TS Polycet Results 2022 || polycetts.gov || polycet results || Results ploycet 2022

 

TS POLYCET 2022 Results Released 💥నేడు (13-07-2022) టీఎస్ పాలిసెట్ 2022 ఫ‌లితాలు విడుద‌ల‌* 👉టీఎస్ పాలిసెట్ -2022 ఫ‌లితాలు ఈ రోజు విడుద‌ల కానున్నాయి. నాంప‌ల్లిలోని టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీఎస్ పాలిసెట్ అధికారులు వెల్ల‌డించారు. 👉జూన్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.
TELANGANA Polycet Results ను ఈ కింది వెబ్ పేజీ లో👇👇 చూడండి





*టీఎస్ పాలిసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌..*
------------------👇👇👇---------------

*టీఎస్ పాలిసెట్ – 2022 ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుద‌ల చేశారు. ఈ నెల 18 నుంచి 22 వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 20 నుంచి 23వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న పూర్త‌యిన అభ్య‌ర్థులు 20 నుంచి 25 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. 27న సీట్ల‌ను కేటాయించ‌నున్నారు. 27 నుంచి 31వ తేదీ వ‌ర‌కు త‌మ‌కు కేటాయించిన కాలేజీల్లో అభ్య‌ర్థులు.. ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.*

*ఫైన‌ల్ ఫేజ్ షెడ్యూల్*
*ఆగ‌స్టు 1 నుంచి పాలిసెట్ తుది విడ‌త కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. 1న తుది విడ‌త స్లాట్* *బుకింగ్ చేసుకోవ‌చ్చు. 2వ తేదీన ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు తుది విడ‌త వెబ్ ఆప్ష‌న్ల న‌మోదుకు* *అవ‌కాశం క‌ల్పించారు. ఆగ‌స్టు 6న సీట్ల కేటాయింపు జ‌ర‌గ‌నుంది. సీట్లు పొందిన అభ్య‌ర్థులు 6 నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగ‌స్టు 17 నుంచి పాలిటెక్నిక్ మొద‌టి సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. ఆగ‌స్టు 8న పాలిసెట్ స్పాట్ అడ్మిష‌న్ల విధివిధానాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.*