First indian Educational minister about Moulana Abul Kalam Azad మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి

 *🔥భారతదేశ  మొదటి విద్యాశాఖ మంత్రి  "మౌలానా అబుల్ కలాం ఆజాద్"  జయంతి నవంబరు 11🔥* (Telugu / English)


*✍" జాతీయ విద్యా దినోత్సవం " శుభాకాంక్షలు💐*

*💠విద్యాభివృద్ధికి మౌలానా బాటలు*


*🍥భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన పూర్తి పేరు సయ్యిద్ అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అహ్మద్ ఆజాద్. తండ్రి ముద్దుగా ఫిరోజ్ బఖ్త్ అని పిలుచుకునేవారు. అబుల్ కలాం అనేది బిరుదు. కలం పేరు ఆజాద్.1888 నవంబర్ 11న సౌదీ అరేబియాలోని మక్కాలో ఒక సంపన్న ధార్మిక కుటుంబంలో జన్మించారు. ఆలియా బేగం, మౌలానా ఖైరుద్దీన్ అహ్మద్ ఆయన తల్లిదండ్రులు. ఆజాద్ గొప్పస్వాతంత్ర్య సమర యోధుడు. తత్వవేత్త, సాహితీవేత్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, ఆధునిక భారత విద్యావ్యవస్థ నిర్మాత. అనేక భాషల్లో ఆయన నిష్ణాతుడు.1940 నుంచి1946 వరకు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. అదీ 35 ఏండ్ల అతి పిన్న వయసులోనే. 1947 నుంచి 1952 వరకు విద్యాశాఖమంత్రిగా, 1952 నుంచి 1958 వరకు విద్యా, ప్రకృతి వనరులు, శాస్త్ర సాంకేతిక మంత్రిగా, 1956 లో యునెస్కో అధ్యక్షుడిగా పనిచేసిన ఆజాద్ విద్యాభివృద్ధికి తీవ్రంగా కృషిచేశారు. విద్యా రంగంలో శాస్త్ర, సాంకేతికతను పెంపొందించడం కోసం పాటుపడ్డారు.1951లో ఖరగ్‌‌పూర్‌‌ ఇన్​స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ హయ్యర్‌‌ టెక్నాలజీని స్థాపించిన ఘనత మౌలానా ఆజాద్ దే. ఆయన గౌరవార్థం దేశంలో అనేక విద్యాసంస్థలకు మౌలానా పేరు పెట్టారు.*


*♦️హిందూ ముస్లింల ఐక్యతకు కృషి*


*హిందూ -ముస్లింల ఐక్యతను పెంపొందించడమే ధ్యేయంగా ‘అల్ హిలాల్‌‌’ పత్రికను స్థాపించారు. అప్పటి బ్రిటీష్‌‌ ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించడంతో ‘అల్ బలాగ్‌‌’ పేరుతో మరో పత్రికను ప్రారంభించారు. ఆయన మొట్టమొదట రాసిన గజల్ ‘అర్మగానె ఫర్ఖ్’ పత్రికలో ప్రచురితమైంది. తరువాత లక్నో నుంచి వెలువడే‘ఖుదంగె నజర్’,‘పయామెయార్’ పత్రికల్లో ఆయన కవిత్వం క్రమం తప్పకుండా ప్రచురితమయ్యేది. ఆయన‘నైరంగ్ ఆలం’ పేరుతో ఓ సాహిత్య పత్రికను కూడా ప్రారంభించారు. తర్జుమానుల్ ఖురాన్ పేరుతో పవిత్ర ఖురాన్ గ్రంథానికి వ్యాఖ్యానం రాశారు. భారత్, పాకిస్తాన్ విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జిన్నాతో విభేదించారు. మౌలానా ఆజాద్ మరణానంతరం 1992 లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందించి గౌరవించింది. లౌకికవాదానికి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన మౌలానా అబుల్ కలాం ఆజాద్1958 ఫిబ్రవరి 22 వ తేదీన డిల్లీలో తుదిశ్వాస విడిచారు. మౌలానా గౌరవార్థం ఆయన పుట్టిన రోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే రోజు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవంగానూ జరుపుకుంటున్నారు. దేశంలో ప్రతి పౌరుడికి విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని ఆయన బలంగా నమ్మేవారు. కానీ గత మూడు దశాబ్దాలలో విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చోటు చేసుకుని, విద్య వ్యాపారం కొనసాగుతున్నది. ప్రైవేటు రంగాల్లో స్థాపించిన విద్యాలయాలపై సరైన నియంత్రణ లేకపోవడంతో నాణ్యత లోపిస్తున్నది. విద్య మార్కెట్‌‌ వస్తువుగా మారింది. మౌలానా ఆకాంక్షలకు భిన్నంగా విద్యా రంగంలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఓట్ల కోసం పథకాలు పెడుతూ.. విద్యను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాల్లో ఇకనైనా మార్పు రావాలి. ప్రతి పేద పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించడమే మౌలానాకు మనం అర్పించే నిజమైన నివాళి!.*


*♦️జాతీయోద్యమంలో జైలుకు వెళ్లి..*


*1921లో సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942 లో క్విట్‌‌ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. పది సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు.1890లో ఆయన కుటుంబం కలకత్తా వచ్చి స్థిరపడింది. ప్రాథమిక విద్య ఇంటి దగ్గరే నేర్చుకున్నారు. పన్నెండేళ్ల వయసులోనే ఆయనకు ప్రత్యేకంగా రీడింగ్ రూమ్, సొంత లైబ్రరీ ఉండేవి. మొదట పార్శీ, అరబీ విద్యలు ఔపోసన పట్టారు. తరువాత ఫ్రాన్స్, ఇంగ్లీషు గ్రంథాల విస్తృత అధ్యయనం ప్రారంభించారు. మౌలానా విభిన్నరంగాల్లో అవగాహన, ఆసక్తి, నైపుణ్యం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పండిట్‌‌ నెహ్రూ మౌలానా రాజకీయ, సామాజిక పరిణతి గురించి గొప్పగా ప్రశంసించారు.*

*👉 మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు అబుల్ కలాం గులాం ముహియుద్దిన్.*


*👉 అతనిని అందరు ఆప్యాయంగా మౌలానా ఆజాద్ అని పిలిచేవారు.*


*👉 మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర  ముఖ్య  నాయకులలో ఒకరు. అతను  ప్రఖ్యాత పండితుడు మరియు కవి.* 


*👉 మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ,పెర్షియన్ మరియు బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు.* 


*👉 అతని పేరు సూచించినట్లు అతను  వాదనలో రారాజు మరియు  వాదనా పటిమలో మేటి. అతను తన కలం పేరు  ఆజాద్ గా స్వీకరించినాడు.*


*👉 మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరం లో  నవంబర్ 11, 1888 న జన్మించారు. అతని వంశస్తులు బాబర్ రోజుల్లో హేరాత్  (ఆఫ్గనిస్తాన్ లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానా ల  వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్ మరియు షేక్ మహ్మద్ జహీర్ వత్రి మరియు అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాలు ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి  మక్కా వచ్చి అక్కడే స్థిరపడ్డారు.*


*👉 1890 లో అయన తన కుటుంబం తో కలకత్తా వచ్చారు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అబ్యసించి నాడు. అతని విద్య ఇంట్లో సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే  బోధించారు. ఆజాద్ మొదట అరబిక్ మరియు పెర్షియన్ నేర్చుకున్నాడు తరువాత తత్వశాస్త్రం,రేఖాగణితం, గణితం మరియు బీజగణితం అబ్యసించి నాడు.  స్వీయ అధ్యయనం ద్వారా  ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర మరియు రాజకీయాలు నేర్చుకున్నాడు.*


*👉 ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందినాడు.అతను దివ్య  ఖురాన్ పై భాష్యం వ్రాసినాడు..*


*👉 అతను జమాలుద్దిన్ ఆఫ్ఘానీ యొక్క పాన్-ఇస్లామిక్ సిద్ధాంతాలను లో మరియు అలిగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క ఆలోచనలో ఆసక్తి చూపినారు. పాన్-ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్గనిస్తాన్,ఇరాక్, ఈజిప్ట్, సిరియా మరియు టర్కీ సందర్శించారు.‌‌*


*👉 ఇరాక్ లో అతను ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటo సల్పుతున్న   నిర్వాసిత విప్లవ కారులను కలుసుకున్నారు. ఈజిప్ట్ లో అతను షేక్ ముహమ్మద్ అబ్దుహ్  మరియు సయీద్ పాషా వంటి  అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను  కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకొన్నారు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాది గా రూపాంతరం చెందిoచాయి.*


*👉 విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్, బెంగాల్ కు చెందిన అరవింద ఘోష్, శ్రీ శ్యాం సుందర్ చక్రవర్తి వంటి   ప్రముఖ విప్లవకారులను  కలుసుకున్నారు మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు.*


*👉 విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు  పరిమితం అగుట ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాల లోపల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో  రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేసారు.  ఆసమయం లో విప్లవ వాదులు ముస్లింలను విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే  బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం  కమ్యూనిటీని ఉపయోగిస్తున్నాదని  భావించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను  పోగొట్టటానికి ప్రయత్నించారు.‌‌*

భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి *మౌలానా అబుల్ కలాం ఆజాద్* జయంతి నవంబరు 11 


*" జాతీయ విద్యా దినోత్సవం "* శుభాకాంక్షలు


*మౌలానా అబుల్ కలాం ఆజాద్* అసలు పేరు *అబుల్ కలాం గులాం ముహియుద్దిన్.* 


అతనిని అందరు ఆప్యాయంగా మౌలానా ఆజాద్ అని పిలిచేవారు.


 మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకరు. *అతను ప్రఖ్యాత పండితుడు మరియు కవి*. 


మౌలానా అబుల్ కలాం ఆజాద్ *అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ,పెర్షియన్ మరియు బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు*. 


అతని పేరు సూచించినట్లు అతను *వాదనలో రారాజు* మరియు *వాదనా పటిమలో మేటి*. అతను తన కలం పేరు ఆజాద్ గా స్వీకరించినాడు.


మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరం లో నవంబర్ 11, 1888 న జన్మించారు. అతని వంశస్తులు బాబర్ రోజుల్లో హేరాత్ (ఆఫ్గనిస్తాన్ లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానా ల వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్ మరియు షేక్ మహ్మద్ జహీర్ వత్రి మరియు అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాలు ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వచ్చి అక్కడే స్థిరపడ్డారు.


1890 లో అయన తన కుటుంబం తో కలకత్తా వచ్చారు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అబ్యసించి నాడు. అతని విద్య ఇంట్లో సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట *అరబిక్ మరియు పెర్షియన్* నేర్చుకున్నాడు తరువాత *తత్వశాస్త్రం,రేఖాగణితం, గణితం మరియు బీజగణితం* అబ్యసించి నాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర మరియు రాజకీయాలు నేర్చుకున్నాడు.


ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందినాడు.అతను దివ్య *ఖురాన్* పై భాష్యం వ్రాసినాడు..


 అతను జమాలుద్దిన్ ఆఫ్ఘానీ యొక్క పాన్-ఇస్లామిక్ సిద్ధాంతాలను లో మరియు అలిగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క ఆలోచనలో ఆసక్తి చూపినారు. పాన్-ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్గనిస్తాన్,ఇరాక్, ఈజిప్ట్, సిరియా మరియు టర్కీ సందర్శించారు.


 ఇరాక్ లో అతను ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటo సల్పుతున్న నిర్వాసిత విప్లవ కారులను కలుసుకున్నారు. ఈజిప్ట్ లో అతను షేక్ ముహమ్మద్ అబ్దుహ్ మరియు సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకొన్నారు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాది గా రూపాంతరం చెందిoచాయి.


విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్, బెంగాల్ కు చెందిన *అరవింద ఘోష్, శ్రీ శ్యాం సుందర్ చక్రవర్తి* వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు పరిమితం అగుట ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాల లోపల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఆసమయం లో విప్లవ వాదులు ముస్లింలను విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తున్నాదని భావించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించారు.


                  *🌻I.P.S☆GK GROUPS🌻*


*✍Happy National Education Day💐*


*👉 Maulana Abul Kalam Azad real name is Abul Kalam Ghulam Muhiuddin.*


*👉 Everyone affectionately called him Maulana Azad.*


*👉 Maulana Abul Kalam Azad is one of the main leaders of Indian freedom struggle. He was a renowned scholar and poet.*


*👉 Maulana Abul Kalam Azad was proficient in many languages ​​like Arabic, English, Urdu, Hindi, Persian and Bengali.*


*👉 As his name suggests he is the king of argumentation and master of argumentation. He adopted his pen name as Azad.*


*👉 Maulana Abul Kalam Azad was born on November 11, 1888 in Makkanagaram. His descendants belonged to Herat (a city in Afghanistan) during the days of Babur. Azad came from a lineage of Muslim scholars, or Maulanas. His mother was an Arab and Sheikh Mohammad Zahir Watri and his father Maulana Khairuddin was a Bengali Muslim of Afghan origin. Khairuddin came to Mecca from India during the Sepoy Mutiny and settled there.*


*👉 He came to Calcutta with his family in 1890. Azad studied traditional Islamic education. His education took place at home, initially taught by his father's teachers at home. Azad first learned Arabic and Persian, then studied philosophy, geometry, mathematics and algebra. He learned English, world history and politics through self-study.*


*👉 Maulana Azad received the necessary religious training. He wrote a commentary on the Holy Quran..*


*👉 He was interested in the pan-Islamic theories of Jamaluddin Afghani and in the thought of Aligarh Sir Syed Ahmad Khan. With pan-Islamic sentiments he visited Afghanistan, Iraq, Egypt, Syria and Turkey.‌‌*


*👉 In Iraq he met exiled revolutionaries who were fighting for the establishment of a constitutional government in Iran. In Egypt he met other revolutionaries from the Arab world such as Sheikh Muhammad Abduh and Said Pasha. He became acquainted with the feelings of the Young Turks in Constantinople. All these contacts transformed him into a nationalist revolutionary.*


*👉 After returning from abroad, Azad met prominent revolutionaries like Arvinda Ghosh of Bengal, Shri Shyam Sundar Chakraborty and took up the revolt movement against the British rule.*


*👉 Within two years of knowing that revolutionary activities were limited to Bengal and Bihar, Maulana Abul Kalam Azad set up secret revolutionary centers in areas like Bombay and North India. The revolutionaries at the time considered Muslims as anti-revolutionaries because they felt that the British government was using the Muslim community against India's freedom struggle. Maulana Abul Kalam Azad tried to dissuade his companions from their grudge against Muslims.‌‌*


                  *🌻I.P.S☆GK GROUPS🌻*