మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఈ నేలమీద ఆవుకు అంత పవిమ్రత, ప్రాధాన్యత! ఇంచుమించు ప్రతి దేవతకూ ఏదో ఒక జంతువుతో అనుబంధం ఉంది. కానీ, వాటికి వేటికీ లేని ప్రాధాన్యత ఆవుకు మాత్రమే ఉండటానికి కారణాలను పరిశీలించాలి.


కొన్ని రకాల మొక్కల్లో బంగారం స్వల్ప మాత్రలో ఉన్నట్టే భారతీయ గోసంతతి మలమూత్రాల్లో కూడా బంగారం ఉంటుంది. దాని పరిమాణం చాలా స్వల్పం కావచ్చు. కానీ అది విలువైనదే!


ఆవు గాల్ బ్లాడర్ (చేదుకట్టు అంటారు)ని వేరు చేసి ఎండిస్తే అందులోని బైల్ పదార్ధం ఎండి పలుకులుగా మారుతుంది. ఈ పలుకుల్ని గోరోచనం అంటారు. ఇది లివర్ కేన్సర్ పైన కూడా సత్ఫలితాలివ్వగల శక్తిమంతమైన ఔషధం. థైరాయిడ్ లోపం లాంటి వ్యాధుల్లో దీనికి గొప్ప వైద్య ప్రయోజనాలున్నాయి.

6. ఆవు మాంసం : ద్రవ్యరత్నావళి అనే వైద్య గ్రంథంలో “నశస్త మాహుః ఖలు జీవహింసా తథాపి లోకే క్షితిపాలకానామ్/ దేహస్య సంరక్షణ కారణాయ మాంసస్య వర్గం సముదీరయామః” అనే శ్లోకంతో మృగమాంస అధ్యాయం మొదలౌతుంది.


జీవహింస చేయటం తగదు. కానీ, లోక వ్యవహారాలు, పాలకుల పద్ధతి వీటిని బట్టీ, వైద్యుల సలహా మేరకు కొన్ని వ్యాధుల్లో దేష సంరక్షణ కోసం మాంసాహారం తప్పనిసరి కావచ్చు. అందుకని ఏ జంతువు మాంసానికి ఏఏ గుణాలుంటాయో వివరించనున్నట్టు ఈ గ్రంథం చెప్తోంది.


ఎద్దు మాంసం చాలా బలకరమైందీ, శక్తివంతం అయ్యింది కూడా! టీబీ ఎయిడ్స్ లాంటి విష జ్వరాల్లో ఉపయోగ పడుతుంది. వేడి వలన కలిగే పొడిదగ్గు, జలుబు లాంటివి తగ్గిస్తుంది. వాత వ్యాధుల్లో మేలు చేస్తుంది. కానీ, తిని అరిగించు కోవాలంటే జీర్ణశక్తి బాగా ఉండాలి. అది లేనివాడు ఎద్దు మాంసంతింటే జీర్ణకోస వ్యాధుల పాలిట పడతాడు.


గేదె మాంసంలో కొవ్వు ఎక్కువ. తీపి గుణాన్ని కలిగి ఉంటుంది. నిద్ర కలిగిస్తుంది. పురుషత్వాన్ని పొఎంచుతుంది. చాలా కష్టంగా అరుగుతుంది.


మేకమాంసం బాగా చలవ చేస్తుంది. టీబీ, ఎయిడ్స్ లాంటి జబ్బులున్నవారికి, వాతవ్యాధులున్నవారికి పెట్టదగినది. మొలల వ్యాధిని కూడా తగ్గిస్తుంది. తేలికగా అరుగుతుంది. షుగర్, బీపీ, గుండె జబ్బులున్నవారికి మేలు చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. లివర్ వ్యాధుల్లో కూడా తినదగినదిగా ఉంటుంది.


ఇలా పోల్చినప్పుడు ఇతర బలిష్టమైన జంతు మాంసాలకన్నా నల్లమేకమాంసం టీబీ లాంటి జబ్బుల్లో ఔషధంగా పనిచేస్తుంది. నల్లమేకకు టీబీ రాదనీ, దాని మాంసంలో ఆ వ్యాధిని ఎదుర్కొనే గుణాలున్నాయని చెప్తారు. 


కాబట్టి, మేకమాంసమే సర్వశ్రేష్టం అని వైదిక యుగంలోనే నిర్ధారించారుయ్. బలులు ఇవ్వటానికి, మనిషికన్నా, గుర్రం కన్నా, ఆవుకన్నా, మేక సముచితమైందని భావించారు. 


గౌతమబుద్ధుడు బలులకు వ్యతిరేకంగా ఉద్యమించేవరకూ ఈ జీవహొఇంస కొనసాగింది. ఆ తరువాత బౌద్ధ ప్రభావాన మనుషులంతా జీవహింసాత్మకమైన మాంసాహారాన్ని మానుకున్నారు. అశోకుడి శాసనాలలో తాను శాకాహారిగా ఎలా మారిందీ తెలియ జేసేవి ఉన్నాయి. 


వైద్య ప్రయోజనాల కోసం దేహ సంరక్షణ కోసం మాత్రమే మాంసాన్ని తినాలనే ద్రవ్యరత్నావళి గ్రంథకర్త అభిప్రాయమే సరైనది!


ఆవు ఎముకలు, దంతాలు, గిట్టలతో భస్మం చయారు చేస్తారు, వైద్యానికి పనికొచ్చే ఒక ఔషధం. ఆవు వెంట్రుకలు, చర్మంతో వస్తువులు డప్పులుపగైరా తయారౌతున్నాయి. ఆవుపేడ ఇప్పటికీ మారుమూలప్రాంతాల్లో వంటచెరకుగా ఉపయోగపడుతోంది.

 💥ఆహార జాగ్రత్తలు


  ఆహారం గురించి పట్టించుకోవద్దనీ, ఆహారానికీ, వ్యాధులకు సంబంధం ఏమీ లేదనీ ఏ వైద్య శాస్త్రమూ చెప్పదు. పొట్టని పాడు చేసుకోకుండా ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకుని తినాలనే వైద్యులందరూ చెప్తారు.


 పచ్చిమిరపకాయల బజ్జీల బండి మీద దండయాత్ర చేయవద్దని చెప్పకుండా కడుపులో మంటని తగ్గించటం ఏ వైద్య విధానంలోనూ సాధ్యం కాదుకదా! ఆయుర్వేద శాస్త్రం జారరాగ్నిబలాన్ని కాపాడటం ద్వారా రోగాల్ని తేలికగా నివారించటానికి ప్రయత్నిస్తుంది. వ్యాధుల పైన ఆహార ప్రభావం గురించి ఆయుర్వేద వైద్యంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది!


 చరక సంహిత అనే వైద్యగ్రంథానికి చక్రపాణిదత్త వ్యాఖ్యానంలో గ్రహణీ వ్యాధి(అమీబియాసిస్, స్పూ, కలరా, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్, పెప్టిక్ అల్సర్) గురించి చెప్తూ, “శరీరప్రకృతికి సంబంధించిన పరిజ్ఞానం ఉంటే వికృతి జ్ఞానాన్ని, అంటే, రోగానికి కారణమైన అంశాన్ని తెలుసు కోవటం సాధ్యం అవుతుంది” అంటాడు.


 శరీర ప్రకృతులు మనుషులందరికీ ఒకే తీరున ఉండవు. ఒక్కో ఆహార పదార్థం ఒక్కో శరీర తత్వం పైన, ఒక్కో రకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. 


అలాగే జాఠరాగ్ని కూడా మనుషుల్లో వివిధ రకాలుగా ,ఉంటుంది. వివిధ ప్రాంతాలలో నివసించే వారిపైనా, వివిధ జీవన విధానాల పైన కూడా ఆధారపడి జాఠరాగ్ని ఉంటుంది. 


ఆయుర్వేద శాస్త్రంలో చిన్న ప్రేవుల్ని ఈ జాఠరాగ్నికి స్థావరంగా భావిస్తారు. ఈ జాఠరాగ్ని దుష్టి చెందితే సమస్త అనారోగ్యాలకూ తలుపులు తెరుచుకుంటాయి. మనుష్ఠులు ప్రయత్నపూర్వకంగా జాఠరాగ్నిని కాపాడుకోవాలంటుంది శాస్త్రం. 


జాఠరాగ్ని సమస్థితిలో ఉన్నప్పుడు అది ఆరోగ్య దాయకం. అది కట్టు తెంచుకుని పెరిగిపోతే అత్యగ్ని, భస్మకాగ్ని, తీక్షాగ్ని ఇలా పిలుస్తారు. 


దీనివలన శరీర ధాతువులన్నీ దహించుకుపోయి రోగి క్షీణిస్తాడు. జీర్ణాశయ వ్యవస్థ మొత్తం 7 ధ్వంసం అవుతుంది. జారరాగ్ని సమస్థితి కన్నా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మందాగ్ని లేదా అల్పాగ్ని అంటారు. దీనివలన శరీరంలోని మెటబాలిజం (జీవనక్రియలు) విష మందగించి పోతాయి. 


హైపో థైరాయిడిజం, షుగరు వ్యాధి లాంటి వ్యాధులకు. డి నిరా చేసు విటమిన్ బి విటమిన్ లాంటి పోషకాల లోపాల వలన కలిగే వ్యాధులకు మూలకారణం ఈ 'అల్పాగ్నే' నంటుంది. 


ఆయుర్వేద శాస్త్రం. మాంసం క్షీణించి జీవికొవ్వు పెరిగి, గుండె జబ్బుల్లాంటివి కూడా దీనివలన కలుగుతున్నాయి.

 ప్రతి వ్యాధినీ ఈ కోణంలోంచి పరిశీలిస్తే, జారరాగ్నిని కాపాడు కోవాల్సిన అవసరం అర్థం అవుతుంది. రోగి బలం అగ్ని బలం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని కాపాడితే రోగ బలం తగ్గుతుంది. 


ఈ నిరూపణల్ని బట్టి రోగాలపైన ఆహార ప్రభావం ఎంతటిదో అర్థం అవుతోంది. మందులతో చాలా వ్యాధులు తగ్గుతాయి. కానీ, ఆహార జాగ్రత్తలతో తేలికగా తగ్గుతాయి. 


తిరిగి రాకుండా ఉంటాయి. అన్నీ తినమంటే అర్థం ఏది మేలు చేస్తుందో ఏది కీడు చేస్తుందో గమనించి శరీరానికి మేలు చేసేవన్నీ తినమని అర్థం.


ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం 👇ఈక్రింది వెబ్ పేజీ చూడండి 👇

👉www.thelearnersedu.com👈


👉జీవశాస్త్రం General Studies MCQ Test -1👈


👉TET సైకాలజీ PRACTICE TEST-7 👈


👉GENERAL STUDIES రసాయన శాస్త్రం ప్రాక్టీస్ టెస్ట్ -3👈


👉తెలుగు వ్యాకరణం ప్రాక్టీస్ టెస్ట్ -8👈