What are the advantages of radium?

1. రేడియం వలన లాభనష్టాలు ఏమిటి? 


👉సూర్యకాంతి తరహాలోనే మన దేహం రేడియంను స్వీకరిస్తుంది. లైంగిక రుగ్మతలకు, నివారణలకు, అల్సర్లకు, మదుమేహ వ్యాధికి రేడియం మంచి ఔషధం అనే ప్రచారం గతంలో వుండేది. 


👉ఆనాడు ఈ మూలకపు విషప్రభావం సాధికారికంగా తెలియదు. ఎక్కువ మోతాదులో, ఏ రూపంలో రేడియంను తీసుకున్నా శరీరం శిధిలమవుతుంది. శరీరంలో ఒక మైక్రోగ్రామ్ రేడియం చేరితే కేన్సర్ వస్తుందని పరిశోధనలు తేల్చాయి. 


👉0.1 మైక్రోగ్రామ్ రేడియమ్ వలన శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ గణనల ఆధారంగానే ఈ రోజున అణుసంస్థలలో పరిమితి ప్రమాణాలు పాటిస్తున్నారు. 


👉అణుకేంద్రాలు, సంస్థల ఉద్యోగులు జీవితకాలంలో 0.3 మైక్రోక్యూరీల ప్రమాణం వరకు రేడియేషన్ భరించగలరని తేలింది. 5 మైక్రోగ్రాముల ప్లుటోనియం 0.1 మైక్రోగ్రాము రేడియంతో సమానం. రేడియో ధార్మిక శక్తిని క్యూరీ యూనిట్లలో కొలుస్తారు. 


👉ఒక గ్రాము రేడియం ఒక క్యూరీకి సమానం. అణుధార్మిక మూలకాలలో ఫ్లూటోనియం ఎంతో ప్రమాదకరమైనది. 


👉5 నుంచి 0.06 మైక్రో క్యూరీల ఫ్లూటోనియం వరకు మానవ శరీరం తట్టుకోగలదని ప్రమాణీకరించారు.


2. 'ఈ-కోలి' బాక్టీరియా గొప్పతనం ఏమిటి ? 


👉ఆధునిక జీవితంలో విద్యుత్తు అవసరాన్ని, దాన్ని తీర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగానే మసాచుసెట్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఓ బ్యాక్టీరీయా సాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేయగల వినూత్న ఫ్యూయల్ సెల్ ను సిద్ధం చేశారు. సాధారణ చక్కెర (గ్లూకోజ్ )తో పాటు పండ్లలో, దుంపల్లో, కర్రలో ఉండే సుక్రోజ్, ఫ్రక్టోస్, క్సైలోలను కూడా ఈ బ్యాటరీ ద్వారా విద్యుత్తుగా మార్చవచ్చు. 


👉చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరమైన విద్యుత్తును ఈ టెక్నాలజీ ద్వారా ఎక్కడైనా ఉత్పత్తి చేసుకునే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. 


👉బ్యాక్టీరియాతో పనిచేసే బ్యాటరీలు తయారు చేసేందుకు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. 


👉ఈ క్రమంలోనే 2002లో బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు వంటింటి వ్యర్థాలను విద్యుత్తుగా మార్చేందుకు సిద్ధం చేసిన ఫ్యూయల్ సెల్స్ ను శ్రేణిలో అనుసంధానించడం ద్వారా బల్బులను కూడా వెలిగించుకోవచ్చునని తేలింది. 


👉అయితే ఈ-కోలీ తన జీవనం, శక్తి కోసం చక్కెరలను ఇతర రసాయనాలుగా మారుస్తుంది. ఈ క్రమంలో విడుదలయ్యే కొద్దిపాటి ఎలక్ట్రాన్ల కారణంగా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. 


👉విడుదలయ్యే ఎలక్ట్రాన్స్ లో దాదాపు 10 శాతం మాత్రమే విద్యుత్తుగా మారేది. మాసాచుసెట్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు డెరెక్ ఆర్. 


👉లబ్లీ ఉపయోగించిన రోడోఫెరాక్స్ ఫెరిరిడ్యూసిన్స్ బ్యాక్టీరియా దీనికి భిన్నంగా వ్యవహరిస్తుంది. సముద్రపు అట్టడుగు ప్రాంతాల్లో ఉండే ఈ బ్యాక్టీరియాను కొన్నేళ్ళ క్రితం డెరెక్ ఆర్.


 👉లబ్లీ బృందం కనుక్కున్నది. ఆక్సిజన్ లేని అటువంటి ప్రాంతాల్లో ఇవి కేవలం ఇనుము ఆధారంగా జీవిస్తాయి. సముద్రగర్భంలోని కార్బనను బొగ్గు పులుసు వాయువుగా మార్చి... ఆ క్రమంలో విడుదలైన రం శాతం వాటిని ఎలక్ట్రోడ్ కు అందజేస్తుంది. ఇవి సర్క్యూట్ ద్వారా ప్రయాణించడం వల్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. 


👉అంతేకాదు. నిలకడగా ఎక్కువ కాలంపాటు విద్యుత్తును అందివ్వగల సామర్ధ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. ఈ టెక్నాలజీలో ఇప్పటికిప్పుడు భారీస్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేయగలమని ఆశించలేం. కాకపోతే సెన్సర్లు, కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్ వంటి సూక్ష్మ పరికరాలకు అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. 


👉డా. లబ్లీ పరిశోధనశాలలో సిద్ధం చేసిన తొలి నమూనా బాక్టీరియా బ్యాటరీ ద్వారా ఓ కాలిక్యులేటర్ పనిచేసేందుకు తగిన విద్యుత్తు (200 మైక్రో యాంపియర్లు) ఉత్పత్తి అయింది. 


👉సాంకేతికపరమైన కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచగలిగారు. ఒకసారి ఇంధనాన్ని అందిస్తే ఈ బ్యాటరీ 25 రోజులపాటు నిరంతరం పనిచేస్తూంటుంది.


3. ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులు కంటి చూపుకు కనిపించవు. H,O (ఈ రెండు వాయువులు) కలిసివున్న నీరు మాత్రం కనిపిస్తుంది. ఎందుకని ?


👉హైడ్రోజన్ రెండు పాళ్ళు, ఆక్సిజన్ ఒక పాలు కలసిన నీరులో హైడ్రోజన్ పరమాణువులు 4.0 అణువులుగా ఏర్పడతాయి. 


👉ఈ అణువులు వేటికవే విడివిడిగా నీటిలో ఉంటాయి. ఇదే విధంగా ఆక్సిజన్ కూడా పరమాణువులను కలిగివుండే అణువులతో కలిసివుంటుంది. ఆక్సిజన్ కూడా 0, అణువులు కలిగివుండటంతో ఇవి రెండూ వాయుస్థితిలో వుంటాయి. 


👉ఈ రెండు వాయువుల నడుమ రసాయనిక చర్య జరగడంతో నీరు ఏర్పడుతుంది. రెండు పరమాణువుల హైడ్రోజన్, ఒక పరమాణువు ఆక్సిజన్లు కలిసి ఏర్పడిన ఈ అణువులు ఒక్కొక్కటి మరో నాలుగు అణువులతో బంధం ఏర్పరచుకుంటుంది. వీటినే హైడ్రోజన్ బంధాలని అంటారు.

 

👉ఈ కారణంతో నీరు ద్రవస్థితిలో కనబడుతుంది. ఈ బంధాలు బలహీనంగా ఉండటంతో ద్రవస్థితిలో కనిపిస్తున్నాయి. 


👉ఇవే దృఢంగా వుంటే ఘనస్థితిలో వుండేవి. ప్రతి ఒక పదార్థంలోనూ పరమాణువులు ఉంటాయి గదా. ఈ పరమాణువుల స్థితిగతులను అనుసరించే ద్రవ, వాయు, ఘనరూపాల్లో ఏ పదార్ధమైనా ఉంటుంది. 


👉ఈ పరమాణువులన్నీ ఏ పదార్థంలోనైనా జతకట్టి సమూహాలుగా వుండటంతో అణువులుగా వ్యవహరిస్తాయి. హైడ్రోజన్ (H), ఆక్సిజన్ (0), అణువులు (Molecules), పరమాణువులు (Atoms).


4. నెమలి ఈకలు రంగులతో ఉంటాయి. నెమలి ధాతువును రసాయన శాస్త్రంలో ఏమంటారు ?
👉 రసాయన శాస్త్రంలో నెమలి ధాతువును కాపర్ ఐరన్ సల్ఫైడ్ (Cu5 Fe S4) అంటారు. దీనినే bornite గా వ్యవహరిస్తారు. చల్లటి గాలికి ఇది ప్రభావితమై రంగుల బుకే (పూలబంతి) వలే కనిపిస్తుంది. 


👉ఇది Iridescent tarnish వలన జరుగుతుంది. ఇది వివిధ కాపర్ ఆక్సైడ్ లేదా హైడ్రోఆక్సైడ్స్ తో తయారవుతుంది. 


👉ఇది బోర్నైట్ మీద ఒక అణువంతపలుచటి పొరగా ఏర్పడుతుంది. ఈ పొర మందం కాంతి వేల్టెంగ్ కు సమీపంగా ఉంటుంది. 


👉బోర్నైట్ ఉపరితలంమీద టార్నిష్ పొరకు మధ్య కాంతి తరంగాలు హఠాత్తుగా పడినప్పుడు వేస్ఆంగ్ లతో కూడిన వివిధ రంగులను కాంతి తరంగాలు వదిలివేయగా రెయిన్ బో (ఇంద్రధనుస్సు) తరహాలో కనిపిస్తుంది.