శ్రీ రాముడు ఆదర్శ జీవితం || About Sreerama History sampoorna ramayanam || సంపూర్ణ రామాయణం || Greatness of sreerama 


రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది? 🙏🚩


మాయలు మంత్రాలు చూపించలేదు. 

విశ్వరూపం ప్రకటించలేదు. 

జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు... 

చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు... 


పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... 

తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు... 


కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... 

అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస  వధ చేశాడు... 


అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. 

లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు… 

అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది? 


ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.


🚩 శాస్త్ర ధర్మం 🚩

తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.


🚩 స్నేహ ధర్మం 🚩

 మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.


 🚩యుద్ధ ధర్మం 🚩

వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.


రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు


మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||


 ‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన


🚩దయా ధర్మం 🚩

సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు. 


🚩మనుష్య ధర్మం 🚩

రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.


 ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ 


అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.


🚩 సోదర ధర్మం 🚩 

రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.


పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి.. కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. 


రాముడూ అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. 


రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం.


      🚩🌹🌿🌹🙏 జై శ్రీరామ్ 🙏🌹🌿🌹🚩


అంతా రామమయం

మన తెలుగునాట భక్తి అంటే ముందు రాముడే గుర్తు వస్తాడు.. శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి, పంచవటి ఇక్కడే ఉండటం మనం చేసుకున్న పుణ్యం.. దాదాపుగా ఊరూరా రామాలయం సర్వసాధారణం.. ప్రతి ఊరిలో రామయ్య, రామశాస్త్రి, రామారావు, రాంరెడ్డిలు కనిపిస్తారు..

ఇక శ్రీరామ నవమి వచ్చిందంటే పండగే.. చలవ పందిళ్లు వేసి రాముని జయంతి, కల్యాణం, పట్టాభిషేకం కన్నుల పండువగా నిర్వహిస్తాం.. రామరసాన్ని తాగుతాం.. ఈ రాముడు, రామభక్తి తెలుగు నేలకే పరిమితం కాదు.. 

అసలు ఎవరు ఈ రాముడు?.. ఎందుకు ఆయనపై ఇంత భక్తి?.. యావత్ భారత దేశమంతా ఆయన్ని ఎందుకు పూజిస్తోంది?.. విదేశాల్లో సైతం రామాయణ గాథను ఎందుకు ఇష్టపడుతున్నారు?.. అసలు రామాయణంలో ఏముంది?..

రాముడు అందరివాడు.. ఆసేతు హిమాచలం రామతత్వం వ్యాపించింది.. ముఖ్యంగా తెలుగు నేలకు రామభక్తికి విడదీయరాని సంబంధం ఏర్పడింది.

 ఉత్తరాదిన అయోధ్యలో పుట్టిన రాముడు వనవాసంలో భాగంగా దక్షిణాదికి వచ్చాడు.. సీత, లక్ష్మణులతో కలసి దేశమంతా తిరిగాడు.. సీతాపహరణంతో  లంకకు వెళ్లి రావణున్ని వధించి, అయోధ్యకు చేరుకొని పట్టాభిషక్తుడయ్యాడు. ఇలా యావత్ భారతదేశం రాముని పాద స్పర్శతో తరించింది. 

రాముని కథ ఎన్నిసార్లు చదివినా, విన్నా తనివి తీరదు.. అందుకే వాల్మీకి మహర్షి రాసిన రామాయణానికి తోడు ఎందరో కవులు, పండితులు ఈ గాథను రాశారు.. మళ్లీ మళ్లీ రాస్తున్నారు.. అదే రామాయాణానికి ఉన్న విశిష్టత.. 

రాముని కథ భారత దేశానికే పరిమితం కాలేదు.. వేలాది సంవత్సరాల కిందటే రామాయణ గాధ దేశ సరిహద్దులను కూడా దాటి ప్రపంచ దేశాలను చేరింది.. ఇండోనేషియా, థాయ్ లాండ్, కాంబోడియా లాంటి తూర్పు ఆసియా దేశాల్ని సైతం రామాయణం ప్రభావితం చేసింది. చరిత్రలో తొలి ప్రపంచ ఆధ్యాత్మిక కథ శ్రీమద్రామాయణమే అని చెప్పక తప్పదు..

శ్రీరామ నామం ఎంతో మధురం.. రామాయణం కేవలం ఒక పౌరాణిక కథ కాదు.. రామున్ని భగవంతునిగా ఎందుకు పూజిస్తున్నామో అర్థం చేసుకోనిదే రామ కథ పరిపూర్ణం కాదు..


సకల గుణాభిరాముడు

రాముడు కేవలం విష్ణుమూర్తి అవతారం కావడం వల్లే భగవంతుడు కాలేదు.. ఆయన ధర్మాచరణే ఆరాధ్యున్ని చేసింది.. శ్రీరామున్ని గురుంచి ఎంత చెప్పినా తక్కువే.. 

సకల సద్గుణాలు, పెద్దలపట్ల వినయ విధేయతలు కలవాడు.. 

రాముడు ఆదర్శ నాయకుడు, పితృవాక్య పాలకుడు, గురు భక్తుడు, ఏక పత్నీ వ్రతుడు, మర్యాదా పురుషోత్తముడు, ధర్మ సంరక్షకుడు, సద్గుణవంతుడు, మహా వీరుడు, ప్రేమాస్పదుడు, ఆదర్శ మిత్రుడు.. సకల గుణాభిరాముడు.. 

 మాతృ-పితృ భక్తితో ఆదర్శ తనయునిగా, ఏకపత్నీవ్రతంతో ఆదర్శ భర్తగా, తోబుట్టువుపై మమకారంలో ఆదర్శ సోదరునిగా, గురువు ఆనతో రాక్షస సంహారం చేసిన ధర్మ రక్షకునిగా, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని పాలించిన ఆదర్శ ధర్మపాలకునిగా, నమ్మిన మిత్రులకు రక్షకునిగా.. ఇలా ఎన్నో వైవిధ్య రూపాలల్లో రాముడు కనిపిస్తాడు.

ప్రజల పట్ల ఆత్మీయత, సేవకులపై ఔదార్యం చూపించాడు. శత్రువులపై కూడా దయాగుణం చూపించాడు... భక్తుల పట్ల శరణాగత వాత్సల్యం, కృతజ్ఞత-క్షమా హృదయం, పరాక్రమం, ప్రజారంజక పాలక.. ఇలా ఎన్నోలక్షణాలు మనకు ఆదర్శప్రాయంగా కనిపిస్తాయి.. 


ఆదర్శవంతమై పాత్రలు

అలాగే రామాయణంలోని పాత్రన్నీ విశిష్టతగలవే.. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, క్షత్రజ్ఞుడు, ఆంజనేయుడు. కౌసల్య, కైకేయి, విశ్వామిత్రుడు, శబరి, అహల్య, అగస్త్యుడు, గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్ట ఉంది.. 

ఆదర్శ పత్నులుగా సీత, ఊర్మిళ.. ఆదర్శ సోదరులుగా లక్ష్మణ, భరత శత్రుజ్ఞులు.. ఆదర్శ భక్తునిగా ఆంజనేయుడు.. ఇలా అన్ని పాత్రలను విశ్లేషించవచ్చు..

రాముడైనా, రామాయణ గాథ అయినా ఒక తరానికి పరిమితం కాలేదు. ఇది పురాణ కథగా మాత్రమే భావించలేం.. మన తాత ముత్తాతలు, తండ్రులు అందించ రామాయణ సందేశాన్ని మన పిల్లలకు అందించాలి.. వారు భావి తరాలకు చాటి చెప్పేలా ప్రోత్సహించాలి.. మన కుటుంబ విలువలు, ప్రేమ, అన్యోన్యత, అనురాగం రామాయణంతో ముడిపడి ఉన్నాయి.. 

శ్రీరామ నామం ఎంతో మధురం.. రామాయణం కేవలం ఒక పౌరాణిక కథ కాదు.. రామున్ని భగవంతునిగా ఎందుకు పూజిస్తున్నామో అర్థం చేసుకోనిదే రామ కథ పరిపూర్ణం కాదు..


రామరాజ్యం అంటే..

రామరాజ్యం అనే మాటను అందరూ వినే ఉంటారు.. కానీ  దాని సంగతి తెలిసిన వాళ్లు తక్కువే.. త్రేతాయుగం నాటి రామరాజ్యాన్ని ఇప్పటికీ ఆదర్శ రాజ్యంగా ఎందుకు చెప్పుకుంటున్నారు? 

ఈ రోజుల్లో రామరాజ్యం అనగానే కొందరు ఉలిక్కి పడతారు.. వారి దృష్టిలో ఇది హిందుత్వ పాలన.. రాముడంటే వారి దృష్టిలో కేవలం హిందూ దేవుడు.. రామున్ని పూజించేవారు మతతత్వవాదులు, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, వీహెచ్‌పీ వారు.. ఇలా మన బుర్రలను కలుషితం చేస్తున్నారు.. వీరంతా రాముని గురుంచి, రామాయణం గురుంచి తెలుసుకొని మాట్లాడితే మంచిది..

గాంధీజీ స్వాతంత్ర్యం తర్వాత రామరాజ్యం కావాలని కోరుకున్నారు..  మన దేశం పరాయి పాలన నుండి విముక్తి పొందితే రామ రాజ్యంగా వెలుగొందుతుందని నమ్మేవారు.. మహాత్మాగాంధీ ‘రఘుపతి రాఘవ రాజారామ్..’ అనే గీతాన్ని పాడించేవారు.. దురదృష్టవశాత్తు ఈ రోజున రాముడు అంటే ఒక మతానికి పరిమితమైన వ్యక్తిగా చూస్తున్నారు.. సూర్య చంద్రులు ఉన్నంత కాలం రాముడు మనతో ఉంటాడు.. 

అసలు రామరాజ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం..

వాల్మీకి మహర్షి రామాయణంలో రామరాజ్యం చక్కగా వివరించారు. రామరాజ్యానికి మూలం ధర్మం.. ఆ కాలంలో ప్రజలు ధర్మాన్ని తప్పకుండా పాటించేవారు. ధర్మం ఆచరించడంతో అంతా శుభమే జరుగుతుందని వాల్మీకి తెలిపారు అందుకే  రామరాజ్యాన్ని  ‘ధర్మ రాజ్యం’ గా చూడాలని అంటారు.దీన్ని ఆధునిక కాలంలో మహాత్మాగాంధీజీ ప్రస్థావించారు. బ్రిటిష్‌ వారు వెళ్లిపోగానే స్వదేశీ పాలకుల చేతికి అధికారం వస్తుంది.. కానీ పాలన ఎలా ఉండాలి? దీనికి రామ రాజ్యాన్ని నమూనాగా చూపించారు గాంధీజీ.. సత్యం. ధర్మం మీద నడిచిన రాజ్యమే రామరాజ్యం..

శ్రీరాముడు గొప్ప నాయకుడు.. వ్యక్తిగత ప్రయోజనాలు విడిచిపెట్టి ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చాడు.. రాముని పాలనలో ఎన్నో విశిష్టతలు కనిపిస్తాయి.. ఆయన మర్యాద పురుషోత్తముడు. ఆదర్శ పాలకుడు. శత్రువుల పట్ల సింహస్వప్నం. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న ప్రేమమూర్తి.అసమానతలు లేని ఆదర్శ రాజ్యాన్ని నిర్మించాడు.. రామరాజ్యం అంటే ఆదర్శ పాలన.. 

ప్రజలంతా సుఖ శాంతులతో, ఆనందంగా, సంతృప్తిగా జీవించే వాతావరణం కల్పించాడు రాముడు.. ఏ వర్గం కూడా వివక్షకు గురి కాని పాలన అది.. కోటలో ఉండే రాకుమారుడు, తోటలో ఉండే పేద వాడు ఒకే రకమైన హక్కులు కలిగి ఉన్న రాజ్యాన్ని రాముడు నిర్మించాడు.

రామరాజ్యంలో రుతువుల్లోనే వర్షాలు పడ్డాయి. ఫలితంగా విరగకాసిన పంటలు రైతుల చేతికందేవి. రైతుల  ఇళ్లల్లో ధాన్యం రాశులు పోసి ఉండేవి.  ఆకలి దప్పులు, కరవు అనే మాటే విని ఎరగరు అప్పటి  ప్రజలు. రామరాజ్యంలో దోపిడీలు, దొంగతనాలకు తావు ఉండేది కాదు. రోడ్ల మీద ఎంత ఖరీదైన ఆభరణాలు కానీ, నగలు కానీ మరచిపోయినా వాటినెవరూ తీసుకు వెళ్లే వారు కాదట. సొంతదారులు వచ్చేవరకు అవి అలాగే ఉండేవి.

రామరాజ్యంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించేవారు. అసూయాద్వేషాలు ఉండేవి కాదు. ఎవరి జీవితాలు వాళ్లు సంతృప్తిగా ఉండేవారు.. కొడుకులు, కూతుళ్లనే కాదు మనవలు, మనవరాళ్లను  కూడా చూసేంతకాలం బతికే వాళ్లు. ప్రజల్లో అసూయాద్వేషాలు ఉండేవి కాదు.

రామరాజ్యంలో ఎటు చూసినా ఆదర్శ కుటుంబాలే ఉండేవి.. సైనికులు  దేశానికి రక్షణగా నిలబడేవారు,  ఎప్పటికప్పుడు శత్రు రాజుల కదలికలను డేగకళ్లతో పరిశీలిస్తూ  దేశాన్ని కాపాడేవారు.. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రామరాజ్యంలో హింసకు తావు లేదు.. అంటే యుద్దానికి తావులేని రాజ్యాన్ని నిర్మించాడు రాముడు..‘అయోధ్య ’ అంటేనే యుద్ధం లేని ప్రాంతం అని అర్థం.  


శ్రీరామ నవమి సందర్భంగా రాముని గుణగణాలను గుర్తు చేసుకోవడంతో పాటు.. రామరాజ్య నిర్మాణం సాకారం చేసుకుందాం.  సందర్భంగా అందరికీ ఆయన కురుణా కటాక్షాలు శుభం కలగాలి అని కోరుకుంటూ.. #శ్రీరామరాజ్యం #జైశ్రీరాం


How much greatness is there in Rama? 🙏🚩


The magic spells were not shown.

The form of the universe has not been declared.

Life has so many difficulties.. The events that did not happen..

He lost his father at a very young age due to his mother's selfishness...


He took the forest path for the coronation day itself...

He went away from his wife whom he thought would stand with him as a companion...


Searched through tears in the dry boats..

Carrying endless sorrow in his heart, the monster killed him...


He experienced the same emotions, thoughts and anxieties as everyone else.

While the whole world is praising him as God, he clearly declared that Ego Dasaratmaja - Rama the son of Dasaratha.

But why did the whole world take him as an ideal?


He has practiced the righteousness to the fullest. He lived in such a pious manner that if you give a form to Dharma, you will get the form of Rama. Even if he didn't get the throne that came to his hand, even if Bharat himself asked him to come to the kingdom, whether Ravana kidnapped Sita whom he loved more than his life, whatever the situation is.. Not giving up on the righteousness. That is why Ramayya became Dharmamurthy. The only one that stood for the world.


🚩 The Dharma of Science 🚩

Sriramachandra has started for exile along with Sita and Lakshmanas for the sake of his father's words. Dasarathu dies in Ayodhya due to the grief of losing his son. Bharat who was in his uncle's house came and completed the funeral of Dasarath. He went to the forest in search of his brother and told the news of his father's death. Ramayya will collapse at once with this. Even if he is the eldest son, he will feel sorry for not being able to answer his father. On the spot, scientifically, he was going to perform rituals in the form of father, make pindas with flour and put them on darbhas. Meanwhile, a hand wearing gold bangles came in front of Rama. Vani heard that he is Dasaratha and asked to keep the pindam in his hand. But, Rama does not agree to this. He will keep pindas on Darbhas, according to the scientific promises. If you are really a Dasaratha, then accept the pindas placed on the Darbhas. He said very well that he will follow the scientific standards. Even when the father is in the grief of his father's demise also, he is not ashamed of the Shastra Dharma. Ramachandramurthy is the only ideal person who followed without fail.


🚩 The virtue of friendship 🚩

Ramalakshmanis will leave Seetamma and come a long way beyond Parnasha due to Mayaledi. Ravana who thought this as that will come in a different attire and abuses Seetamma. Jatayuvu will stop Ravana after observing all this. Using his wide wings as weapons, he threatens Ravana. Ravanaasura who lost patience will cut the wings of Jatayuvu. The king bird with broken wings will fall down. After a few years of searching for Sita, he will tell the story of Rama completely and leave his life in the hands of Rama. Ramayya accepts Jatayuvu as his close friend who sacrificed his life for his welfare and conducts his funeral rituals on his own. He is a Kshatriya. Exile in the making. The bird that died. However, did the great man himself answer the Jatayuvu and practically proclaimed the real meaning of friendship.


🚩 The virtue of war 🚩

Vali spoils his younger brother Sugriva's wife Ruma. Brother's wife is equal to daughter-in-law. Father in law is equal to father. Vaali lustfully desires his younger brother's wife who should be protected like a father. Not just that.. Vali is a traveler. It is Kshatriyadharma to hunt wild animals. Not only that, the tail of the boon that reduces the strength of others is in the neck. Whoever stands in front of the wind will lose their energy while wearing it. That is why Rama hid under a tree and fired an arrow on the sand. This is the law of war. Ramudu Kshatriya and Yuddha Dharma in the Vali slaughtering incident.


After Ravana's assassination, Vibhishan comes to Rama and asks him to give him his mortal body to perform Uttara rites. Ramachandra at that time


The benefit of getting rid of the enemy after death | Kriyatamadya Sanskaramada Mamapyesha Yatha Tava ||


'Terror! Whatever the enmity it ends in death. The war was fought because of the failure of the treaty. As per the customary rules, conduct the answer actions to your brother. From now on he is not only for you. He will say that he is my elder brother. This is Rama's dharma varthana


🚩The virtue of kindness 🚩

Ravana will punish the Vibhishan who preached to hand over Sita to Rama with expulsion. Vibhishanadu takes shelter in the feet of Ramachandra who is with huge rain force on the beach. Ramayya will give shelter to Vibhishan without any other thought. Not only that, he vows to kill Ravana and make Vibhishan the king of Lanka. But, sugrivudu etc don't like all this. They will go to Ramaiah who is in solitude and tell him not to believe Vibhishanu. Be warned that he is the messenger of Ravanasura Rama who heard everything is not Vibhishan at all... Even if Ravana takes shelter in him at the end.. He says he will also be given shelter. It is Kshatriyadharma to provide protection to the living beings who have taken shelter. The act of kindness as well. Even though he is in exile, at last he is in the battlefield, Ramayya did not leave his mercy.


🚩Humanity 🚩

Ramaravana war will end. Ravana will descend to the ground. Mullo's have a lot of fun. The noise that Vanarasena is making is not this much. Meanwhile the Brahmadi goddesses will appear. Lord Rama is praised in the form of Sree Mahavishnu. 'Yours is the essence of Vishnu. Actually you are a denier. But still being a government. Creation, state, rhythm, and you are the one who controls it.. By saying 'they attribute divinity to Rama. Even though Brahma himself came and told, Rama did not claim that he is God. He has not been attributed to divinity.


'The soul is the human being... Dasharathatmaja'


Saying that he is only Ram, the son of Dasaratha. Says only a normal person. This is the human dharma followed by Ramayya. Ramayya did not announce any magic and mantras. He did not claim to be god. Like a common citizen, he has experienced the pleasures of the kingdom as well as the pleasures of the state. Sriram is the incarnation who followed humanity completely.


🚩 Brotherhood 🚩

Ravana was killed. Ramayya is sitting relaxed by sending a present to Vibhishanu to bring Sita Devi who is in Lanka. A woman in the distance is coming towards him as she steps towards him. Who could she be? As Rama's thought was going on, she came and stood in front of me. Mother! Who are you? Why did you come like this? Aren't you scared of the bloody battlefield? Do you need any help from me? Ramayya asked her very politely. That's why Ramachandramurthy is giving answer! I am called mandodari. The wife of Ravanasuru who died in your hands. Rama! I have heard that you are Dharmamurti, monogamous, and you cannot think of any other woman's name other than Sita. My husband spoils so many women. I am curious to see a warrior like you. I understood your greatness only when I was humble when I saw a woman. Rama! Blessed are the ones who are. And now it's a holiday. And off she goes saying. This is it.. The brotherhood shown by Ramayya on other women.


Yogis who practice for sacred life and liberation want to live like Rama. Circumstances can change at any time. Might as well have it either way. Waiting for it.. Standing the test of time is the trait of the wise.


Ram also did the same thing. Can't always assume life goes as planned. Irritations happen without our involvement. If you stumble upon them, your life will go astray. Slowly remove the prickly thorn and move forward. It would be an amazing feeling to be able to do that. Ability to handle any matter properly increases.


Taking Rama as an ideal does not mean for worship. The essence of this is that we have to improve our lives by ourselves. Sacrifice, Dharma, Kindness, Power are the great qualities of Rama. Ramayana says to grow these.


Everything is full of Rama

Ram comes to mind first when we say devotion to Telugu Nadu.. Bhadradri and Panchavati where Sri Rama walked is here, it is our virtue that we have done.. Almost every village Rama temple is very common.. Ramayya, Ramashastri, Ramarao, Ramreddy will be seen in every village..

Now if Sri Rama Navami comes, it will be a festival.. Ram's birth anniversary, marriage, coronation will be celebrated by lighting chalava pandils as a feast for the eyes.. We will drink Ramarasa.. This Rama, devotion to Rama is not limited to Telugu land..

Who is this Rama actually?.. Why so much devotion to him?. Why the whole of India is worshipping him?. Why are people liking Ramayana story even in foreign countries?.. What is actually there in Ramayana?..

Lord Rama is for everyone.. Asethu Himachalam Ramatva has spread.. Especially, there is an inseparable relationship between Telugu land and devotion to Rama.

Rama who was born in North Ayodhya came to South as part of exile.. He roamed all over the country along with Sita and Lakshmanas.. He went to Lanka with the abduction of Sita, killed Ravana, reached Ayodhya and became coronated. Like this, the whole India has worshiped Ram's feet.

Rama's story will never be fulfilled how many times you read and listen to it.. That is why many poets and pandits wrote this story along with the Ramayana written by Valmiki Maharshi.. Been writing it over and over again.. That is the uniqueness of Ramayana..

Rama's story is not limited to India.. Thousands of years back itself, Ramayana story crossed the borders of the country and reached the world countries.. Ramayana has also affected East Asian countries like Indonesia, Thailand and Cambodia. It is inevitable to say that the first spiritual story of the world is Srimadramayana..

Sri Rama's name is very sweet.. Ramayana is not just a mythological story.. If you don't understand why Rama is being worshipped as God, the story of Rama is not complete..


Lord of all virtues

Rama did not become God just because he became the incarnation of Vishnu Murthy.. It was his practice of righteousness that made him adorable.. How much ever you say about Sriram is not enough..

He has all the virtues and is humble and loyal to elders..

Rama is an ideal leader, ruler of his father's words, devotee of Guru, one wife worshipper, respectful man, protector of dharma, virtuous man, great hero, lover, ideal friend.. Lord of all virtues..

As an ideal son with devotion to parents, as an ideal husband with monotheism, as an ideal brother in affection towards siblings, as a protector of religion who killed a monster with his teacher, as an ideal ruler who ruled by knowing the difficulties and pleasures of the people, as a saviour of friends who believed him. Rama appears in many different forms like this.

He showed affection towards people and bravery towards servants. He showed mercy even to the enemies.. Surrendering affection towards the devotees, grateful-forgiving heart, heroism, people's ruling.. Many of these qualities seem ideal for us..


Role models that are ideal

Similarly, all the characters in Ramayana are unique.. Rama, Sita, Lakshman, Bharat, Kshatragna, Anjaneya. Kausalya, Kaikei, Faithful Friend, Sabari, Ahalya, Agasthyudu, Guhudu, Sugriva, Vibhishanudu.. Like this, each character has its own unique features..

Sita and Urmila as ideal women.. Lakshmana, Bharatha Satrugna as ideal brothers.. Anjaneyudu as an ideal devotee.. This is how all the characters can be analyzed..

Whether it is Rama or Ramayana story is not limited to one generation. This can't only be considered a myth.. Ramayana message should be conveyed to our children by our grandparents and fathers.. Encourage them to pass on to future generations.. Our family values, love, unity, affection are tied up with Ramayana..

Sri Rama's name is very sweet.. Ramayana is not just a mythological story.. If you don't understand why Rama is being worshipped as God, the story of Rama is not complete..


Rama's kingdom means..

Everyone would have heard the word Ramarajyam.. But there are very few who know about it.. Why is Rama Rajya of Tretayugam still being called as an ideal kingdom?

In these days, some people will be shocked when they hear about Rama Rajyam.. In their view, this is Hinduism rule.. Ram means only Hindu God in their eyes.. Those who worship Rama are secularists, RSS, BJP, VHP people.. This is how our brains are being polluted.. It is good if all of them know about Rama and Ramayana and speak..

Gandhiji wanted Ramarajyam after independence.. Those who believe that if our country is free from the rule of others, it will shine as Rama's kingdom.. Mahatma Gandhi 'Raghupathi Raghava Rajaram.. The one who sings the song.. Unfortunately, today Rama is seen as a person limited to one religion.. Ram will be with us as long as sun and moon are there..

Let us know what is Ramarajyam actually..

Rama's kingdom was explained nicely in Valmiki Maharshi Ramayana. Dharma is the root of Rama's kingdom.. In those days, people used to follow Dharma. Valmiki was told that if you follow Dharma, everything good will happen. That is why they say that Ramarajya should be seen as 'Dharma Rajyam'. Mahatma Gandhi introduced this in modern times. As soon as the British leave, the power will come to the hands of the indigenous rulers.. But how should the ruling be? Gandhiji has shown Rama Rajya as an example for this.. Truth. Rama's kingdom is the kingdom that walks on dharma..

Sriram is a great leader.. He gave value to people's expectations leaving personal interests.. Many uniqueness can be seen in Rama's rule.. He is a man of respect. The ideal ruler. The lion's dream of the enemies. Premamurthy who has taken care of the people as her own children. He has built an ideal kingdom without inequalities.. Ramarajyam means ideal rule..

Rama has provided an environment where all the people can live happily and with satisfaction.. This is the rule where no caste is subject to discrimination.. Rama built the kingdom where the prince in the castle and the poor in the garden had the same rights.

In Ramarajyam, rains fell during the seasons. As a result, the crops that were broken are in the hands of farmers. Grains used to be poured in the houses of farmers. The people of that time would not understand the words of hunger and drought. In Ramarajyam, there was no limit for dacoits and thefts. No matter how expensive ornaments ornaments are forgotten on the roads, no one will take them away it seems. That's how they used to be until the owners came along.

In Ramarajyam, people used to live longer with complete health. Jealousy does not exist. Those whose lives are they satisfied.. Not only sons and daughters, they will live as long as they see their grandchildren. People don't have jealousy.

In Rama's kingdom, wherever you look, there were only ideal families.. Soldiers are the ones who protect the country, they protect the country by observing the movements of enemy kings with keen eyes.. Another interesting thing is that there is no limit to violence in Rama's kingdom.. That means Rama has built a kingdom that does not have a place for war.. 'Ayodhya' means a place without war.


Along with remembering the virtues of Rama on the occasion of Sri Rama Navami.. Let us make Ramarajya construction a reality. On this occasion, wishing that everyone has to be blessed with his kindness and blessings.. Victory to Sriram..

 #JaiSriRam