TET Paper 1 Grand Test 150 MCQ Questions || టెట్ పేపర్ 1 గ్రాండ్ టెస్ట్ 1 || TET TRT Previous Questions

 




టెట్ పేపర్ 1 Online Grand Test 150/150 Questions కు answers రాసి Submit చేస్తే వెంటనే Results వస్తాయి. మార్కులు పెంచుకోవాలంటే 
👇మరోసారి కూడా✍🏼 రాయవచ్చు👇

ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్ లు రాయడం కోసం ఈ 👇కింది వెబ్ పేజీ చూడండి 👇









            🙏🤝Thanks for Sharing 🤝🙏


ప్రిపరేషన్ Gap లో కాసేపు రిలాక్స్ కావాలి అనుకునే వారి కోసం ఒక చిన్న సరదా సరదా జానపద హాస్య కథ

👇రోకలి పూజ (సరదా జానపద కథ)*👇


    ..👉ఒకూర్లో రంగయ్య అని ఒకడుండేటోడు. వానికి బంధువులంటే చానా చానా ఇష్టం. ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని కాలు కింద పెట్టనీయకుండా మర్యాదలు చేసేటోడు. రోజుకోరకం పిండివంటలు చేపిచ్చి కడుపు నిండా తినిపించేటోడు. ఎప్పుడూ పొరపాటున గూడా ఎవ్వరినీ విసుక్కునేటోడు కాదు. రంగయ్య వుండేది నగరంలో, దాంతో నగరంలో పనిబడి వచ్చేటోళ్లందరూ రంగయ్య ఇంటికే వచ్చేవాళ్ళు. కొంతమంది ఏకంగా పదిరోజులూ, ఇరవై రోజులూ గూడా తిష్ట వేసేటోళ్ళు.

...👉🏻రంగయ్య గురించి తెలిసి ఎక్కడెక్కడి దూరపు బంధువులు గూడా వరుసలు కలుపుకోని ఇంటికి రావడం మొదలు పెట్టినారు. ఏదో నెలలో ఒక రోజు రెండు రోజులంటే పరవాలేదు. కానీ రోజూ ఎవరో ఒకరు వస్తా వుంటే ఎట్లా? వచ్చినవాళ్ళందరికీ అడిగినవన్నీ చేసి పెట్టలేక రంగయ్య పెండ్లాం కిందామీదా ఐపోతా వుండేది. అదీగాక అందరు అది కావాల ఇది కావాల అని అడిగేటోళ్ళే గానీ పనిలో కొంచంగూడా సాయం చేసేటోళ్ళు కాదు. అంతేగాక రంగయ్య సంపాదించేదంతా వాళ్ళకే సరిపోసాగింది. పెండ్లాం బిడ్డలు పస్తులున్నా పరవాలేదు గానీ వచ్చిన వాళ్ళకి కొంచెంగూడా లోటు రాకూడదు అంటూ రంగయ్య అప్పుల మీద అప్పులు చేస్తా మరీ పెట్టసాగినాడు. పెండ్లాం ఎంత నెత్తీ నోరూ కొట్టుకున్నా రంగయ్య పట్టించుకొనేటోడు కాదు. ఇది ఇట్లాగే జరిగితే ఏదో ఒక రోజు వీధిలో పడడం ఖాయం అనుకోనింది రంగయ్య పెండ్లాం. దాంతో బంధువులు ఇంటికి రాకుండా చేయడం కోసం ఒక ఉపాయం పన్నింది.

👉...ఒకసారి ఇంటికి ఐదుమంది బంధువులు వచ్చినారు. రంగయ్య వాళ్ళకి బాగా మర్యాదలు చేసి "కూర్చోండి బజారుకి పోయి మాంచి నాటుకోడి తీసుకోని వస్తా. మధ్యాన్నం రాగిముద్ద నాటుకోడి పులుసు తిందురుగానీ" అంటూ బజారుకు పోయినాడు. రంగయ్య అట్లా పోయిన కాసేపటికి రంగయ్య పెళ్ళాం ఒక మంచి రోకలి బండ తీసుకోనొచ్చి బంధువులకు కనబడేటట్లు దేవుని గదిలో పెట్టి, దానికంతా పసుపు పూసి, బొట్లు పెట్టి పూజ చేయడం మొదలుపెట్టింది.

👉🏻⊙﹏⊙అదిచూసి బంధువులు, “ఇదేందబ్బా ఈమె రోకలికి పూజ చేస్తా వుంది. ఇట్లాంటి పూజ ఎక్కడా చూడలేదే" అనుకోని ఆమె దగ్గరకొచ్చి “ఏందమ్మా... ఏం పూజ చేస్తా వున్నావు" అనడిగినారు. దానికామె మా ఆయనకి ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి పట్టుకోనింది. మా ఇంటి పక్కనే ఒక పెద్ద మంత్రగాడున్నాడు. వాడు "ఏం లేదూ... ఎవరయితే ఈ మంత్రించిన రోకలిబండతో రోజుకొకరి చొప్పున నూటా ఒక్క రోజుల్లో నూట ఒక్కమంది తలకాయలు పగలగొట్టి ఆ రక్తంతో అమ్మవారికి అభిషేకం చేస్తారో, వాళ్ళకి అమ్మవారు ప్రత్యక్షమయి అడిగినంత సంపదలిస్తుంది" అని చెప్పినాడు. ఆరోజు నుండీ నా మొగుసు ఎక్కడెక్కడి బంధువుల నందరినీ వెతికి మరీ పిలుచుకోనొచ్చి వాళ్ళ తలకాయలు పగలగొట్టి పూజ చేస్తా వున్నాడు. నిన్నటికి అరవైమంది పూర్తయినారు. ఈరోజు మీలో ఎవరికి మూడిందో ఏమో" అనింది. ఆ మాటలు వింటూనే వాళ్ళు అదిరిపడినారు. ఆమె ఆగు ఆగంటున్నా వినకుండా బెరబెరా సామాన్లన్నీ సర్దుకోని పెట్టెలు తీసుకోని బైటకు వురికినారు.(˘・_・˘)

వాళ్ళట్లా బైటకి పోవడం ఆలస్యం, రంగయ్య కోడి తీసుకోని ఇంటికి వచ్చినాడు. వచ్చి చూస్తే ఇంకేముంది ఇంట్లో బంధువులూ లేరు, వాళ్ళ సామాన్లు లేవు. "ఇదేందే ఎక్కడికి పోయినారు వీళ్ళంతా" అనడిగినాడు.(~_~;)

దానికామె “ఏం చెప్పమంటావు. వాళ్ళకు మనింట్లో రోకలిబండ బాగా నచ్చిందంట. అదివ్వమన్నారు. కొంచెం సేపు ఆగండి కూరలోకి మసాలా దంచి ఇస్తా అన్నా... దానికే వాళ్ళకు కోపం వచ్చింది. అడిగిన వెంటనే ఇవ్వనందుకు అలిగి పెట్టెలు సర్దుకోని ఎంత పిలుస్తా వున్నా ఆగకుండా అట్లాగే వెళ్ళిపోయినారు. ఇదిగో తొందరగా ఇది తీసుకోని పోయి వాళ్ళకి ఇచ్చి రాపోండి" అని రోకలిబండ రంగయ్య చేతిలో పెట్టింది.

⊙﹏⊙రంగయ్య రోకలిబండ తీసుకోని వాళ్ళని వెతుక్కుంటా వేగంగా పోతావుంటే ఊరి పొలిమేరల్లో ఐదుమంది పోతా కనబన్నారు. రంగయ్య గట్టిగా “ఆగండి ఆగండి. ఇదిగో మీరడిగిన రోకలిబండ తీసుకోండి" అని అరిచినాడు. వాళ్ళు ఎవరబ్బా పిలుస్తా వున్నారు అని వెనక్కు తిరిగి చూసినారు. చూస్తే ఇంకేముంది.... చేతిలో రోకలిబండ పట్టుకోని వేగంగా తమవైపే వురుక్కుంటా వస్తా వున్న రంగయ్య కనబడినాడు. అంతే వాళ్ళు అదిరిపడినారు. “రేయ్... వాడు మన తలలు పగులగొట్టడానికి రోకలిబండ తీసుకోని పరిగెత్తుకొని వస్తా వున్నాడు. దొరికినామా మనపని అంతే. సక్కగా స్వర్గానికే" అంటూ మరింత వేగంగా వానికి దొరకకుండా పారిపోయినారు.(╬☉д⊙)⊰⊹ฺ

అట్లా పారిపోయిన వాళ్ళు కనబడిన బంధువులకంతా రంగయ్యకు పట్టిన పిచ్చి గురించి చెప్పడం మొదలు పెట్టినారు. కొద్దిరోజుల్లోనే విషయం బంధువులకంతా తెలిసిపోయింది. భయంతో అందరూ రంగయ్య ఇంటికి పోవడం మానుకున్నారు. ఎవరన్నా కనబడినా పలకరించినా పలకకుండా తప్పించుకొని పోసాగినారు. ఎందుకట్లో అందరూ ఒక్కసారిగా తనింటికి రావడం మానుకున్నారో రంగయ్యకు ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కాలేదు. రంగయ్య పెండ్లాం మాత్రం తన ఉపాయం పారినందుకు లోపల్లోపల చానా సంబరపడింది.(˘・_・˘)


🙏🤝Thank you so much Harikishan సర్ 🤝🙏