1. వాతావరణ దినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి ?
👉వాతావరణంలో మార్పులను కనిపెట్టడానికి ఎన్ని పరికరాలను, అత్యాధునిక టెలిస్కోప్లను కనుగొన్నప్పటికీ సునామీ వంటి మహోత్పాతకాలు, ఉపద్రవాలు ముంచుకొస్తూనే ఉన్నాయి.
👉వాతావరణ సాంకేతిక పరిశీలనా యంత్రాంగమైతే ఉందిగాని ఏ మాత్రం ప్రయోజనం లేదు. వాస్తవానికి ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ 'వాతావరణం' విషయంలో మాత్రం శైశవదశలోనే ఉందని చెప్పకతప్పదు.
👉కారణం - ప్రకృతిలో కీలక భాగం వాతావరణమే. ప్రపంచదేశాలలో సైతం శాస్త్రజ్ఞులు వాతావరణం విషయంలో ఏమంత విజయసాధన చేయలేకపోతున్నారు.
👉తద్వారా మానవజాతి నిస్సహాయమవుతున్నది. వాతావరణ స్థితిగతులు పసిగట్టి తదనుగుణంగా చర్యలు తీసుకొని మానవాళిని నష్టాల బారినుంచి ఏవిధంగా కాపాడాలనే అంశం మీద ప్రతి దేశమూ దృష్టి సారించే నిమిత్తం ప్రతి ఏటా మార్చి 23వ తేదీన 'ప్రపంచ వాతావరణ దినం' జరుగుతోంది.
👉యథాప్రకారంగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కార్యక్రమాలను జరుపుతూ చేతులు దులిపేసుకుంటున్నది.
👉ప్రపంచంలో తొలుత 1950లో ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు కావడంతో ఈ అంశం మీద వివిధ తరహాల పరిశోధనలు చేపట్టడం ద్వారా వాతావరణ శాస్త్రజ్ఞులు కొన్ని కీలక విషయాలను కనుగొనడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
👉అయితే అవేమీ సఫలీకృతం కాలేదు. ప్రపంచదేశాల శాస్త్రజ్ఞులందరూ ఈ అంశంమీద ఏకం కావలసిన అవసరం ఏర్పడింది.
👉'బ్యూరో ఆఫ్ మెటీరియోరాలజీ' (మెల్ బోర్న్ - ఆస్ట్రేలియా) ఏర్పాటయింది. 1963లో 'వరల్డ్ వెదర్ వాచ్' ప్రారంభమైంది.
👉ఇక, మన దేశంలో అయితే అన్ని పరిశోధనలూ నత్తనడక నడవడమే కాదు, నిరుపయోగంగా తయారవుతున్నాయి.
👉సునామీ వంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు, వాటిని ముందుగా కనుగొనడంలో పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు విఫలమై ఖంగు తిన్నాయి.
👉ప్రపంచ వాతావరణ దినోత్సవం నాడైనా వాతావరణం సారించడం అవసరమనిపించడంతో ఈ 'దినాలు' జరుపుకుంటున్నారు.
2. వాతావరణ మార్పుల వల్ల నష్టాలేమిటి ?
👉అనేకం ఉన్నాయి. వాతావరణ మార్పులను ప్రభావితం చేసే తెలుసుకుందాం.
👉ఈ అంశాలలో ఒకటైన సముద్ర మట్టాల పెరుగుదలకు మళ్ళీ ప్రధానంగా రెండు అంశాలు దోహదం చేస్తాయి.
👉ఉష్ఠభూతం వల్ల నీరు విస్తరిస్తుండటం ఒక మంచు ద్రవిస్తుండటం మరొక కారణం.
👉అంశాలను ముందుగా కారణమైతే,మంచు ద్రవిస్తుండడం మరొక కారణం.
👉వాతావరణ మార్పు వల్లనే మహాచక్రవాతాలు లేదా | పెను తుపాన్లు (హారికేన్స్) వస్తున్నాయి.
👉వాతావరణంలోని ఉష్ణోగ్రతను కొలిచినంత తేలికగా | హరికేన్ పౌనఃపున్యతను, సాంద్రతను గణించలేం. |
👉సంవత్సరాలుగా మహాసముద్రంలో సంభవిస్తున్న తుపాన్ల సంఖ్య | అట్లాంటిక్ రెట్టింపు అయ్యాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయనీ, దీంతో పెనుతుపాన్లను చవి చూస్తున్నామని శాస్త్రవేత్తలు అంటున్నారు.
👉వాతావరణంలోని మార్పులను శాస్త్రీయంగా ఎలా గుర్తించుతారు ?
👉కోట్ల కొద్దీ గ్రహాలూ, నక్షత్రాలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే 'అంతరిక్షం' అనే అద్భుత ప్రపంచం నుంచి కొన్న శక్తి మంతమైన కిరణాలు, రేణువులు నిరంతరం మన భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి.
👉ఆ విధంగా ప్రవేశించిన ఆ ప్రత్యేకమైన రేణువుల ఆధారంగా - మన భూ ఉపరితల వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను ముందుగానే గుర్తించవచ్చునని శాస్త్రజ్ఞులు 'ఊహిస్తున్నారు'.
👉అంతరిక్షం నుంచి కొన్ని 'కాస్మిక్ కిరణాలు' వాతావరణం పైపొరలను ఢీ కొనగానే వాటినుంచి కొన్ని రేణువులు వానజల్లుగా ఉద్భవించి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి.
👉ఈ విధంగా ఏర్పడిన ఈ రేణువుల సంఖ్యను లెక్కించడం ద్వారా వాతావరణ ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులను ముందుగానే గుర్తించవచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
3. ప్రాచీనకాలంలో వాతావరణ శాస్త్రమంటూ ఏదీ లేదా?
👉పూర్వకాలంలో దీని అవసరం ఏమంతలేదు. ఈ రోజున ఈ అవసరం బాగా బలపడింది.
👉ఏ రోజుకారోజు ఉష్ణోగ్రతలను నమోదు చేయగలగడంతో పాటు వాతావరణంలో వచ్చే వివిధ మార్పులను ముందుగానే తెలుసుకోగలగడం.
👉ఆధునిక మానవాళికి దైనందిన జీవనావసరంగా మారింది. ఇక, చరిత్రగర్భంలోకి వెళితే -
👉క్రీ.పూ. 500 లోనే గ్రీకులు వాతావరణ పరిస్థితులలోని మార్పులను నమోదు చేయడం ప్రారంభించారు.
👉ఆ తర్వాత క్రీ.పూ. 300 లో థియోఫాస్టస్ అనే గ్రీక్ శాస్త్రవేత్త రెండు వేల సంవత్సరాల కాలం వరకూ వాతావరణంలో చోటు చేసుకొనే మార్పులను గురించి ఏకంగా ఒక పుస్తకమే రాసాడు.
👉దీనినే 'బుక్ ఆఫ్ సైన్స్' అంటారు. ఇందులో వాతావరణంలోని మార్పులను గుర్తించేందుకు ఉపయోగపడే సహజ సంకేతాలను దాదాపు 200 వరకు పేర్కొనడం జరిగింది.
👉వీటిలో కొన్ని సంకేతాలను ఈ నాటికీ ఉపయోగించుకుంటున్నారు. ఉదయం పూట ఆకాశం ఎర్రగా కుంకుమ అద్దుకున్నట్లుగా ఉంటే సముద్రంలోకి వెళ్ళే నావికులు దానిని హెచ్చరికగా భావించవలసి వుంటుంది.
👉ఎన్నో శతాబ్దాల వరకూ ఈయన రచించిన సంకేతాలు ఆధా రంగానే వాతా వర ణాన్ని 'ఊహించడం జరిగేది. ఆ తర్వాత కొన్ని శతాబ్దాల వర్యంతం వాతా వరణ శాస్త్రం లో ఎటువంటి పురోభివృద్ధి జరగలేదనే చెప్పాలి.
👉క్రీ.శ. 7వ శతాబ్దంలో గెలీలియో మొట్టమొదటగా 'థెర్మోమీటర్'ను కనుగొనడంతో వాతావరణ పరిశీలన శాస్త్రంలో కొత్త శకం ప్రారంభమైంది.
👉వాయువేగంలో వచ్చే మార్పులనూ, వాతావరణంలోని తేమను, ఉష్ణోగ్రతనూ, తుపాన్ల రాకపోకలనూ, ఇలా వాతావరణానికి సంబంధించిన వివిధ విషయాలను క్రమబద్ధంగా గుర్తించేందుకు రకరకాల పరికరాలను కనుగొన్నారు.
👉18వ శతాబ్దం మధ్యలో బెంజిమన్ ఫ్రాంక్లిన్ కనుగొన్న సరికొత్త సిద్ధాంతం వాతావరణ శాస్త్రంలో మేలి మలుపుగా చెప్పవచ్చు. ఒక ప్రదేశంలోని వాతావరణం కేవలం అక్కడికి మాత్రమే పరిమితం కాదు.
👉ముఖ్యంగా పెనుగాలులు, సైక్లోన్లు వంటివి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూసుకువస్తాయని తెలియవచ్చింది.
👉ఆ తర్వాత, టెలిగ్రాఫ్ లైన్స్ కనుగొనడం ద్వారా కచ్చితంగా వాతావరణాన్ని అంచనా వేయగలమని తెలుసుకున్నారు.
👉ఆధునిక వాతావరణనిపుణులు వివిధ వాతావరణ పొరల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు హైడ్రోజన్, హీలియం వాయువులతో నింపిన బెలూన్లను ప్రయోగించారు.
👉ఆ క్రమంలో రూపుదిద్దుకుంటున్నవే రాడార్లు, శాటిలైట్లు. మొట్టమొదటిగా అమెరికా 'టైరస్ (టెలివిజన్ ఇన్ ఫ్రారెడ్ అబ్జర్వేషన్ శాటిలైట్) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది.
👉ఇదీ అతి సంక్షిప్తంగా వాతావరణ శాస్త్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన తీరు!
4. వాతావరణంలోని ఉష్ణోగ్రతలను ఎలా లెక్కిస్తారు ?
👉భూమి ఉపరితల పొరల్లోని ఉష్ణోగ్రతా వ్యత్యాసాలను శాటిలైట్లు, రాడార్లకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలిస్తారు.
👉వాతావరణంలోని కింది పొరల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలను ఆధునిక థర్మామీటర్ ద్వారా తెలుసుకుంటారు.
👉వీటి ద్వారా వివిధ ప్రదేశాల్లోని వాతావరణ పరిశోధన కేంద్రాలకు చెందినవారు, ఆయా ప్రదేశాలలో నమోదైన కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలను నిర్ణీతవేళల్లో లెక్కిస్తుంటారు.
👉సాధారణంగా మన రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల సమయంలోనూ ఉష్ణోగ్రతను రికార్డు చేస్తారు.
👉అయితే సముద్రమట్టానికి సంబంధిత ప్రదేశం ఎంత ఎత్తులో ఉందో, దాని ప్రకారం ఉష్ణోగ్రత వివరాలను నమోదు చేసే సమయాన్ని 'ఇండియన్ మెటియోరాలాజికల్ డిపార్ట్ మెంట్' నిర్ణయిస్తుంది.
5. సాధారణంగా నావికులు మన దేశం నుంచి ఆఫ్రికా ప్రయాణించేందుకు శీతాకాలాన్ని, తిరిగి మన దేశానికి వచ్చేందుకు వేసవినీ ఎంచుకుంటారు ? ఎందుకని ?
👉పూర్వకాలంలో సముద్ర ప్రయాణికులు రుతుపవనాలు వీచే దిశగా అంటే - వాటితో పాటుగా ప్రయాణించే వారు.
👉శీతాకాలంలో రుతుపవనాలు ఈశాన్యం నుంచి నైరుతి దిశవైపుగా ప్రయాణిస్తాయి కాబట్టి, ఆ సమయంలో మన దేశం నుంచి ఆఫ్రికాకు ప్రయాణించేవారు. అదేవిధంగా వేసవిలో నైరుతి నుంచి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశిస్తాయి కాబట్టి, ఆ సమయంలో - ఆఫ్రికా నుంచి తిరుగు ప్రయాణమయ్యేవారు.
6. రుతుపవనాలు ఏర్పడటానికి, వాతావరణానికి సంబంధం ఉందా ?
👉భూమి మీద వాతావరణం ఎప్పుడూ ఒకేలా వుండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వుంటుంది. ఇలా జరగడానికి కారణం భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు తన కక్ష్యలో 23.5 డిగ్రీలు ఒక వైపుకు వంగి వుండడమే.
👉ఇలా భూమి అక్షం వాలి వుండటం వలన భూమిమీద వాతావరణ భేదాలేర్పడి రుతువులేర్పడుతున్నాయి.
👉ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు తిరిగి వున్నప్పుడు శీతాకాలం. ఉత్తరార్ధగోళం సూర్యునికి ఎడంగా వెళ్ళినప్పుడు, అంటే దక్షిణార్ధగోళం సూర్యుని వైపు వాలినప్పుడు ఉత్తరాన శీతాకాలం, దక్షిణాన వేసవి వస్తాయి. ఈ
👉ఆంగ్లేయులకు రుతువులు నాలుగే : వసంతకాలం (Spring), వేసవికాలం (Summer), ఆకురాలుకాలం(Antumn), శీతాకాలం (Winter). కాని మనకు రుతువులు ఆరు. వసంత రుతువు, వర్ష రుతువు, శరదృతువు, హిమవంత (హేమంత) రుతువు, శిశిర రుతువు, ఇంగ్లిష్ వారి ఒక్కొక్క కాలానికి మూడు నెలలు కాగా మన రుతువుకు రెండు నెలలు.