Are there benefits as a source of spills?

💥సాలీళ్ళ మూలంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయా ?




మనకు మాత్రం ఏం లేనట్టే! మొక్కలకు ఉపకారం చేస్తాయి. మొక్కలకు హాని చేసే | టకాలు ఎన్ని రకాలనో ఇవి తినేస్తాయి. 


అంతవరకూ లాభమే! ఇవి ఈగలు వంటి వాటిని ఆరగిస్తాయి. కాబట్టి కొంతలో కొంత మనకు ప్రయోజనకరమే !


💥సాలీడు దారాల్లో ఏమైనా తేడాలుంటాయా ?


- వివిధ రకాల సాలీడులు అల్లే దారాలలో తేడాలు వుండవుగాని, ఏ రకమైన సాలీడు అల్లే దారంలోనే అల్లిక తేడాలు ఉంటాయి. సాలీడు ఎన్నో రకాల దారాలను ఉత్పత్తి చేస్తుంది.


 జిగురు మాదిరిగా అంటుకుపోయే దారంతో అల్లే వలయాలలో కీటకాలు చిక్కుకుపోతాయి. ఇవి మెలి తిరిగి అడ్డంగా ఉంటాయి. అంటుకుపోని దారాలతో అల్లే వలయాలు గూడుకు ఆధారంగానూ తాను తిరగడానికి వీలుగానూ ఉంటాయి. 


ఇవి నిలువుగా, బలంగా ఉంటాయి. ఏ దారాలు అంటుకుపోతాయో, ఏవి అంటుకుపోవో ముందుగానే నిర్ణయించుకొని అల్లిక చేసి వలయాలను ఏర్పరచుకుంటాయి.


💥దారాల అల్లిక ఏ విధంగా ఉంటుంది ?


 గూడుకు సంబంధించిన కీలకమైన దారాన్ని ముందుగా అల్లుతుంది. 


ఈ దారానికి వేలాడుతూ మూడు దారాలను బండి చక్రం ఆకుల్లాగా అల్లుతుంది. తర్వాత బయటి ఫ్రేమ్ ను కలిపి, మరిన్ని దారాలు వాటిలో మధ్యకు కలిసేవిధంగా అల్లుతుంది. మెలితిరిగిన సర్పిలాకారంలో ఉండే దారాలను మరో దారం ఆధారంగా అల్లుతుంది.


 అది అంటుకుపోయే దారాలను లోపలికి చిక్కగా అల్లుకుపోతూ తాను ఆధారంగా ఉపయోగించిన దారాలను తెంపివేస్తుంది. సర్పిలాకారపు దారాలు గూడు మధ్యస్థానానికి దాదాపు చేరితే గూడు అల్లకం పూర్తయినట్టే.


💥సాలీడు ఆహార పద్ధతి ఎలా ఉంటుంది ?


- సాలీడు రోజు మొత్తంలో ఏదో ఒక కీటకాన్ని భోంచేసి విశ్రాంతి తీసుకుంటుంది. ఇంతలోనే ఆకలి మరో కీటకం గూడులో చిక్కుకుంటే లేదు కాబట్టి ఆ కీటకం మీదకు విషాన్ని విరజిమ్మి కీటకం ఊరుకుంటుంది. 


చనిపోయిన ఆ కదలికలు లేకుండా వున్న తర్వాత, చిక్కగా ఉన్న దారాలతో చుడుతుంది. మళ్ళీ ఆకలి వేసినప్పుడు నింపాదిగా దానినీ తింటుంది.

💥నీటి మీద కూడా సాలీళ్ళు కనిపిస్తాయేంటి ?


- భూమి మీద అన్ని చోట్లా జీవించగల సాలీళ్ళు ప్రకృతిలో ఒక అద్భుతమైన జీవులు. నీటి మీద నివసించే సాలీళ్ళు కూడా ఉన్నాయి. కొన్ని రకాల సాలీళ్ళు సంవత్సరం పొడవునా నీరు లేకుండా జీవిస్తాయి. 


యూరప్ లో కొన్ని నీటి సాలీళ్ళు పూర్తిగా నీటి అడుగునే గూడు కట్టేస్తాయి. ఒక సాలీడు మినహా మరే జీవి ఈ విధంగా భూమి మీద, నీటి మీద, నీటి అడుగునా గూడు అల్లిక చేయలేదు. అసలు గూడు అల్లలేదు. (పక్షులు గూడును నిర్మించుకుంటాయి. )


సాలీడు తన గూడులో చిక్కుకున్న కీటకాల మీద విషయం విరజిమ్ముతుంది కదా ! మనల్ని కుట్టినా ఆ విషం ప్రమాదకరమేనా ?


- బ్రెజిల్‌కు చెందిన 'ఫోన్యూట్రియా ఫెరా' అనే జాతి సాలీడు ప్రపంచంలోకెల్లా అత్యంత విషపూరితమైంది. ఈ సాలీడు కుడితే ఒళ్ళంతా నొప్పులు, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. 


పురుషులకైతే, ఈ అస్వస్థతలతో పాటు అంగం స్తంభించిపోతుంది. ఈ సాలీడు మీద పరిశోధకులు లోతుగా అధ్యయనాలు జరిపి, చివరకు రహస్యాన్ని ఛేదించారు. కుట్టినప్పుడు ఈ సాలీడు ఎక్కిస్తున్న విషంలోని ఒక రకమైన పెప్టైడ్ రసాయనమే ఈ 'అవాంఛిత స్తంభన'కు కారణమవుతోందని గ్రహించారు. బ్రెజిల్ విషయం ఎలా వున్నా, మన ఇళ్ళలో ఆహారపదార్థాల మీద పాకడం ఏమాత్రం మంచిది కాదు.


💥సాలీళ్ళ గూళ్ళ వైశాల్యం ఏఏ రకాలుగా ఉంటుంది ?


'నెఫిలా' అనే జాతికి చెందిన సాలీడు 18 అడుగుల చుట్టుకొలతగల గూళ్ళను అల్లగలుగుతుంది. 'గ్లిఫెసిన్ కాటనే' అనే మరో జాతి సాలీళ్ళు అల్లే గూడు వైశాల్యం కేవలం ముప్పాతిక చదరపు అంగుళం ఉంటుంది.


💥సాలీళ్ళ జీవిత కాలం ఎంత ?


- కొన్ని జాతుల సాలీళ్ళు సాధారణంగా సంవత్సరకాలం జీవిస్తాయి. అయితే కొన్ని 15 సంవత్సరాలు జీవించే జాతులూ ఉన్నాయి. ఇవి కీటకాల వర్గంలోకి రావు. పక్షులను ఆరగించేవే 15 సంవత్సరాలు బతికేవి. ఈ జాతిని 'టరాంటులా' అని పిలుస్తారు.