*మనసు మాటల ముత్యాలు*
*🦋HappY MorninG🦋*
Date: *24-12-2022*
*శనివారం*
*BeautifuL Words...Ⓜ️🌱✍🏻*
★ _*సరైన సమయం కోసం చూసే కంటే..! ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు.*_
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
★ _*సముద్రం అందరికీ ఒకటే కానీ....*_
●ఈత వచ్చినవాడికి *ముత్యాలు* దొరుకుతాయి.
●వలవేయడం వచ్చినవాడికి *చేపలు* దొరుకుతాయి
●నిలబడి చూసిన వాడికి *కాళ్లు* మాత్రమే తడుస్తాయి
*జీవితం కూడా అంతే...! అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్నం బలం ఎంత ఉంటే అంతే...!*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✍️🌱🍀🎋🤝
🌹 *నీటితో స్నానం చేసినవాడు*
*బట్టలు మాత్రమే మారుస్తాడు.*
*చెమటతో స్నానం చేసినవాడు*
*చరిత్రనే మారుస్తాడు.*
🌹 *అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి.*
*అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది.*
*పగలు తల దించుకునేలా చేస్తుంది.*
🌹 *మన దేశంలో మనిషిని మనిషిలా*
*చూసేది భూమి ఒకటే*
*ఏ కులపోడు పండించినా*
*పండుతుంది*
*ఏ కులపోడు చనిపోయినా*
*తనలోకి తీసుకుంటోంది*
🌹 *ఈ సమాజంలో నేను ఒక్కడిని*
*ఏం చేయగలనని*
*ప్రతి మనిషి నిరాశ చెందుతున్నాడు.*
*కానీ ఒక్కసారి తలెత్తి చూడు ప్రపంచానికి*
*వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని*
*గుర్తుంచుకో*
🌹 *తప్పు చేయనప్పుడు ఎవరికీ*
*తలవంచనవసరం లేదు.*
*ఎంతటి కష్టాన్నయినా ధైర్యంగా*
*ఎదుర్కోవచ్చు.*
🌹 *నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో*
*"రాజసం" ఉంటుంది.*
*ఎందుకంటే ఎవరి కాళ్ళు*
*పట్టుకోవాల్సిన అవసరం ఉండదు.*
*మరీ ముఖ్యంగా ఎవరికీ భజన*
*చేయనవసరం లేదు.*
*అదొక "రాజసం" అంతే!*
*అలా బ్రతకాలంటే*
*చాలా దమ్ము ధైర్యం ఉండాలి...!*
🌹 *ప్రవర్తన ఎల్లప్పుడూ తెలివి కంటే గొప్పది...*
*ఎందుకంటే, జీవితంలో కొన్ని పరిస్థితులలో మన* *తెలివి పని చేయకపోవచ్చు...*
*కానీ, మన ప్రవర్తన పరిస్థితులను చక్కదిద్దుతుంది...*
🌹 *పాపపుణ్యాలను నిర్ణయించేది కాలం.*
*కాలానికి విపరీతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది.*
*కర్మానుసారం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది...!*
*మనసు మాటల ముత్యాలు*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*
🌹 *నిన్ను ఇవాళ ఇబ్బంది పెట్టే*
*ప్రతి పని*
*రేపటి నీ అభివృద్ధికి*
*వచ్చే ఓ అవకాశం.*
🌹 *ఏ కారణం లేకుండా ఎవరూ కూడా కోపంగా కఠినంగా మారిపోరు...*
*కొన్ని పరిచయాలు...*
*కొన్ని జ్ఞాపకాలు...*
*కొన్ని అనుభవాలు...*
*కొన్ని సంఘటనలు...*
*అన్నీ కలిపి మనసుని, మనిషిని కఠినంగా మారుస్తాయి...*
🌹 *జీవితమనేది మనం నడిచే*
*దారి లాంటిది.*
*మనకు తోడుగా నడిచే*
*వారుంటారు.*
కానీ...,
*మనకు బదులుగా నడిచే*
*వారుండరు!*
🌹 *ఆలోచనల్లో నిజాయితీ*
*మాటల్లో దైర్యం..*
*చేతల్లో నిబద్దత ఉన్నవారే*
*మనకు అవసరం.*
🌹 *ఎదుటివాడికి బాగా సంపద*
*ఉందని.. నీకులేదని ఎన్నడూ*
*బాధపడకు..*
*నీ దగ్గర నిజాయతీ లేనప్పుడు*
*బాధపడు..!!*
🌹 *నిజాన్ని చెప్పడానికి మన దగ్గర తీరిక లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోవడమే మంచిది...*
*ఆవేశంతో మన ఆలోచన మళ్ళితే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తాము..!*