Question and answers for Employees

 సందేహం - సమాధానం


ప్రశ్న:

నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి ముందు ఇరవై మూడు (23) నెలల కాలం వేరొక ఉద్యోగాన్ని చేశాను. ఆ సమయములో సిపిఎస్ అమౌంట్ రికవరీ చేశారు. కానీ అట్టి అమౌంట్ ఇప్పటివరకు నా PRAN అకౌంట్ కు జమ కాలేదు.

ఇట్టి విషయంలో రికవరీ చేసిన యూనిట్ అధికారికి పలుమార్లు అర్జీలు పెట్టుకున్నాను. కానీ సమస్య తీర లేదు. 2008 జనవరి నుండి 2009 నవంబర్ పెండింగ్ ఉన్నాయి సార్.?


సమాధానం:


2008, 2009 సంవత్సరాల్లో NPS కు సంబంధించి ఎలాంటి విధివిధానాలు లేవు. అవన్నీ సస్పెన్స్ ఖాతాలో ఉండేవి.

2010 సంవత్సరంలో సర్వీసులో ఉన్న ఉద్యోగులకు PRAN నంబర్ల కు అప్లై చేసుకుని 2010 లో  2004 నుండి 2009 వరకు ఉన్న వివరాలన్నీ DDO ల నుండి ఆన్లైన్ మాడ్యూల్ ద్వారా పొంది క్లియర్ చేశారు.

బహుశా అప్పటి మీ DDO గారు కూడా ఈ ప్రాసెస్ చేసి ఉండొచ్చు, కానీ, ఆ సమయానికి మీకు PRAN లేకపోవడం వల్ల జమ అయి ఉండకపోవచ్చు. మీరు మీ మిస్సింగ్ క్రెడిట్ వివరాల స్టేట్మెంట్ బిల్ టోకెన్ నంబర్, బిల్ గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్, ఆ బిల్లులో మొత్తం CPS అమౌంట్, మీ పే, DA, CPS, బిల్ కాష్ అయిన తేదీ ఈ వివరాలతో తయారు చేసి STO గారితో సర్టిఫై చేయించి DTA కి పంపితే వారు క్రాస్ చెక్ చేసుకుని తగిన ప్రాసెస్ చేస్తారు.


ప్రశ్న:


NGO అంటే ఏయే ఉద్యోగులు ? SGT,SA లు వంటి టీచర్స్ NGO అవుతారా?


సమాధానం:


వాస్తవంగా చెప్పాలంటే ఎన్.జీ.వో అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎన్.జి.జి.ఓ అంటే నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఆ కేడర్ లో చేర్చరు. అయితే ఫండమెంటల్ రూల్స్, లీవ్ రూల్స్, ఇవన్నీ ఉపాధ్యాయుల పేరుతో జారీ కాలేదు. అయినా ఇవి ఉపాధ్యాయులకు వర్తిస్తాయి.


ప్రశ్న:


6 లేదా 12 సంవత్సరాల సర్వీసు నిండే ముందు పదోన్నతి వస్తే ఫీడర్ కేటగిరీలో 6 లేదా 12 సంవత్సరాలు నిండే వరకు ఆగి, ఆ స్కేల్ పొందాక పదోన్నతి స్కేల్ పొందే అవకాశం ఉందా ?


సమాధానం:


ప్రమోషన్ ఆర్డర్ అందుకున్న తరువాత 25 రోజుల్లోగా క్రొత్త పోస్ట్ లో చేరకపోతే ఆ ప్రమోషన్ రద్దవుతుంది. జీ.వో.ఎం.ఎస్.నెం. 123, జీఏడి తేదీ. 14.03.2001.