Chaddanam is known

💥చద్దన్నం అంటే పెరుగన్నమే

గోపాల కృష్ణుని చుట్టూ పద్మంలో రేకుల లాగ కూర్చుని గోపబాలురు చద్దన్నం తిన్నారని పోతన గారు వర్ణించాడు. ఆ చద్దన్నం ఎలాంటిదంటే, “మీఁగడ పెరుగుతో మేళవించిన చల్టి ముద్ద/డాపలి చేత మొనయ నునిచి/చెలరేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు/వ్రేళ్ళ సందులను దా వెలయ నిటికి” ఇంట్లో నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కల్ని వేళ్ళతో పట్టుకొని మీగడ పెరుగు వేసి మేళవించిన చల్టి ముద్దలో నంజుకొంటూ తిన్నారని పోతన గారు వర్ణించారు. 


దీన్నిబట్టి చల్ది అంటే పెరుగన్నమేనని స్పష్టమౌతోంది. ఇక్కడ చలిది అనేది 'చల్ల'కు సంబంధించినదనేగాని, పాచిపోయిందని కాదు. చలి బోనం లేక చల్టి బోనం అంటే పెరుగన్నమే!


గ్రామదేవతలకూ, అలాగే, దసరా నవరాత్రులలో అమ్మవారికీ చద్ది నివేదన పెట్టే అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. చద్ది నివేదన అంటే, పెరుగు అన్నాన్ని నైవేద్యం పెట్టటం. ఇది శాంతిని ఆశిస్తూ చేసే నివేదన. గ్రామ దేవతలు ఉగ్ర దేవతలు. 


అందుకని ఆ ఉగ్రత్వం శాంతించటం కోసం చద్ది నివేదన పెడతారు. దధ్యోదనం అంటే పెరుగన్నంలో మిరియాలు, అల్లం, మిర్చి వగైరా కలిపి తాలింపు పెట్టి తయారు చేసినది. దక్షోజనానికీ చలిదన్నానికీ తేడా ఈ తాలింపు దట్టించటంలో ఉంది.


కొత్తతరం నాగరీకులైన తల్లిదండ్రులకు చద్దన్నం అంటే, కూలి నాలి చేసుకొనేవాళ్ళు తినేదనే ఒక ఆభిజాత్యంతో కూడిన అపోహ బలంగా ఉంది. తెలుగు నిఘంటువుల్లో కూడా చల్ది అన్నం అంటే పర్యుషితాన్నం (stale food) - ఉదయాన్నే తినే పాచిన అన్నం అనే అర్థాన్ని ఇవ్వటం కూడా ఈ అభిప్రాయాన్నే కలిగించింది.


పొద్దున్న పూట టిఫిన్లు, మధ్యాన్నం పూట పలావులూ, బిరియానీలు, రాత్రి పూట బట్టర్ నాన్లూ, పొరోటీలూ తినటం ఒక గొప్ప అనుకొని జీవిస్తున్న ఈ ఆధునిక యుగంలో ఉదయాన్నే చద్దన్నం తినే వాళ్ళంటే చాలామందికి చిన్నచూపు ఉంది. - అందునా, ప్రొద్దున పూట అన్నం తినకూడదన్నంత నిషేధాన్ని ఎవరికి వారే పెట్టుకొన్నారు. 


"అయ్యా! మీరు చలివణ్నం తించారా... ? " అనే ప్రశ్న వినగానే కన్యాశుల్కంలో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తుకు వస్తుంది. చల్టిపణ్ణం అంటే, పెరుగన్నం! ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అనుషానాలు చేసుకున్నాక ఉదయం పూట ఉపాహారంగా హాయిగా చల్టి తినేవారు. స్టీలు కంచాలు. స్టీలు క్యారేజీలు వచ్చాక చద్దన్నం స్థానంలో ఇడ్లీ సాంబారు టిఫిన్లు, కాఫీ, టీలు ఆక్రమించాయి. 


మన బల చద్ది కథ ఇది! చద్దన్నం అని ఈసడించకండి. అలా ఈసడించటం అమాయకత్వానికి మాత్రమే సంకేతం అని గమనించాలి. ఏమాత్రం పోషక విలువలు లేని టిఫిన్లు పెట్టి పిల్లలను బలహీనులుగా పెంచకండి. చద్ది పెట్టండి. సంపన్నులుగా ఎదుగుతారు - శారీరికంగానూ, మానసికంగా కూడా! తెలివి తేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.


💥చల్ల (మజ్జిగ) - అన్నీ మేళ్ళే


“మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగు, దాన్ని చిలికిన మజ్జిగ దొరికే అవకాశం లేదు. కాబట్టి, కైలాసంలో ఉండే పరమ శివుడికి, మజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలకంఠుడయ్యాడు. పాల సముద్రంలో ఉండే విష్ణుమూర్తికి కూడా మజ్జిగ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు! స్వర్గంలో 'సుర' తప్ప మజ్జిగ ఉండవు కాబట్టి, ఇంద్రుడు దుర్బలుడయ్యాడు.


 మజ్జిగతాగే అలవాటే గనక ఉంటే, చంద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగం, అగ్నికి కాల్చే గుణం ఇవన్నీ వచ్చేవే కాదు” అంటూ, యోగరత్నాకరం వైద్య గ్రంథంలో ఓ చమత్కార విశ్లేషణ కనిపిస్తుంది. 


మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తిరిగి తలెత్తకుండా వుంటాయనీ, విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, క్షయ, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ దీని భావం. అచ్చట  దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట!


పెరుగులో కలిపిన పేల పిండిని కరంభం అంటారని ఋగ్వేదంలో ఉంది. మధ్ధం, కరమ్భం రెండూ ఒకటేనని ఆపస్తంభ సూత్రం(12-4-13) చెప్తోంది. 


నూనెలో వేసి వేయించిన వేపుడు పదార్థాన్ని అతిగా తిన్నందువల్ల పొట్టలో బాధ కలిగినప్పుడు దాన్ని తగ్గించుకోవటానికి కరంభం చేసుకొని తిన్నట్టు ఋగ్వేద వర్ణన(చూ. వేదములు-ఆయుర్వేదం ముదిగొండ గోపాల రావు)కనిపిస్తుంది. 


ఉత్తరాది వారికి తొలినాటినుంచీ పెరుగు వాడకం ఎక్కువ. దక్షిణాదిలో చల్ల అంటే ప్రాణం. ఆఖరికి తెలుగు కృష్ణుడు కూడా మధురా నగరిలో చల్లలమ్మే అమ్మాయిల వెంటబడినట్టే వర్ణించారు మన కవులు.

 పూర్వ చల అనే పదం అత్యంత ప్రాచీనం మనకి. పూర్వ ద్రావిడ పదం 'సల్', తెలుగు భాషలో 'చల్' గానూ, పూర్వ దక్షిణ ద్రావిడ భాషలో 'అల్-అయ్'. గానూ మారినట్టు జి బ్రాన్నికోవ్ “ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు”లో పేర్కొన్నారు. 


పూర్వ ద్రావిడ 'సల్' లోంచి చల్ల (మజ్జిగ), 'చల్' లొంచి చల్ల (చల్లనైన) వేర్వేరు అర్థాల్లో వాడుకలోకి వచ్చాయి. ఈ తేడాని గమనించాలి. చలి పందిరి, చలివందిరి, చలివంద్రి, చలివెందర, చలివేంద్రము, చలివేందల, చలివేంద్ర ఈ పదాలన్నింటికీ త్రాగటానికి నీళ్ళు అందించే పందిరి అనే అర్థం. 


కానీ, మజ్జిగ ఇచ్చి దప్పిక తీర్చటం మన పూర్వాచారం. ఇప్పటికీ చల్ల లేదా మజ్జిగని మన పెద్దవాళ్ళు దాహం అనే పిలుస్తారు. చలివేంద్రాలంటే నీళ్లకుండలు కాదు, చల్లకుండలు పెట్టినవి!


ప్రధాన ద్రావిడ భాషలన్నింటిలో మజ్జిగ అనే పదం కూడా కనిపిస్తుంది. మచ్చికై' అని తమిళంలోనూ, 'మజ్జిగే' అని కన్నడంలోనూ పిలుస్తారు. ప్రాకృత భాషలో 'మజ్జి --అ' సంస్కృతంలో 'మార్జిత' అంటారు. మజ్జిగ పదమే సంస్కృతం తదితర భాషల్లోకి వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువ. 


మనం మజ్జిగకిచ్చినంత | ప్రాధాన్యత ఉత్తరాది వారు ఇవ్వరు. వారు పెరుగునే ఎక్కువ ఇష్ట పడతారు. ఆయుర్వేద శాస్త్రం పెరుగు కన్నా మజ్జిగే మంచివని సూచిస్తోంది.


మజ్జిగని నాలుగు రకాలుగా చేయవచ్చు. నీళ్ళు కలపకుండా, మీగడ తీయకుండా చిలికిన మజ్జిగని 'మౌలకం' అంటారు. మీగడని తీసిన గట్టి పెరుగుని చిలికితే, అది మధితం అనీ, నాలుగో వంతు నీళ్ళు కలిపి చిలికినది 'తక్రం' అనీ, సగం నీళ్ళు కలిపి చిలికినది 'ఉదశ్వతం' అని పిలుస్తారు. 


మనం ఎక్కువగా తన్ని అంటే చిక్కని మజ్జిగని వాడుతాం. అందుకని మజ్జిగకు 'తక్రం' అనే పేరు స్థిరపడింది. సగం నీళ్ళు దోషాలనూ హరించేదిగా ఉంటుంది.


గేదె మజ్జిగకన్నా ఆవు మజ్జిగ ఎక్కువ మేలు చేస్తాయి. చిలకటం వలనే మజ్జిగకు తేలికగా అరిగే గుణం, అరిగించే గుణం కలుగుతున్నాయి. అందుకనే పాలుకన్నా పెరుగు, పెరుగు కన్నా మజ్జిగ శ్రేష్టమైనవిగా ఉంటాయి. పెరుగును గానీ ఉంచి తాగితే, మేలు చేస్తాయి. తెలుగు వారు మజ్జిగతో అనేక వంటకాలు ఫ్రిజు లోంచి తీసాక, బాగా చిలికి, కొద్దిగా వెచ్చచేసి గానీ చల్లదనం ఆరేవరకూ కూడా తయారు చేసుకొంటూ ఉంటారు. 

ఇది అన్ని పుల్లని మజ్జిగలో సగం పాలు కలిపి ఉంచితే, దాన్ని 'కూర్చిక' అంటారు. మజ్జిగలో పాలు, బెల్లం తగినంత చేర్చి కాస్తే 'తేమనం' లేదా 'తిమ్మనం  అనే వంటకం తయారవుతుంది. 


బెల్లానికి బదులుగా అల్లం, మిర్చి, కొత్తిమీర, ఇతర సంబారాలు కాస్తే, అది మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసును 'మోరు' అనే పేరుతో పిలిచేవారని "గారెలు బూరెలు చారులు మోరులు” అని ఉత్తర రామచరితంలో ప్రయోగం ఉంది. 


బియ్యప్పిండి, అల్లం తదితర సంబారాలు చేర్చి ఉండలు కట్టి మజ్జిగ పులుసులో వేసి వండితే 'మోరుండలు' అంటారు. వీటిని ఆవడల్లాగా తినవచ్చు.


 మెంతులు తేలికగానూరి తాలింపు పెడితే అది మెంతి మజ్జిగ

 మజ్జిగలో పంచదార లేదా తేనె కలిపిన పానీయమే లస్సీ! ఇది హిందీ లేదా పంజాబి పదం కావచ్చు.


వేసవికాలంలో నిమ్మరసం, జీలకర్ర పొడి, ఉప్పు, పంచదార కలిపి పొదీనా ఆకులు వేసిన లస్సీ వడ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. దీన్ని 'సిగరి' అంటారు. శిఖరిణి అనే సంస్కృత పదానికి ఇది తెలుగు రూపం కావచ్చు. 


చిక్కని మజ్జిగ అయితే లస్సీ అనీ, వెన్న తీసేసి, నీళ్ళు ఎక్కువ కలిపితే 'చాస్' అని పిలుస్తారు. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలాంటివే! గుర్రం పాలతో kumiss అనే పానీయాన్ని మధ్య ఆసియా స్టెప్పీలు ఇష్టంగా తాగుతారట! పర్షియన్ Cacik అనేది మన మజ్జిగ పులుసు లాంటిదే! ఇందులో వెల్లుల్లి మషాలా బాగా కలిపి రొట్టెల్లో సంజుకొంటారు.


 ఐర్లండ్ లో తినేసోడా ఉప్పు, మజ్జిగతో చేసిన రొట్టెలు దొరుకుతాయి. మనవాళ్ళు కూడా మజ్జిగలో బొంబాయి రవ్వ చేర్చి రవ్వట్టు చేస్తుంటారు. మజ్జిగ నిండా సజీవమైన ఉపయోగ కారక లాక్టో బాక్టీరియా ఉంటుంది.పాలలో ఇది ఉండదు.


 మనం మజ్జిగచుక్కలు పాలలో కలిపి తోడు పెడుతున్నాం. ఆ మజ్జిగ చుక్కల్లో ఉండే అతి సూక్ష్మజీవులు పాలలో తమకు తాముగా పెరిగి పెద్ద కాలనీ ఏర్పరచు కుంటాయి. 


ఈ ప్రక్రియలో తోడుకున్న పెరుగుని చిలికితే కూడా బాక్టీరియానే కలిగి ఉంటాయి. కానీ, అవి వ్యతిరేకంగా పనిచేయటం ద్వారా మజ్జిగ తయారౌతాయి. 


నిజానికి పెన్సిల్లిన్ లాంటి 'యాంటీ బయాటిక్ ఔషధాలు లో ఉండే సూక్ష్మ జీవులకూ, మజ్జిగలో ఉండే సూక్ష్మ జీవులకూ చాలా తేడా చెడు బాక్టీరియాను శరీరం ఎదుర్కొనే విధంగా పనిచేస్తాయి. 


యాంటీ బయటిక్స్ ఉంది. ఇవి అనుకూలంగా పనిచేసి, శరీరాన్ని శక్తిమంతం చేయటం , ఎదుర్కొనేలా చేస్తాయి. అందుకని, మజ్జిగని 'ప్రో బయాటిక్ ఔషధం' అంటారు. 


మజ్జిగ ద్వారా ఈ మంచి సూక్ష్మ జీవులు ప్రేవులకు మేలు చేస్తాయి. విటమిన్లు తదితర పోషక విలువలను వంటబట్టేలా చేస్తాయి. జీర్ణప్రక్రియని సక్రమంగా ఉంచుతాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.