School Management Committee smc Election process ||

 


*♦SMC ఎన్నిక ప్రక్రియ♦*

   *🔷సభ్యుల ఎన్నిక🔷*

👉ప్రతీ తరగతిలో ముగ్గురు

     సభ్యులు కావాలి.

1.ప్రతికూల పరిస్థితి ఎదురు

   కొంటున్న వారు.

♦అనగా.

🔶SC

🔶ST

🔶వలస వచ్చిన వారు.

🔶వీధి బాలలు.

🔶HIV బాధితులు.

🔷పై విధంగా పిల్లల 

   తల్లిదండ్రుల లో ఒకరు.

2.బలహీన వర్గాలు.

♦అనగా.

🔶BC.

🔶మైనారిటీ.

🔶వార్షిక ఆదాయం 60 వేల

     లోపు ఉన్న OC వారు.

🔷పై వారిలో ఒకరు.

3.జనరల్.

♦అనగా.

🔶కులం,మతం తో సంబంధం

     లేకుండా తరగతిలో ని

     పిల్లల తల్లిదండ్రులు

     అందరూ.

🔷ఇందులో ఒకరు.


   *♦గమనిక♦*

👉ప్రతీ తరగతి ముగ్గురు

     సభ్యులలో ఇద్దరు 

     మహిళలు తప్పని సరి.

🖕🖕🖕🖕🖕🖕🖕🖕

👉మరి పై మూడింటిలో

     దేని నుండి ఇద్దరు

     మహిళలు అనే ప్రశ్న?

👉ప్రతి తరగతి ఎన్నిక

     అప్పుడు పై 3 పేర్లతో

    3 చిట్టీలు రాసి ఒక చిన్న

    అమ్మాయితో తీపిద్దాము.

♦ఉదా:1,3 వెళ్లినవి.అంటే

    ప్రతికూల,జనరల్ మహిళ

   లు మరి 2 వది బలహీన

   వర్గాలు మహిళ కావచ్చు

  లేదా పురుషులు కావచ్చు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

తల్లిదండ్రులు అందరూ

వచ్చారు.ఇప్పుడు ఒక క్లాస్

రూం లోకి 1 వ తరగతి వారిని

పిలిచాం.

👉మొత్తం పదిమంది.

👉50% లేదా ఎక్కువ ఉంటేనే

     ఎన్నిక 

👉4 గురే వచ్చారు.ఎన్నిక

     రేపటికి వాయిదా.

👉OK. అందరూ వచ్చారు.

     సభ్యుల ఎన్నిక విధానం

     వివరిస్తాం.చిట్టీలు వేస్తాం.

👉దాని ప్రకారం 3 గురు

     సభ్యులను ఎన్నుకుంటాం.

🔶ఇలా 1 నుండి అన్ని 

     తరగతులు పూర్తి చేయాలి.


♦ఇంకొక విషయం.

👉ఒక క్లాసు ఎన్నిక.

👉10 మంది తల్లిదండ్రులు

      వచ్చి కూర్చున్నారు.

👉ప్రతికూలం నుండి ఒక్కరు

     ఎవరు పోటీ చేస్తారు అని

     అడిగాం.వెంటనే ఇద్దరు

     మహిళలు లేచారు.

👉వారు కాక 8 మంది 

      ఉన్నారు.

👉ఇప్పుడు ఓటింగ్.

👉అది చేతులు ఎత్తటమా,

     రహస్య ఓటింగా.

👉OK ఐపోయింది.

👉2 వది,3వది కూడా మొత్తం

     ఆ పది మంది తో ఎన్ను

     కోవాలి.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

♦సభ్యులను ఎన్నుకోవడం

     లో కొన్ని సూచనలు.

1.ప్రతీ విద్యార్థి తల్లి లేక తండ్రి

   ఎవరో ఒకరు మాత్రమే

   ఒక తరగతిలో

   ఎన్నికల్లో పోటీకి మరియు

   పాల్గొనుటకు అవకాశం

   కలదు.

2.ఒక వేళ ఇద్దరు పిల్లలు

   ఒకే కుటుంబం వారు వేరు

   వేరు తరగతి లో ఉన్నారు.

  తల్లి ఒక తరగతిలో,తండ్రి

 ఒక తరగతి లో సభ్యులు గా

ఉండవచ్చు లేదా ఓటింగ్ లో

పాల్గొనవచ్చు.

♦అంటే ఇద్దరికి అవకాశం

      కలదు.

3.కానీ ఒక తరగతిలో పోటీ

    ఓడిపోతే మళ్ళీ అతడే

    ఇంకో తరగతిలో పోటీ

   చేసే అవకాశం లేదు.

*♦మరి పిల్లలు తక్కువ*

      *ఉంటే*

     *EX:ఒక బడి లో*

🔶 1 లో 2

🔶2 లో 3 

🔶3 లో 2 

🔶4 లో 3

🔶5 లో 6గురు

పిల్లలు ఉన్నారు 

♦మరి ఎలా?

🔶1 లో ఇద్దరు సభ్యులే

🔶2లో ముగ్గురు సభ్యులే

🔶3 లో ఇద్దరూ సభ్యులే

🔶4 లో ముగ్గురూ సభ్యులే

♦కానీ 5 లో 6 గురు ఉన్నారు

     కాబట్టి ఎన్నిక పెట్టి

    3 గురు సభ్యులను 

    ఎన్నుకోవాలి.

♦అంటే ముగ్గురు అంతకన్నా

     తక్కువ మంది ఉంటే

    అందరూ సభ్యులే.

♦4లేదా అంతకంటే ఎక్కువ

     మంది ఉంటే ఎన్నిక 

     పెట్టాలి.


🔶ఇంకో ఉదాహరణ🔶

    ♦ఒక బడిలో

🔷1 లో 10

🔷2 లో 9

🔷3 లో 4

🔷4 లో 9

🔷5 లో 7

👉ఉన్నారు.

1,2,4,5 ఎన్నికకు సమస్య

లేదు.

👉కేవలం 3 తరగతి

      సమస్య.దీనిలో కూడా

     3 గురు పోటీ చేస్తే

     సమస్య లేదు 3 గురు

    సభ్యులు.

♦లేదా 4 గురు పోటీ 

     చేస్తామని నిలబడ్డారు.

👉ఓటింగ్ పెట్టాలి.

♦అదేంది 4 గురు పోటీ

     చేస్తుంటే మరి ఓటు

     వేసేది ఎవరు?

🔷ఇక్కడ 4 తరగతి లో

     ఉన్న 9 మంది సభ్యులను

     కేవలం ఓటింగ్ కోసం

     ఉపయోగించు కొని

     3 గురు సభ్యులను

     ఎన్నుకోవాలి.


*♦ఇక చైర్మన్, వైస్*

      *చైర్మన్ ఎన్నిక*

👉ఇద్దరిలో ఒకరు మహిళ

      తప్పనిసరి.

👉ఇద్దరూ మహిళలు ఐనా

      మంచిదే.

👉చైర్మన్ BC ఐతే వైస్

     చైర్మన్ SC

👉అటూ, ఇటూ మార్పు.